వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు.. ఎలానంటే?

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు.. ఎలానంటే?

How to chat with yourself in WhatsApp : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ ఎప్పటినుంచో యూజర్లను ఊరిస్తోంది. అదే.. ‘నోట్ టు సెల్ఫ్’ ఫీచర్.. అంటే.. వాట్సాప్ యూజర్ తన అకౌంట్లో తానే చాట్ చేసుకోవచ్చు. మీకు మీరే వాట్సాప్ చేసుకునేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది. అదేలా అంటారా? ఏదైనా విషయాన్ని మళ్లీ రిమైండ్ చేసుకునేందుకు అవసరమైన ఫీచర్ వాట్సాప్ లో లేదు. షాపింగ్ లిస్టు లేదా ఏదైనా ముఖ్యమైన మెసేజ్ కావొచ్చు.

వాట్సాప్ లో ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ‘స్టార్’ అనే ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ ద్వారా భవిషత్తులో మెసేజ్ ఎవరికైనా పంపుకోవచ్చు. నోట్ టు సెల్ఫ్ ఫీచర్ తో పోలిస్తే స్టార్ ఫీచర్ లిమిటేషన్‌‌తో పనిచేస్తుంది. నోట్ టు సెల్ఫ్ మెసేజ్ ఎవరికి వారే చాట్ చేసుకోనేలా డిజైన్ చేశారు. దీనికోసం సపరేటు చాట్ విండో కూడా ఉంటుంది. మెయిన్ చాట్ బాక్సులో చూపించదు.

ఈ చాట్ అన్ని డివైజ్ లో ఒకే నెంబర్ తో సింకరైజ్ అవుతుంది. ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. ఇతర వాట్సాప్ చాట్స్ మాదిరిగానే బ్యాకప్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ వాట్సాప్ పోటీదారు యాప్ లైన సిగ్నల్, టెలిగ్రామ్ లో అందుబాటులో ఉంది. కానీ, అయితే వాట్సాప్ లో ఈ ఫీచర్ ఎలా యాక్సస్ చేసుకోవాలో తెలుసుకుందాం..

1. మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ లో ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.

2. ఫోన్ లేదా పీసీలో ఈ లింక్ http://wa.me/ టైప్ చేయండి.

3. అడ్రస్ బార్‌లో మీ ఫోన్ నెంబర్‌ను కంట్రీ కోడ్ (+91)తో టైప్ చేయండి.

4. ఉదాహరణకు : http://wa.me/+9195**456. ఎంటర్ నొక్కండి.

5. వెంటనే మరో కొత్త వెబ్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.. చాట్ బటన్ పై కంటిన్యూపై క్లిక్ చేయండి.

6. మీరు కంప్యూటర్ లో లాగిన్ అయితే వాట్సాప్ వెబ్ ద్వారా లాగిన్ కావొచ్చు.

7. మీరు స్మార్ట్ ఫోన్ వాడితే.. ఆటోమాటిక్ గా మీ ఫోన్ నెంబర్ తో వాట్సాప్ చాట్ విండో ఓపెన్ అవుతుంది.

ఈ చాట్ విండోలో ముఖ్యమైన మెసేజ్ లను పంపుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ షేర్ చేసుకోవచ్చు.