WhatsApp Online : వాట్సాప్‌లో మీ ఆన్‌లైన్ స్టేటస్ ఎవరికి తెలియకుండా ఇలా హైడ్ చేయొచ్చు..!

WhatsApp Online : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్ల కోసం అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఈ ఏడాదిలో ప్రవేశపెట్టిన అత్యుత్తమ ఫీచర్లలో ఒకటిగా చెప్పవచ్చు. దాని ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేసే ఆప్షన్ అందుబాటులో ఉంది.

WhatsApp Online : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్ల కోసం అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఈ ఏడాదిలో ప్రవేశపెట్టిన అత్యుత్తమ ఫీచర్లలో ఒకటిగా చెప్పవచ్చు. దాని ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేసే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేసే ఫీచర్ ఇప్పుడు iOS, Androidతో సహా యూజర్ల అందరికి అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ వాట్సాప్ ఆన్‌లైన్ స్టేటస్‌ను ఎవరికీ కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు అవసరమైతే వాట్సాప్ ఫీచర్‌ని డిసేబుల్ చేసి ఎనేబుల్ చేయవచ్చు. మీరు WhatsAppలో ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ ఎవరికీ తెలియకూడదనుకుంటే ఒక మార్గం ఉంది. మీరు ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.

* ముందుగా, WhatsApp యాప్‌ని అప్‌డేట్ చేయండి.
* వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్ ట్యాబ్‌కు వెళ్లండి.
* ప్రైవసీకి వెళ్లండి.
* ఆ తర్వాత, Last Seen, ఆన్‌లైన్ స్టేటస్ ఆప్షన్‌పై Click చేయండి.
* మీ ఆన్‌లైన్ స్టేటస్ నిర్దిష్ట యూజర్ నుంచి హైడ్ చేసేందుకు Nobody ఎంపికపై Click చేయండి.

Read Also : WhatsApp Multiple Chats : వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లు త్వరలో మల్టీపుల్ చాట్లను ఒకేసారి ఎంచుకోవచ్చు..!

మీరు Last Seen ట్యాబ్ కింద వచ్చే Noboday ఆప్షన్‌పై క్లిక్ చేసి, అదే స్క్రీన్‌పై కనిపించే ‘Same as Last Seen’ ఆప్షన్‌పై Click చేయవచ్చు. Everyone, My contacts, Nobody, My contacts except అనే నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం

How to be online on WhatsApp without anyone knowing

* మీరు Everyone ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. మీ ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయదు.
* My Contacts ఆప్షన్.. మీ కాంటాక్టు లిస్టులో లేని ప్రతి ఒక్కరి నుంచి మీ ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయవచ్చు.
* ‘Nobody’ ఆప్షన్ ప్రాథమికంగా మీ ఆన్‌లైన్ స్టేటస్ అందరి నుంచి హైడ్ అవుతుంది. మీరు ఆన్‌లైన్‌కి వచ్చినప్పుడు లేదా వేరొకరితో చాట్ చేసినప్పుడు ఎవరూ చూడలేరు.
* చివరిగా, ‘My contacts except’ ఆప్షన్ యూజర్లు తమ ఆన్‌లైన్ స్టేటస్ నిర్దిష్ట యూజర్ల నుంచి హైడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇతరులు ఆన్‌లైన్‌కి వచ్చినప్పుడు చూడవచ్చు.

హైడ్ ఆన్‌లైన్ స్టేటస్ ఫీచర్‌తో.. యూజర్లు ఎవరికీ తెలియకుండా సులభంగా ఆన్‌లైన్‌లో ఉండవచ్చు. ఈ ఏడాదిలో వాట్సాప్ యూజర్ల ప్రైవసీపై చాలా ఫోకస్ పెట్టింది. కంపెనీ అనేక కొత్త ప్రైవసీ-ఆధారిత ఫీచర్‌లను ప్రవేశపెట్టింది. గ్రూపులను సైలంట్‌గా వదిలివేయడంతో పాటు మెసేజ్ వ్యూ వన్స్ ద్వారా స్క్రీన్‌షాట్ తీయలేరు. ఇటీవల రిలీజ్ అయిన Undo ఫీచర్ యూజర్లు అనుకోకుండా డిలీట్ చేసిన మెసేజ్‌లను Undo చేసేందుకు అనుమతిస్తుంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ కమ్యూనిటీలు, అవతార్, ఎమోజి రియాక్షన్‌లు, మరిన్ని వంటి ఫీచర్‌లను కూడా ప్రారంభించింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Old Smartphones : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఈ స్మార్ట్‌ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు