Honda CBR150R: మరోసారి భారత మార్కెట్లోకి CBR150R బైక్ ను తెస్తున్న హోండా

Honda CBR150R బైక్.. 2012లోనే భారత్ లో విడుదలైంది. అప్పట్లో సేల్స్ తక్కువగా ఉండడంతో కొన్నాళ్లపాటు కొనసాగించి 2017లో ఆ మోడల్ ను భారత్ లో నిలిపివేసింది హోండా సంస్థ.

Honda CBR150R: మరోసారి భారత మార్కెట్లోకి CBR150R బైక్ ను తెస్తున్న హోండా

Bike

Honda CBR150R: హోండా మోటార్ సైకిల్స్.. భారత్ లో ప్రీమియం మోడల్స్ పై దృష్టిపెట్టింది. ప్రీమియం బైక్స్ కోసం ప్రత్యేకంగా “Big Wing” అనే ఫ్రాంచైజీనే తీసుకువచ్చింది హోండా. ఇక ప్రీమియం సెగ్మెంట్లో 150సీసీ – 1200సీసీ అన్ని రకాల మోడల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూసుకుంటుంది. ఈక్రమంలో ఇప్పటికే CB300R, CB500X, CB650R, CBR650R బైకులను హోండా భారత్ లో విడుదల చేసింది. ఇక ప్రీమియం సెగ్మెంట్ లోనే తక్కువ సామర్ధ్యంగల బైక్ ను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు హోండా సన్నాహాలు చేస్తుంది. ఈమేరకు ఇప్పటికే Honda CBR150R కొత్త మోడల్ బైక్‌కి సంబంధించి భారత్ లో పేటెంట్ కు అప్లై చేసింది హోండా సంస్థ.

Also read: Pawan Kalyan: ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే “సలహాదారు పోస్టులు” ఇచ్చుకోవడం కాదు: పవన్

నిజానికి Honda CBR150R బైక్.. 2012లోనే భారత్ లో విడుదలైంది. అప్పట్లో సేల్స్ తక్కువగా ఉండడంతో కొన్నాళ్లపాటు కొనసాగించి 2017లో ఆ మోడల్ ను భారత్ లో నిలిపివేసింది హోండా సంస్థ. అయితే ఇటీవల భారత్ లో ప్రీమియం బైక్స్ కు గిరాకీ పెరుగుతుండడంతో, ఆ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు హోండా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే..ఇప్పుడు Honda CBR150R బైక్ ని తిరిగి భారత్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రీమియం బైక్ లలో ప్రస్తుతం భారత్ లో KTM అగ్రభాగాన ఉంది.

Also read: Polytechnic Exam: పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు

149.5సీసీ లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్ కలిగిన ఈ బైక్.. 17.1ps@9,000 rpm వద్ద గరిష్ట శక్తిని, 14.4 Nm@ 7,000 rpm వద్ద గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ బైక్ లో LED లైట్లు, LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఛానల్ ABS వంటి అధునాతన ఫీచర్స్ ఉండనున్నాయని బైక్ రివ్యూ సంస్థ “RushLane” తెలిపింది. “Fully Faired”గా రానున్న ఈ హోండా CBR150R బైక్ ఇండియాలో.. KTM RC 125, Yamaha R15 V4 వంటి బైకులకు గట్టి పోటీ ఇవ్వనుంది.