మీ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఉందా? డిలీట్ చేయండిలా!

మీ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఉందా? డిలీట్ చేయండిలా!

 delete fake accounts : నాకు అర్జెంట్ ఉంది. కొద్దిగా డబ్బులు అవసరం ఉంది. ఎలాగైనా సహయం చేయి..మళ్లా ఇచ్చేస్తా…అంటూ ఫేస్ బుక్ ద్వారా మెసేజ్ లు పంపిస్తుంటారు. ఫోన్ చేసి అడగొచ్చు కదా..అని అనుకుంటాం. మొహమాటం పడుతున్నాడేమో..అందుకే ఫేస్ బుక్ ద్వారా మెసేజ్ పంపిస్తున్నాడు అని అనుకుని..అడిగినంత కాకపోయినా..కొద్దిగానైనా డబ్బు సహాయం చేద్దామని అనుకుంటారు. డబ్బులు పంపుతుంటారు. తర్వాత..అసలు విషయం తెలిసి లబోదిబో మొత్తుకుంటారు.

ఎందుకంటే…ఫేక్ అకౌంట్ సృష్టించి మెసేజ్ లు చేస్తున్నారు. ఇప్పుడు..ఆన్ లైన్ మోసాలు అధికంగా జరుగుతున్నాయి. కొత్త కొత్త విధానాల ద్వారా ఎంతో మందిని మోసం చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. అయితే..ఇలాంటి మోసాలను అరికట్టేందుకు మన పేరిట సృష్టించిన ఫేస్ బుక్ అకౌంట్ ను తొలగించే అవకాశం ఉంది.

నకిలీ ఖాతాను తొలగించాలి..ఇలా…
నకిలీ ఖాతాలో పైన కుడివైపు మూడు చుక్కలు ఉంటాయి.
దానిపై క్లిక్ చేయాలి. రిపోర్టు ఆప్షన్ వస్తుంది.
అందులో 20 మందితో ఈ పోస్టును డిలీట్ చేయండి అని టైప్ చేయాలి.
  ఇది ఫేస్ బుక్ గుర్తించి..ఆ ఖాతాను డిలీట్ చేసేస్తుంది.

సైబర్ నేరగాళ్లు కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ పేరిట ఓ నకిలీ ఖాతాను సృష్టించారు. అప్రమత్తమైన శివకుమార్..విషయాన్ని ఫేస్ బుక్ కు సమాచారం అందించారు. వెంటనే వారు సూచించిన విధంగా నకిలీ ఖాతా ఐడీలో 20 మందితో డిలీట్ పోస్టు అని పెట్టించారు.