Gmail New Design : జీ మెయిల్ లో మోడ్రన్ ఫీచర్స్

  • Published By: madhu ,Published On : July 17, 2020 / 12:17 PM IST
Gmail New Design : జీ మెయిల్ లో మోడ్రన్ ఫీచర్స్

సోషల్ మీడియాలోని Gmail, Facebook, Twitter, Instagramఇతర వాటిని ఎంతోమందిని ఉపయోగిస్తుంటారు. ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఆయా సంస్థలు కొత్త కొత్త టెక్నాలజీని, న్యూ ఫీచర్స్ ను అందుబాటులోకి తెస్తున్నాయి.

ఇప్పటికే కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చాయి కూడా. త్వరలో Gmail New Design గా ముందుకు రాబోతోంది. జీమెయిల్ స్వరూపం మారబోతోంది. ప్రస్తుతం ఉన్న ఫీచర్స్ కు తోడు..మరిన్ని మోడ్రన్ ఫీచర్స్ రాబోతున్నాయి. ఇందుకు గూగుల్ సంస్థ జీ మెయిల్ రీ డిజైన్ చేస్తోంది.

ఇప్పటి వరకు ఈ మెయిల్ (gmail.com) కోసమే అధికంగా వినియోగిస్తున్న gmail ఇకపై వర్క్ ప్లేస్ కు అనుగుణంగా వినియోగించుకొనేలా మార్చబోతున్నారు.
రీ డిజైన్ ప్రకారం…స్క్రీన్ కింది భాగంలో Mail, Chat, Meet for video calling and Rooms ఉండనున్నట్టు సీనెట్ వెల్లడించింది.

Slack rooms తరహాలోనే పని చేసే చోట టీమ్ కొలాబరేషన్‌కి అనువుగా ఉండనుంది. కొన్ని ఆప్షన్స్‌ని ఒక్క చోట చేర్చడం, ఇంకొన్ని ఫీచర్స్‌ని ప్రస్తుత తీరు కంటే మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్టు ప్రోడక్టివీ యాప్స్‌కి బాద్యులైన జీ సూట్ డివిజన్‌ చీఫ్ జేవియర్ సొల్టెరో తెలిపారు.

కరోనా కారణంగా Google meet వినియోగం భారీగ పెరిగిపోతోందని Google వెల్లడించింది. Google Meetలో రోజు 3 మిలియన్స్ యూజర్ వచ్చి చేరుతున్నారని Google CEO Sundar Pichai వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లకు పైగా Google meet ని డౌన్ లౌడ్ చేసుకున్నారు.