అదిరిపోయే ఫీచర్లు : నోకియా కొత్త 4 స్మార్ట్ ఫోన్లు ఇవే

నోకియా లవర్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ HMD గ్లోబల్ నోకియా ఈ ఏడాది 4 కొత్త ఫీచర్ స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లో అడుగుపెడుతోంది.

  • Published By: sreehari ,Published On : February 25, 2019 / 02:52 PM IST
అదిరిపోయే ఫీచర్లు : నోకియా కొత్త 4 స్మార్ట్ ఫోన్లు ఇవే

నోకియా లవర్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ HMD గ్లోబల్ నోకియా ఈ ఏడాది 4 కొత్త ఫీచర్ స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లో అడుగుపెడుతోంది.

నోకియా లవర్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ HMD గ్లోబల్ నోకియా ఈ ఏడాది 4 కొత్త ఫీచర్ స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లో అడుగుపెడుతోంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల కంపెనీలు బర్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాన్పిరేన్స్ (MWC) వేదికగా తమ కొత్త ప్రొడక్ట్ లను విడుదల చేశాయి. స్మార్ట్ ఫోన్ల కంపెనీలకు పోటీగా హెచ్ఎండీ గ్లోబల్ నోకియా కూడా తమ కొత్త ఫీచర్, స్మార్ట్ ఫోన్లు.. నోకియా 210, నోకియా 1 ప్లస్, నోకియా 3.2, నోకియా 4.2 ను లాంచ్ చేసింది. నోకియా 4.2 ప్రీమియం ఫోన్ తో పాటు నోకియా 210 ఫీచర్ ఫోన్ అత్యంత ఆకర్షణగా నిలిచింది.
Read Also: జియో ఫోన్లలో కొత్త ఫీచర్: గూగుల్ అసిస్టెంట్‌లో 7 కొత్త భాషలు

నోకియా 3.2, నోకియా 4.2 స్మార్ట్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ బటన్, పవర్ బటన్ చుట్టూ LED రింగ్ వంటి స్పెషల్ ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. నోకియా 201 ఫీచర్ ఫోన్ లో డ్యుయల్ సిమ్ కార్డులతో పాటు ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంది. ఈ నాలుగు ఫోన్లను అమెరికాలో మార్చి లేదా ఏప్రిల్ మొదటివారంలో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో నోకియా కొత్త ఫోన్ల ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేద్దాం. 

నోకియా 210:
హెచ్ఎండీ గ్లోబల్ అందిస్తున్న కొత్త ఫీచర్ ఫోన్ నోకియా 210. నోకియా సిరీస్ 30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే ఈ కొత్త ఫీచర్ ఫోన్ లో ఇంటర్నేట్ సదుపాయం ఉంది. ఒపెరా మినీ బ్రౌచర్ పై సులభంగా నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. 2.5జీ డ్యుయల్ సిమ్, రియర్ వీజీఏ కెమెరా ఉంది. వైఫై కనెక్టివీటీ మాత్రం లేదు.అమెరికాలో నోకియా 210 ధర 35 డాలర్లు. చార్ కోల్, రెడ్, గ్రే కలర్లలో లభించనుంది. సమ్మర్ లో మార్చి నుంచి మార్కెట్లో నోకియా 210 ఫీచర్ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.  

నోకియా 210 స్పెషిఫికేషన్లు.. 
* 2.4 అంగుళాల QGVA డిసిప్లే
MT6260A SoC 
నోకియా సిరీస్ 30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్
రియర్ VGA కెమెరా 
ఇంటర్నెట్ కనెక్టవిటీ (Opera mini బ్రౌజర్ ఫ్రీ ఇన్ స్టాల్డ్)
2.5G డ్యుయల్ సిమ్ కార్డు
1020mAh రిమూవబుల్ బ్యాటరీ
అమెరికాలో ఫోన్ ధర 35 డాలర్లు 
చార్ కోల్, రెడ్, గ్రే కలర్ 

నోకియా 1 ప్లస్ :
నోకియా అందించే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ నోకియా 1 ప్లస్. ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ అప్ గ్రేడ్ వర్షన్. ఆండ్రాయిడ్ 9 గో ఎడిషన్ పై రన్ అవుతుంది. అదిరిపోయే ఫీచర్లు నోకియా లవర్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. నోకియా 1 ప్లస్ ధర అమెరికాలో 99 డాలర్లు. ఈ ఫోన్ కూడా రెడ్, బ్లాక్, బ్లూ మూడు కలర్లలో లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి మధ్యలో మార్కెట్లలోకి రానుంది. 

స్పెషిఫికేషన్లు.. 
5.45 అంగుళాల IPS LCD
రేషియో 18:9, మీడియాటెక్ MT6739,క్వాడ్ కోర్ ప్రాసిసెర్
1GB ర్యామ్, ఇన్ బుల్ట్ స్టోరేజీ 8GB, 16GB
రియర్ కెమెరా 8 మెగా ఫిక్సల్, 5మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా
2500mAh బ్యాటరీ
ఆండ్రాయిడ్ 9 గో ఎడిషన్
పాలికార్బోనేట్ షెల్, 8.5 థిక్
రెడ్, బ్లాక్, బ్లూ వేరియంట్స్

నోకియా 3.2 :
నోకియా 3.2 మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో అపగ్రేడ్ వర్షన్. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది. అమెరికాలో ప్రారంభ ధర 139 డాలర్లు ఉంది. ఈ ఏడాది మే నెలలో మార్కెట్లోకి రానుంది. 

స్పెషిఫికేషన్లు 
6.26 అంగుళాల HD ప్లస్
వాటర్-డ్రాప్ డిసిప్లే, 19:9 రేషియో 
క్వాలికామన్ స్నాప్ డ్రాగన్ 429 ఎస్ఒసి
ర్యామ్ 2GB+16GB, రోమ్ 3GB+32GB
మైక్రో SD 400GB ఎక్స్ ప్యాండబుల్
ఎ13 మెగా ఫిక్సల్ ఎఫ్/2.2 ఆటో ఫోకస్ లెన్స్ (బ్యాక్)
5 మెగా ఫిక్సల్ ఫోకస్ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ (రెండు రోజులు ఛార్జింగ్)
ఫేస్ అన్ లాక్, (ఫింగర్ ఫ్రింట్ 32జీబీ వేరియంట్ లో మాత్రమే)
ప్రారంభ ధర: రూ.139 డాలర్లు
వేరియంట్స్: బ్లాక్, పాపులర్ స్టీల్ 

నోకియా 4.2 :
హెచ్ఎండీ గ్లోబల్ అందించే కొత్త స్మార్ట్ ఫోన్లలో నోకియా 4.2 ఒకటి. వాటర్ డ్రాప్ స్టయిల్ నాచ్ డిసిప్లేతో యూజర్లను మరింత ఆకట్టుకునేలా ఉంది. డ్యుయల్ కెమెరా సెట్ అప్ తో పాటు గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఆండ్రాయిడ్ 9 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. నోకియా 4.2 పింక్ శాండ్, బ్లాక్ రెండు వేరియంట్లలో లభించనుంది. యూఎస్ లో ప్రారంభ ధర 169 డాలర్ల వరకు పలుకుతోంది. 

స్పెషిఫికేషన్లు..
5.7 అంగుళాల HD డిసిప్లే, వాటర్ డ్రాప్ స్టయిల్ నాచ్
రేషియో 19:9, 2.5డి కర్వడ్ గ్లాస్
క్వాలికామన్ స్నాప్ డ్రాగన్ 439
2GB+16GB, 3GB+32GB (400GB ఎక్స్ ప్యాండబుల్)
4.2 స్పోర్ట్స్, డ్యుయల్ కెమెరా (బ్యాక్)
13ఎంపీ ఎఫ్/2.2 ఆటో ఫోకస్ లెన్స్
2ఎంపీ ఫిక్సడ్ ఫోకస్ సెకండరీ లెన్స్
గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్
ఫ్రంట్ కెమెరా 13ఎంపీ 
ఆండ్రాయిడ్9 గో ఎడిషన్
రెండు వేరియంట్లు పింక్ శాండ్, బ్లాక్ 
Read Also: సమ్మర్ స్మార్ట్ ట్రెండ్ : కొత్త 5G స్మార్ట్ ఫోన్లు ఇవే