Instagramలో Your Storyకి ఫొటోలు, వీడియోలు షేరింగ్ ఈజీ!

  • Published By: sreehari ,Published On : December 27, 2019 / 07:58 AM IST
Instagramలో Your Storyకి ఫొటోలు, వీడియోలు షేరింగ్ ఈజీ!

ప్రముఖ షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీ పర్సనల్ ఫొటోలు, వీడియోలను ఈజీగా ఫాలోవర్స్ కు షేర్ చేసుకోవచ్చు. Your Storyలో తాత్కాలిక ఫొటోలు, వీడియోలను షేర్ చేసేందుకు పాపులర్ ఫీచర్ అందుబాటులో ఉంది..

అదే.. ఇన్ స్టాగ్రామ్ Stories.. ఈ ఫీచర్ ద్వారా పర్సనల్ ఫొటోలు, వీడియోలను యూజర్లు తమ అకౌంట్లలో షేర్ చేసుకునేందుకు అనుమతి ఇస్తుంది. ఇదే ఫీచర్‌ను ఎన్నో విధాలుగా వినియోగించుకోవచ్చు. ఏదైనా ప్రమోట్ చేసుకోవచ్చు లేదా ఎట్రాక్టివ్ ఫొటోలను పోస్టు చేసుకోవచ్చు.

అయితే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో Your Storyలో ఏదైనా పోస్టు చేయాలంటే ఎలానో చాలామంది యూజర్లకు తెలియకపోవచ్చు. కొంతమందికి తెలిసినా పోస్టు చేసే విధానం తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీ అందరి కోసం ఇన్ స్టాగ్రామ్ లో Your Storyలో పోస్టు ఎలా చేయాలో తెలుసుకుందాం..

Your Storyలో యాడ్ చేయాలంటే? :
* మీ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ డివైజ్‌లో Instagram App ఓపెన్ చేయండి.
* Your Story అనేది మీ ప్రొఫైల్ ఫొటో దగ్గర కనిపిస్తుంది.
* Blue (+) Sign పై Click చేయండి.
* ఇక్కడ మీ Your Storyలో కనిపించే వైట్ సర్కిల్ పై క్లిక్ చేయండి.
* Blue (+) ఐకాన్ పై Click చేసి ఫొటోలు, వీడియోలను యాడ్ చేసుకోవచ్చు.
* మీ Library నుంచి నచ్చిన ఫొటోలు, వీడియోలను సెలెక్ట్ చేసుకోండి.
* Top Menu Barలో ఆప్షన్లతో ఫొటోలు, వీడియోలను Edit కూడా చేసుకోవచ్చు.
* Lower-Left cornerలో ‘Your Story’లోకి ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
* మీ ఫాలోవర్లకు లేదా Closed Frdsకు ఎవరికైనా Share Withతో షేర్ చేయొచ్చు.
* మరిన్ని ఫొటోలు, వీడియోలు ఎన్నైనా (+) క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు.
* ఫొటోలు లేదా వీడియోలు.. మీ Followersకు 24 గంటల వరకు కనిపిస్తాయి.