Instagram పోస్టును Hyperlinkతో ఇలా షేర్ చేయండి

  • Published By: sreehari ,Published On : December 20, 2019 / 07:18 AM IST
Instagram పోస్టును Hyperlinkతో ఇలా షేర్ చేయండి

మీకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? మీ అకౌంట్లోని పోస్టును మీకు నచ్చిన వారికి షేర్ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ, ఆ వ్యక్తికి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లేదంటే ఎలా షేర్ చేస్తారు? డోంట్ వర్రీ.. నాన్ ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు కూడా మీ పోస్టును ఈజీగా షేర్ చేసుకోవచ్చు. నిజానికి ఇన్ స్టాగ్రామ్ నుంచి షేర్ చేసే ఫొటోను ట్యాగ్ చేయాలంటే ఇతరులకు కూడా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి.

అప్పుడే మీరు కామెంట్స్ సెక్షన్‌లో ట్యాగ్ చేసిన ఫొటోను వారు చూసేందుకు వీలుంటుంది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లేకపోయినా ఆ పోస్టును హైపర్ లింక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. అంటే.. ఈమెయిల్, టెక్స్ట్ లేదా మెసేజ్ రూపంలో హైపర్ లింక్ మార్చేసి పబ్లిక్ కూడా షేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఓసారి చూద్దాం.  

1. Hyperlink షేరింగ్ ఇలా : 
* మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్ లో ఇన్ స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి.
* ఏ పోస్టును మీరు Share చేయాలనుకున్నారో దానిపై Navigate చేయండి.
* టాప్ రైట్ కార్నర్ లో (…) అనే మూడు డాట్ సింబల్స్ ట్యాప్ చేయండి.
* ఇప్పుడు Copy Link అనే ఆప్షన్ పై Tap చేయండి.
* వెంటనే స్ర్కీన్ పై లింక్ కాపీయిడ్ టూ క్లిప్ బోర్డ్ అని కనిపిస్తుంది.

ఇన్ స్టాగ్రామ్ నుంచి కాపీ చేసిన లింక్‌ను ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో ట్విట్టర్, టెక్స్ట్ లేదా ఇతర మెసేజింగ్ యాప్ ల్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. 

2. ఇన్ స్టాగ్రామ్ Your Story లో ఎలా? :
* ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసే పోస్టును ఓపెన్ చేయండి.
* ఆ పోస్టులో పేపర్ ఎరోప్లేన్ అనే సింబల్ కనిపిస్తుంది. (లైక్, కామెంట్స్)
* Add post యూవర్ స్టోరీపై Tap చేయండి.
* ఆ పోస్టును Send చేస్తే చాలు.. మీ స్టోరీలోకి వెళ్లి చేసుకోవచ్చు.
* ఇతర స్టోరీల్లో పోస్టును Share చేయాలనుకుంటే Your Story ఐకాన్ క్లిక్ చేయండి.

3. Direct Message పంపండిలా :
* మీ స్నేహితుడికి ఇన్ స్టాగ్రామ్ పోస్టును డైరెక్ట్ మెసేజ్ గా Send చేసుకోవచ్చు.
* ఆ పోస్టు ఓపెన్ చేసి.. Paper airplane Iconపై ట్యాప్ చేయండి.
* ఆ తర్వాత వారి Username పక్కనే ఉన్న చెక్ మార్క్ పై ట్యాప్ చేయండి.
* Topలో User Name కోసం Search Bar లేదా List ద్వారా చెక్ చేసుకోవచ్చు.