Honda Gold Wing : భారత్‌కు కొత్త సూపర్ బైకు.. 24 గంటల్లోనే బుకింగ్స్ క్లోజ్!

భారత మార్కెట్లోకి కొత్త హోండా సూపర్ బైక్ వచ్చేసింది. ముందుగానే అన్నీ బుకింగ్స్ పూర్తి అయిపోయాయి. హోండా మోటార్ సైకిల్ తయారీదారు ఈ కొత్త బైకును తీసుకొస్తోంది. అదే.. గోల్డ్ వింగ్ టూర్ (Gold Wing Tour) బైకు..

Honda Gold Wing : భారత్‌కు కొత్త సూపర్ బైకు.. 24 గంటల్లోనే బుకింగ్స్ క్లోజ్!

Honda Gold Wing Tour Bike Sold Out In India In 24 Hours

2021 Honda Gold Wing Tour : భారత మార్కెట్లోకి కొత్త హోండా సూపర్ బైక్ వచ్చేసింది. ముందుగానే అన్నీ బుకింగ్స్ పూర్తి అయిపోయాయి. Honda Motorcycle & Scooter India (HMSI) తయారీదారు ఈ కొత్త బైకును తీసుకొస్తోంది. అదే.. గోల్డ్ వింగ్ టూర్ (Gold Wing Tour) బైకు.. దీని ప్రారంభ ధర రూ.37.20 లక్షలు. ఫస్ట్ స్లాట్ ఓపెన్ చేయగా ముందుగానే బుకింగ్ అయిపోయాయి. ఈ కొత్త మోడల్ బైకు సేల్ 24 గంటల్లోనే అన్నీ బుకింగ్స్ అమ్ముడయ్యాయి.

ఈ కొత్త అప్ డేటెడ్ వెర్షన్ (Gold Wing Tour) సూపర్ బైకును గత జూన్ నెలలోనే లాంచ్ చేసింది హోండా మోటార్ సైకిల్ సంస్థ. ఈ కొత్త వెర్షన్ బైకు జపాన్ నుంచి భారత మార్కెట్లోకి CBU (completely built-up) రూట్ ద్వారా వచ్చింది. 1,833cc 2021 ఇంజిన్ కెపాసిటీ కలిగిన Gold Wing Tour రెండు వేరియంట్లలో వచ్చింది. అందులో ఒకటి Dual Clutch Transmission (DCT).. ఇందులో ఎయిర్ బ్యాగ్, మ్యానువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఉంది. సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్.. దీనిలో కూడా ఎయిర్ బ్యాగ్ ట్రిమ్ తో వచ్చింది. దీని ప్రారంభ ధర రూ.39,16,055 లక్షలు.

Honda Gold Wing Tour Bike Sold Out In India In 24 Hours (1)

మరో వేరియంట్.. సిక్స్ స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్.. దీని ధర మార్కెట్లో రూ.37,20,342 (ఎక్స్ షోరూం, గుర్గావ్)గా ఉంది. ఈ బైకులో వివిధ ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.. ఎలక్ట్రిక్ స్ర్కీన్, డ్యుయల్ LED ఫాగ్ లైట్స్, క్రూయిజ్ కంట్రోల్, సెవెన్ ఇంచ్ ఫుల్ కలర్ TFT లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే, అప్ గ్రేడెడ్ లైట్ వెయిట్ స్పీకర్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్ సహా పలు ఫీచర్లు ఉన్నాయి. గోల్డ్ వింగ్ టూర్ బైకులో Apple CarPlay, Android Auto కంపాటిబుల్ గా ఉంటుంది. స్మార్ట్ ఫోన్లలో కంటెంట్ కూడా ప్లే చేయొచ్చు. టెలిఫోన్ నెంబర్లు, మ్యూజిక్ ప్లేలిస్టులో కూడా ప్లే చేయొచ్చు. ఇక Bluetooth కనెక్టవిటీ కూడా ఉంది. రెండు USB Type-C పోర్టులు కూడా ఉన్నాయి.