Credit Card UPI Payments : మీకు క్రెడిట్ కార్డు ఉందా? యూపీఐలో రూపే క్రెడిట్ కార్డుతో పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఎలా లింక్ చేయాలంటే?

Credit Card UPI Payments : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఇప్పటినుంచి యూపీఐలో రూపే క్రెడిట్ కార్డుతో పేమెంట్స్ చేసుకోవచ్చు. సాధారణంగా యూపీఐ పేమెంట్లను బ్యాంకు అకౌంట్ ద్వారా చేయొచ్చు.

Credit Card UPI Payments : మీకు క్రెడిట్ కార్డు ఉందా? యూపీఐలో రూపే క్రెడిట్ కార్డుతో పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఎలా లింక్ చేయాలంటే?

HDFC Bank Customer_ Now Use your RuPay Credit Card for UPI payments

Credit Card UPI Payments : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఇప్పటినుంచి యూపీఐలో రూపే క్రెడిట్ కార్డుతో పేమెంట్స్ చేసుకోవచ్చు. సాధారణంగా యూపీఐ పేమెంట్లను బ్యాంకు అకౌంట్ ద్వారా చేయొచ్చు. కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కూడా ఈజీగా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు. మీ వద్ద HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు (HDFC Bank Credit Card) ఉంటే చాలు.. HDFC బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ కస్టమర్లు తమ కార్డులతో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. ఈ కొత్త ఫెసిలిటీని HDFC బ్యాంక్ ప్రకటించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (NPCI) భాగస్వామ్యంతో HDFC బ్యాంక్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

HDFC బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు BHIM యాప్, ఇతర UPI యాప్స్‌లో పేమెంట్స్ చేసుకోవచ్చు. భారత్‌లో రూపే క్రెడిట్ కార్డ్‌తో UPI లావాదేవీలకు అనుమతి ఇచ్చిన ఫస్ట్ ప్రైవేట్ రంగ బ్యాంకుగా HDFC బ్యాంక్ అవతరించింది. HDFC బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌లు యూపీఐ ఐడీకి లింక్ చేసుకోవచ్చు. సేఫ్ పేమెంట్స్ లావాదేవీలను చేయొచ్చని HDFC ప్రకటించింది. అంతేకాదు.. HDFC కస్టమర్‌లు, వ్యాపారులకు అనేక బెనిఫిట్స్ అందించనుంది. HDFC బ్యాంక్ కస్టమర్‌లు తమ క్రెడిట్ కార్డ్‌లను UPIతో లింక్ చేయడం ద్వారా అనేక QR కోడ్‌లను కూడా ఈజీగా స్కానింగ్ చేసుకోవచ్చు.

UPIలో రూపే క్రెడిట్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలంటే? :
* NPCI వెబ్‌సైట్ ప్రకారం.. మీరు మీ రూపే క్రెడిట్ కార్డ్‌ని UPIతో ఇలా లింక్ చేయవచ్చు.
* Google Play Store నుంచి BHIM యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
* రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
* క్రెడిట్ కార్డ్‌ని ఆప్షన్ ఎంచుకోండి.
* డ్రాప్ డౌన్ నుంచి మీ బ్యాంక్ పేరును ఎంచుకోండి.
* మీ జారీ చేసే బ్యాంక్‌తో మొబైల్ నంబర్ అప్‌డేట్ ఆధారంగా మాస్క్‌డ్ క్రెడిట్ కార్డ్‌లు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
* మీరు లింక్ చేయాలనుకునే కార్డ్‌ని ఎంచుకోండి.
* UPI PINని క్రియేట్ చేసేందుకు Continue చేయండి.

HDFC Bank Customer_ Now Use your RuPay Credit Card for UPI payments

HDFC Bank Customer_ Now Use your RuPay Credit Card for UPI payments

Read Also : Paytm UPI Lite Payments : పేటీఎంలో సరికొత్త ఫీచర్.. ఇకపై పిన్ లేకుండానే ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు..!

UPIలో రూపే క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ ఎలా చేయాలంటే? :
* బిజినెస్ UPI లేదా కోడ్‌ని Scan చేయండి.
* మొత్తాన్ని రిజిస్టర్ చేయండి లేదా ఆటోమాటిక్‌గా పొందిన మొత్తంతో చెల్లించండి.
* క్రెడిట్ అకౌంట్ ఎంచుకోండి.
* UPI PIN తర్వాత రూపే క్రెడిట్ అకౌంట్ ఎంచుకోండి.
* లావాదేవీ హిస్టరీ వివరాలను చెక్ చేయండి.

UPIలో క్రెడిట్ కార్డ్‌ని అందిస్తున్న ఇతర బ్యాంకులు ప్రస్తుతం, NPCI వెబ్‌సైట్ ప్రకారం.. UPI పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్‌లో రూపే క్రెడిట్ కార్డ్‌ని లింక్ చేసేందుకు మూడు బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల, PayTmపేమెంట్స్ బ్యాంక్ UPIలో రూపే క్రెడిట్ కార్డ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇంకా, పేమెంట్ గేట్‌వే, Razorpay యూజర్లు తమ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి UPI యాప్‌ల ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చు. Razorpay వెబ్‌సైట్‌లోని బ్లాగ్ ప్రకారం.. తమ క్రెడిట్ కార్డ్‌లను తీసుకెళ్లకుండానే క్యాష్ ప్లో నిర్వహించడానికి క్రెడిట్‌ను ఉపయోగించవచ్చు.

HDFC Bank Customer_ Now Use your RuPay Credit Card for UPI payments

HDFC Bank Customer_ Now Use your RuPay Credit Card for UPI payments

UPIలో రూపే క్రెడిట్ కార్డ్‌లు అంటే ఏమిటి :
NPCI వెబ్‌సైట్ ప్రకారం.. UPIలోని RuPay క్రెడిట్ కార్డ్‌లు కస్టమర్‌లకు డిజిటల్‌గా ఎనేబుల్ చేసిన క్రెడిట్ కార్డ్ లైఫ్‌సైకిల్ అనుభవాన్ని అందిస్తాయి. యూపీఐ యూజర్లు తమ క్రెడిట్ కార్డ్‌లతో అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. అసెట్ లైట్ QR కోడ్‌లను ఉపయోగించి క్రెడిట్ కార్డ్‌ల అంగీకారంతో క్రెడిట్ ఎకోసిస్టమ్‌ ద్వారా వినియోగదారులు అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

Read Also : Tech Tips : మీ మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే ఇలా చేయండి.. ఇదిగో సింపుల్ టిప్స్ మీకోసం..!