30 నిమిషాల్లో హ్యాకింగ్ చేసేయొచ్చట

30 నిమిషాల్లో హ్యాకింగ్ చేసేయొచ్చట

లోకల్‌ నెట్‌వర్క్‌ ఏదైనా కేవలం 30 నిమిషాల్లో మాత్రమే హ్యాకింగ్ చేసేయొచ్చట. పాజిటివ్ టెక్నాలజీస్ అనే సంస్థ చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. లోకల్‌ నెట్‌వర్క్‌లు ఎంత తేలికగా హ్యాకింగ్‌కు గురవుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో పాజిటివ్‌ టెక్నాలజీస్‌ ఈ ప్రయోగం చేసింది. ఎంత తేలికగా హ్యాక్‌ చేయొచ్చొ తెలిసేలా చేసింది.

హాస్పిటళ్లు, కార్పొరేట్‌ కంపెనీలు, ఫైనాన్స్‌, ఐటీ, టూరిజం ఇలాంటి పరిశ్రమలన్నింటికి సంబంధించిన వాటిని పరీక్షించి చూశారు. ఇందులో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.ప్రతి ఆరు కంపెనీల్లో ఒకటి తేలికగా హ్యాంకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. నిజమైన హ్యాకర్లు ఎలా అటాక్ చేస్తారో.. అలా ట్రై చేశారు.

ఇలా చేయడానికి పెంటెస్ట్‌ అని హ్యాకర్లను పెంటెస్టర్లు అని అంటారు. పాజిటివ్ టెక్నాలజీస్ పరీక్షించిన సంస్థలలో 93 శాతం స్థానిక నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయగలిగారు. ఈ ప్రయోగంలో కొన్ని సంస్థల డేటా గతంలో హ్యాకింగ్‌ బారిన పడినట్లు తెలిసింది.

స్థానిక నెట్‌వర్క్‌ని హ్యాక్‌ చేయడానికి మినిమం అరగంట సయం పట్టడం నుంచి గరిష్టంగా 10 రోజుల వరకు పట్టొచ్చు. చాలా సందర్భాల్లో అటాకింగ్ అనేది కష్టంగా ఉండదని.. బేసిక్ టాలెంట్ ఉన్న హ్యాకర్ ప్రవేశించడానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. వీటిలో కనీసం ఒక డొమైన్ ఖాతా పాస్‌వర్డ్‌ను హ్యాకర్ విజయవంతంగా ఛేదించ గలిగితే వారు ఇతర వినియోగదారుల పాస్‌వార్డులను ఆఫ్‌లైన్‌లో హ్యాక్‌ చేయవచ్చట.

ఈ పెంటెస్ట్ ప్రయోగంలో పాజిటివ్ టెక్నాలజీస్ 90వేల ఈ మెయిల్స్‌ను తెలుసుకోగలిగింది.