వాట్సాప్ Groupలో మీ Msg చూశారో లేదో తెలుసుకోండిలా!

  • Published By: sreehari ,Published On : January 22, 2020 / 12:31 PM IST
వాట్సాప్ Groupలో మీ Msg చూశారో లేదో తెలుసుకోండిలా!

వాట్సాప్ వాడుతున్నారా? వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యారా? ఏదైనా నచ్చిన మెసేజ్ అందరికి గ్రూపుల్లో షేర్ చేస్తున్నారా? అయితే మీరు షేర్ చేసిన మెసేజ్ గ్రూపులోని సభ్యులు అసలు చదివారో లేదో తెలియడం లేదా? గ్రూపులో ఎంతమంది సభ్యులు మీరు పంపిన మెసేజ్ చదివారో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అందుకు మీరు గమనించాల్సిన విషయం ఒకటే.. వాట్సాప్ లో read receipt అనే ఫీచర్ ఒకటి ఉంది. ఇది రెండు Blue tick marks మాదిరిగా కనిపిస్తుంది. మీరు ఏదైనా మెసేజ్ గ్రూపుల్లో షేర్ చేయగానే అది ముందుగా ఒక Tick (గ్రే కలర్) కనిపిస్తుంది.

అంటే.. మీ మెసేజ్ విజయవంతంగా Sent అయిందని అర్థం.. ఆ తర్వాత రెండు Tick marks (గ్రే కలర్) కనిపిస్తాయి..అంటే మీ మెసేజ్ డెలివరీ అయింది.. ఇక ఆ రెండు Tick marks బ్లూ కలర్ లోకి మారితే మాత్రం.. మెసేజ్ చదివినట్టే. వాట్సాప్ గ్రూపులో మెసేజ్ కాన్వర్సేషన్ కావొచ్చు లేదా వ్యక్తిగత మెసేజ్ కావొచ్చు.. పంపిన మెసేజ్ ను ఇతరులు చదివారో లేదో ఈజీగా ఈ రీడ్ రిసిప్ట్ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.

మీది ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ఏదైనా వాట్సాప్ గ్రూపులో మెసేజ్ చదివారో లేదో తెలిసిపోతుంది. మీరు పంపిన ముఖ్యమైన సందేశాన్ని ఇతరులు చూసినట్టు తెలియాలంటే ముందు తప్పనిసరిగా మీ వాట్సాప్ అకౌంట్లో Read Receipts ఫీచర్ Enable చేసి ఉండాలి. అది ఎలానో ఈ కింది విధంగా ఫాలో అవ్వండి..

* మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో Whatsapp ఓపెన్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్ లో వర్టికల్ డాట్స్ పై Click చేయండి.
* Settings ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* Account సెక్షన్ పై Tap చేయండి.
* Privacy ఆప్షన్ పై Tap చేయండి.
* Read Receipts ఆప్షన్ (గ్రే టూ గ్రీన్) పై Turned on చేయండి.
* ఇదే Receipts ఫీచర్ Disable చేయాలంటే Turned off చేస్తే చాలు.
* వాట్సాప్ అకౌంట్లో వ్యక్తిగత మెసేజ్ చదివారో లేదో చూడొచ్చు.

Groupలో మెసేజ్ చదివారో లేదో తెలియాలంటే? :

*  Whatsapp అకౌంట్ ఓపెన్ చేయండి.
* వాట్సాప్ ఏ గ్రూపులో మెసేజ్ పంపారో ఆ గ్రూపుపై Tap చేయండి.
* ఆ గ్రూపులో ఏదైనా కొత్త మెసేజ్ పంపి టెస్టింగ్ చేయండి..
* ఇప్పుడా ఆ Msg పై Tap చేయండి.
* మీకో Pop Up మెసేజ్ కనిపిస్తుంది.. దానిపై Tap చేయండి.
* Info అనే ఆప్షన్ ఉంటుంది.. అక్కడ కూడా Tap చేయండి.
* ఇక్కడే మీకు Message Info అని కనిపిస్తుంది.
* మీరు పంపిన మెసేజ్ ఎంత మంది గ్రూపు సభ్యులు చూశారో చూడొచ్చు.
* Delivered to ఆప్షన్.. మెసేజ్ చదవని వారి కాంటాక్టులు కనిపిస్తాయి.

వాట్సాప్ లో మెసేజ్ చదివారని గుర్తించాలంటే? :
* మీరు పంపిన మెసేజ్ కింద Blue Tick marks కనిపించాలి.
* Msg పంపిన వెంటనే.. మీకు Clock Icon కనిపిస్తుంది.. అంటే.. మెసేజ్ వెళ్తుందని అర్థం.
* One Gray చెక్ మార్క్ కనిపిస్తే.. మెసేజ్ విజయవంతంగా పంపడం జరిగింది.. కానీ, ఇంకా డెలివరీ కాలేదు.
* Two Gray Tick marks కనిపిస్తే.. మీ మెసేజ్ విజయవంతంగా డెలివరీ అయింది.
* ఇప్పుడు ఆ రెండు Gray టిక్ మార్క్స్ కాస్తా Blue tick marks మారితే.. చదివినట్టే అర్థం చేసుకోవాలి.
* iPhoneలో కూడా ఇదే మాదిరిగా ఫాలో అవ్వండి.