సిమ్ కార్డులతో మీ బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేసేస్తారు.. సైబర్ మోసగాళ్లు వాడే ట్రిక్ ఇదే!

సిమ్ కార్డులతో మీ బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేసేస్తారు.. సైబర్ మోసగాళ్లు వాడే ట్రిక్ ఇదే!

SIM cards to rob money from your bank accounts : మీ ఫోన్ పోయిందా? ఎవరైనా దొంగిలించారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. అందులో మీ విలువైన వ్యక్తిగత డేటా సైబర్ మోసగాళ్ల చేతికి చిక్కితే అంతే సంగతులు.. మీ బ్యాంకు అకౌంట్లు మొత్తం ఖాళీ చేసేస్తారు .. చాలామంది ఫోన్ పోయిందంటే పెద్దగా పట్టించుకోరు. ఫోన్ పోతే కొత్తది కొనుక్కోవచ్చులే అనుకోవచ్చు.. కానీ, సైబర్ నేరగాళ్లు దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు. ఆ విషయం తెలియక డబ్బు పోయాక లబోదిబోమంటుంటారు.. బ్యాంకులకు పరిగెత్తి కంప్లయింట్ చేస్తుంటారు. ముందుగానే జాగ్రత్త పడితే సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేయొచ్చు అంటున్నారు సైబర్ నిపుణులు.
సాధారణంగా సైబర్ మోసగాళ్లు బ్యాంకు ఖాతాదారుల పేరు, అడ్రస్, బ్యాంకు వివరాలను దొంగిలిస్తుంటారు. ఆ వివరాలతో బాధితుల అకౌంట్లలోకి ప్రవేశించి డబ్బులు కాజేస్తుంటారు. అంతేకాదు.. బాధితుల వివరాలతో మోసగాళ్లు లోన్లకు అప్లయ్ చేస్తుంటారన్నంట. ఇటీవల ఓ స్థానిక సైబర్ మోసగాడిని అరెస్ట్ చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. అసలు సైబర్ మోసగాళ్లు ఎలా మోసాలకు పాల్పడుతుంటారో చెప్పాడు.

నేరగాళ్లు వాడే ట్రిక్ ఇదేనంట :
ఫోన్ సిమ్ కార్డుల ద్వారా ఎలా బ్యాంకు అకౌంట్లలో డబ్బులు ఎలా కొట్టేస్తున్నారో సీక్రెట్ బయటపెట్టాడు. అందుకు ‘వైర్ వైర్’ అనే ట్రిక్ వాడుతారంట.. దీన్ని సిమ్ ట్రాన్సాక్షన్ అని కూడా పిలుస్తారు. దీనికి మరో పేరు కూడా ఉంది.. ‘జోకర్ వైర్’ ఈ ట్రిక్ ద్వారా ఏదైనా సిమ్ కార్డు ద్వారా లింక్ అయిన బ్యాంకు అకౌంట్లను ఈజీగా అన్ లాక్ చేయగలరంట.. ఏయే సిమ్ కార్డుతో ఏయే బ్యాంకు అకౌంట్ లింక్ అయి ఉందో తెలుసుకుంటారు. అందుకు *425*100# అనే నెంబర్ డయల్ చేస్తారంట.. దీని ద్వారా ఆ బ్యాంకు వివరాలను పొందుతారు.

బ్యాంకు అకౌంట్ యాక్సస్ చేసేందుకు *901*00# ఈ నెంబర్ డయల్ చేస్తే.. బ్యాలెన్స్ ఎంతో ఉందో తెలుస్తుంది. ఆ తర్వాత మోసగాళ్లు PIN రీసెట్ చేస్తారు.. బ్యాంకు అకౌంట్ నంబర్, పుట్టిన తేదీ ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే.. చాలామంది యూజర్లు తమ అకౌంట్ నెంబర్ ను కాంటాక్టు లిస్టులో సేవ్ చేస్తున్నారు. నేరగాళ్లు ఇంకా ఈజీ అయిపోతుంది. ఇక BVN (బ్యాంకు వెరిఫికేషన్ నెంబర్) కూడా తెలిస్తే అంతే.. ఈజీగా PIN రీసెట్ చేసేయొచ్చు..

bank fraud

అందుకు *565*0# డయల్ చేస్తే చాలు.. యూజర్ BVN అకౌంట్ వివరాలు ఫోన్ సిమ్ ద్వారా పొందవచ్చు. ఈ సమాచారంతో నేరగాళ్లు.. కొత్త PIN క్రియేట్ చేసి.. అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసేస్తున్నారు. దొంగిలించిన నగదును నో ట్రేస్ అకౌంట్ (Aza) మరో దొంగిలించిన సిమ్ ద్వారా క్రియేట్ చేసిన BVN క్రియేట్ చేసి అందులోకి ట్రాన్స్ ఫర్ చేస్తుంటారు. ఈ BVN నెంబర్ ఉంటే చాలు.. సిమ్ లేకపోయినా అకౌంట్లో డబ్బులు డ్రా చేసేయొచ్చు. అందుకే మీ వ్యక్తిగత డేటా, బ్యాంకుల వంటి వివరాలను ఎక్కడిపడితే అక్కడ స్టోర్ చేయకపోవడమే మంచిది అంటున్నారు సైబర్ నిపుణులు.