Holi 2023 Tips : హోలీ రోజున మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త.. పొరపాటున నీళ్లలో ఫోన్ పడితే వెంటనే ఇలా చేయండి.. బెస్ట్ టిప్స్ మీకోసం..!

Holi 2023 Tips : హోలీ పండుగ వచ్చేసింది. ప్రతిఒక్కరూ సరదాగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హోలీ వేడుకలు (Holi Celebrations) జరుపుకుంటారు. అయితే, హోలీ ఆడే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

Holi 2023 Tips : హోలీ పండుగ వచ్చేసింది. ప్రతిఒక్కరూ సరదాగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హోలీ వేడుకలు (Holi Celebrations) జరుపుకుంటారు. అయితే, హోలీ ఆడే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి హోలీ ఆడుతున్నప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ దూరంగా ఉంచాలి. లేదంటే.. రంగుల నీళ్లలో ఫోన్ పడే అవకాశం ఉంది. తద్వారా వాటర్ డ్యామేజ్ కావొచ్చు. ఒకవేళ ఫోన్ నీళ్లలో పడితే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. మీ ఫోన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రస్తుత మార్కెట్లో అనేక కొత్త-జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌లు వాటర్ రెసిస్టెన్స్ IP రేటింగ్‌తో అందుబాటులో ఉన్నాయి. కానీ, కొన్నిసార్లు అనుకోకుండా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి.

మీ ఫోన్ నీళ్లలో పడితే పాడవుతుంది. హోలీ పండుగ (Holi Festival) రోజున మీ ఫోన్ నీళ్లలో పడి తడిసిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే హోలీ సమయంలో మీ ఫోన్‌ని తీసుకెళ్లవద్దు. మీ స్మార్ట్‌ఫోన్‌ను నీటి నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు కొన్ని చక్కని టిప్స్ అందుబాటులో ఉన్నాయి. లేకపోతే, మీ పాత స్మార్ట్‌ఫోన్ తడిసిపోతే.. దానిని ప్రొటెక్ట్ చేసేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

ఆ తర్వాత ప్రొఫెషనల్ రిపేరర్‌ను సంప్రదించవలసి ఉంటుంది. చాలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు స్మార్ట్‌ఫోన్ వారంటీలో ఉన్నప్పటికీ వాటర్ డ్యామేజ్‌ను కవర్ చేయవు. అయితే ఆపిల్ వంటి కొన్ని బ్రాండ్‌లు, స్మార్ట్‌ఫోన్ నీళ్లలో పడితే ఎలా పనిచేస్తుందో లేదో చూపించడానికి లిక్విడ్ కాంటాక్ట్ ఇండికేటర్ (LCI)ని అందిస్తాయి. సాధారణంగా, iPhoneలలోని LCI SIM కార్డ్ స్లాట్‌లో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ నీళ్లలో పడి దెబ్బతిన్నట్లయితే.. సిమ్ స్లాట్ లోపల ఒక చిన్న వైట్ ప్యాచ్ పూర్తిగా ఎరుపు రంగులోకి మారుతుంది.

Holi 2023 _ How to fix smartphone in case of water damage

మీ ఫోన్ నీటిలో పడితే ఏం చేయాలంటే? :
-మొదట, మీ ఫోన్‌ను వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలని గుర్తుంచుకోండి. నీళ్లలో ఫోన్ పడిన తర్వాత ఎక్కువ సమయం ఆన్‌లో ఉండకూడదు. లేదంటే ఫోన్ ఎక్కువ రోజులు పనిచేయదని గుర్తించాలి. మీరు లేదా మీ పేరంట్స్ ఇప్పటికీ ఫీచర్ ఫోన్‌ను (ఫిజికల్ కీప్యాడ్‌లతో పాత ఫోన్‌లు) ఉపయోగిస్తున్నట్లయితే.. డివైజ్ నీళ్లలో పడి బాగా తడిసిపోతే.. డివైజ్ బ్యాక్ ప్యానెల్‌ని ఓపెన్ చేసిన తర్వాత తప్పనిసరిగా బ్యాటరీని తొలగించాలి.

Read Also : Flipkart Holi Sale Offer : ఫ్లిప్‌కార్ట్‌లో హోలీ ‘బిగ్ బచత్ ధమాల్ సేల్’.. ఐఫోన్ 13, ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

– రెండోది.. చాలా ముఖ్యమైనది. నీళ్లలో పడినప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను అసలే షేక్ చేయవద్దు. లేదంటే నీళ్లు ఫోన్ ఇంటర్నల్ పార్టులోకి చేరే ప్రమాదం ఉంది. అదేవిధంగా, హెయిర్ డ్రయ్యర్ కూడా ఉపయోగించవద్దు. మీ ఫోన్‌లోని నీటిని కూడా లోపలికి వెళ్లేలా చేయొచ్చు. కొంతమంది నీళ్లలో పడిన ఫోన్ ఎక్కువగా వేడి తగిలే ప్రదేశంలో ఉంచుతారు. ఇలా చేస్తే.. ఫోన్ ఇంటర్నల్ పార్టులను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది.

– ఫోన్ ఉపరితలంపై నీటిని తొలగించాలనే విషయం గుర్తుంచుకోండి. మిగిలిన రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకోకపోవడమే మంచిది. నీళ్లు దానంతటదే ఆరనివ్వాలి. మీరు ఫోన్‌ను బియ్యం సంచిలో కనీసం 6 గంటల పాటు ఉంచడం ద్వారా ఫోన్‌పై తడిని తొందరగా పీల్చుకునే అవకాశం ఉంటుంది.

– అదనంగా, మీ ఫోన్ నీళ్లలో పడినప్పుడు ఛార్జింగ్ పెట్టకూడదు. మీరు ఫోన్ నుంచి SIM కార్డ్, ట్రేని తొలగించండి. మీరు స్నేహితులతో హోలీని జరుపుకోవడానికి బయటకు వెళ్తే.. మీరు స్మార్ట్‌ఫోన్‌ను జిప్-లాక్ బ్యాగ్‌లో తీసుకెళ్లొచ్చు. మీరు కొన్ని జొమాటో/స్విగ్గీ ఎగ్జిక్యూటివ్‌లు వర్షం పడే రోజున వాటర్‌ప్రూఫ్ పర్సును కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ పౌచ్‌లలో కొన్ని అమెజాన్‌లో 1-రోజు డెలివరీతో అందుబాటులో ఉన్నాయి. ఈ పౌచ్‌లు చాలా చవకైనవి. కేవలం ధర రూ. 200 లోపు ఉంటుంది.

Read Also : 2023 Honda Motorcycle : 2023 హోండా 100cc మోటార్ సైకిల్ ఇదిగో.. మార్చి 15నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు