మీ ఐఫోన్‌‌లో ఫొటోలు లాస్ కాకుండానే డిలీట్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్

  • Published By: sreehari ,Published On : October 31, 2020 / 08:05 PM IST
మీ ఐఫోన్‌‌లో ఫొటోలు లాస్ కాకుండానే డిలీట్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్

మీ ఫోన్‌లో ఫొటోలతో స్టోరేజీ నిండిపోయిందా? ఫొటోలు డిలీట్ చేస్తే ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఐఫోన్ లో ఫొటోలు డిలీట్ చేసినా అవసరమైనప్పుడు తిరిగి పొందొచ్చు.. దానికి ఒకటే పరిష్కారం.. iCloud.. ఆపిల్ క్లౌడ్ స్టోరేజీ సర్వీసు..



దీని ద్వారా ఫొటోలే కాదు.. వీడియోలు ఇతర ఫైళ్లను ఇంటర్నెట్ ద్వారా బ్యాకప్ తీసుకోవచ్చు. ఐఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లండి.. అక్కడ డిలీట్ ఫొటోలను డిలీట్ చేసే ఆప్షన్ ఉంటుంది.

iCloud స్టోర్ బదులుగా మొబైల్ మాత్రమే ఎంచుకోండి. తద్వారా మొబైల్ నుంచి మాత్రమే ఫొటోలు డిలీట్ అయిపోతాయి. ఫోన్ స్టోరేజీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరిన్ని కొత్త యాప్స్, పోడ్ క్యాస్ట్ వంటివి ఎన్నో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఐక్లౌడ్ లైబ్రరీ నుంచి ఫొటోలు డిలీట్ కాకుండా జాగ్రత్త పడాలి. లేదంటే.. ఫొటోలు మళ్లీ బ్యాకప్ తీసుకోలేరు.



కేవలం ఐఫోన్ స్టోరేజీ నుంచి మాత్రమే ఫొటోలు డిలీట్ అయ్యేలా ఆప్షన్ ఎంచుకోవాలి. అదేలానో ఓసారి చూద్దాం..

* ఆపిల్ ఐక్లౌడ్.. మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్ లేదా మ్యాక్ ఫొటో లైబ్రరీలకు ఆటోమాటిక్‌గా సింకరైజ్ అవుతుంది. ఈ ఆప్షన్ ద్వారా మీ ఫోన్ లైబ్రరీలో ఫొటోలు లేదా ఏదైనా ఫైల్ డిలీట్ చేయగానే డిఫాల్ట్ గా ఐక్లౌడ్ స్టోరేజీ నుంచి కూడా డిలీట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ రెండింటిలో ఆప్షన్ ఒకటి మాత్రమే ఎంచుకోవాలి.



* ముందుగా మీ ఐఫోన్‌లోని Settingsలోకి వెళ్లండి..
* టాప్ కార్నర్‌లో (Apple ID) your nameపై ట్యాప్ చేయండి.
* ఆ తర్వాత iCloud ఆప్షన్‌పై కూడా Tap చేయండి.
* Photosపై Tap చేయండి. iCloud Photosపై నొక్కండి.
* My Photo Stream దగ్గర toggle చేయండి.
* మీ డివైజ్ నుంచి ఫొటోలను డిలీట్ చేసేందుకు అనుమతిస్తుంది.
* Saved to iCloud ఆప్షన్ మాత్రం అలానే వదిలేయాలి.
* ఒకవేళ ఐక్లౌడ్ కు డివైజ్ కనెక్ట్ అయితే డిలీట్ చేసిన ఫొటోలన్నీ మళ్లీ వచ్చేస్తాయి.

ఐక్లౌడ్ కాకుండా మరో ఏదైనా క్లౌడ్ బ్యాకప్ సర్వీసుల్లో గూగుల్ ఫొటోలు లేదా డ్రాప్ బాక్స్‌లో ఫొటోలను అనుకోకుండా డిలీట్ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో కాస్తా జాగ్రత్తగా ఉండాలి.