iPhone 13 Pro Hack : ఆపిల్‌కు చెమటలు పట్టించిన చైనా హ్యాకర్లు.. సెకన్‌లో ఐఫోన్‌ 13ప్రో హ్యాక్!

ఆపిల్‌కు చైనా హ్యాకర్లు షాక్ ఇచ్చారు. గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో చైనా మార్కెట్ కొల్లగొట్టిన ఆపిల్ దిగ్గజానికి చైనా హ్యాకర్లు చెమటలు పట్టించారు.

iPhone 13 Pro Hack : ఆపిల్‌కు చెమటలు పట్టించిన చైనా హ్యాకర్లు.. సెకన్‌లో ఐఫోన్‌ 13ప్రో హ్యాక్!

Chinese Hackers Break Into Iphone 13 Pro In 15 Seconds

iPhone 13 Pro Hack : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్‌కు చైనా హ్యాకర్లు షాక్ ఇచ్చారు. గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో చైనా మార్కెట్ కొల్లగొట్టిన ఆపిల్ దిగ్గజానికి చైనా హ్యాకర్లు చెమటలు పట్టించారు. ఆపిల్ ఐఫోన్‌లోని సెక్యూరిటీని బ్రేక్ చేశారు. కేవలం ఒక సెకన్ వ్యవధిలోనే iPhone 13proలోకి చొరబడ్డారు. ఇది చైనా హ్యాకర్ల పనే అని గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ (Global Market Research) కెనాలిస్ నివేదిక వెల్లడించింది. ఆపిల్ ‘ఐఫోన్‌-13pro’ను ‘వైట్‌ హ్యాట్‌’ హ్యాకర్స్‌ హ్యాక్ చేసినట్టుచైనాకు చెందిన సంస్థ కెనాలిస్ రిపోర్ట్‌లో పేర్కొంది. కెనాలిస్ నివేదిక ప్రకారం.. 2021లో Q3 ఫలితాలు రిలీజ్ చేసింది.

ఇందులో టెక్‌ దిగ్గజం ఆపిల్ 15 శాతం వాటాతో దూసుకెళ్లింది. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమిని సైతం బీట్ చేసింది. ఈ క్రమంలోనే ఐఫోన్ 13కు భారీ డిమాండ్ పెరిగింది. ఆపిల్ దెబ్బకు షావోమీ రెండో స్థానానికి దిగజారింది. ప్రతి ఏడాది ఆపిల్ ‘ఆపిల్ వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫిరెన్స్‌’ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్‌’ ద్వారా సెప్టెంబర్‌ 14న ఆపిల్ కాన్ఫిరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆపిల్ ఐఫోన్‌ 13 సిరీస్‌ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. ఆపిల్ దెబ్బకు దెబ్బ తీయాలనకున్నారో లేదో తమ స్కిల్స్ కు పదునుపెట్టాలని భావించారో తెలియదు కానీ ఆపిల్ పవర్ ఫుల్ సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన ఐఫోన్ 13ప్రోను హ్యాక్ చేశారు చైనా హ్యాకర్లు.
Apple Watch Series 7 : ఆపిల్‌ వాచ్‌ సేల్స్‌.. భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఫీచర్లు కిరాక్!

మరోవైపు ఆపిల్ కంపెనీ ప్రతినిధులు మాత్రం.. రిలీజ్ చేసిన ఐఫోన్లలో యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో ఎలాంటి రాజీపడేది లేదని స్పష్టం చేశారు. కానీ చైనా ‘వైట్‌ హ్యాట్‌’ హ్యాకర్స్‌ మాత్రం ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను హ్యాక్ చేసినంత సులభంగా ఆపిల్ ఐఫోన్లను కూడా హ్యాక్ చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. అన్నట్టుగానే ఆపిల్ రిలీజ్ చేసిన ఐఫోన్ 13ప్రో సిరీస్ లో (iOS 15.0.2) సెక్యూరిటీని హ్యాక్ చేసి చూపించారు చైనా హ్యాకర్లు. ఆపిల్ రిలీజ్ చేసిన ఐఫోన్‌ 13సిరీస్‌ ఫోన్‌లను సెకన్లలో హ్యాక్‌ చేయొచ్చని తెలిపారు. చైనాలో ఇటీవలే 4వ ‘Tianfu Cup’ ఇంటర్నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ కాంటెస్ట్‌ జరిగింది. ఈ కాంటెస్ట్‌లో వైట్ హ్యాట్‌ హ్యాకర్‌ ఐఫోన్ 13 ప్రోని సెకన్‌లలో హ్యాక్‌ చేసి చూపించాడు.

అంతేకాదు.. హ్యాక్ చేసిన ఐఫోన్‌లోని హ్యాకర్‌ ఐఫోన్‌లో ఫొటో ఆల్బమ్‌, యాప్‌లకు యాక్సెస్ చేశాడు. అలాగే డేటాను ఈజీగా డిలీట్‌ చేయొచ్చునని ఐథోమ్ నివేదికలో వెల్లడించింది. ఈ ఐఫోన్‌13pro హ్యాకింగ్‌పై ఆపిల్ కంపెనీ ఇంకా స్పందించలేదు. సాధారణంగా ఫోన్ల సెక్యూరిటీ సామర్థ్యాన్ని టెస్టింగ్ చేసేందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు వైట్ హ్యాట్‌ హ్యాకర్లు లేదా ఎథికల్ హ్యాకర్స్ ను నియమించుకుంటాయి. వీరంతా ఫోన్ల టెక్నాలజీలో ఏమైనా బగ్స్, లోపాలు ఉన్నాయో లేదో టెస్టింగ్ చేస్తుంటారు.
Apple Festive Offer: భారత్‌లో ఐఫోన్ 13 సిరీస్‌పై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!