LIC ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కోసం అప్లయ్ చేసుకోండిలా!

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. డెత్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ చాలా మందికి తెలియకపోవచ్చు.

LIC ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కోసం అప్లయ్ చేసుకోండిలా!

How To File Death Insurance Claim With Lic

LIC Insurance Claim : లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. మధ్యతరగతి ఫ్యామిలీలకు ఎల్ఐసీ మరింతగా చేరువైంది. ప్రతి పాలసీదారుడి ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం ఎల్ఐసీ తప్పనిసరిగా
మారింది. మెట్రో నగరాలే కాదు.. మారుమూల గ్రామాల్లోనూ ఎల్ఐసీ విస్తరించింది. ఎల్ఐసీ కంపెనీ కూడా తమ పాలసీదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తోంది. ఎల్ఐసీ పాలసీ తీసుకున్న పాలసీదారుడు ఒకవేళ దురదృష్టవశాత్తు మరణిస్తే.. కుటుంబంలోని వ్యక్తి నామినీ లేదా కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
Kamreddy : పెళ్లయిన నెలకే…భార్య గొంతు కోసి చంపేసిన కిరాతక భర్త

ఈ డెత్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ విషయంలో మరణించిన పాలసీదారుల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు లేకపోలేదు. అందుకే డెత్ క్లెయిమ్ ఫైల్ ఎలా చేయాలి అనేది పాలసీదారులు తప్పక తెలుసుకోవాలి. వాస్తవానికి డెత్ క్లెయిమ్ ప్రాసెస్ పూర్తిగా ఆఫ్‌లైన్ మోడ్‌లోనే ఉంటుంది.

మీరు చేయాల్సిందిల్లా.. మీరు ఏ బ్రాంచ్ లో ఎల్ఐసీ పాలసీ తీసుకున్నారో అక్కడికి వెళ్లాలి. హోం బ్రాంచ్ కు వెళ్లే ముందు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. డెత్ క్లెయిమ్ ఫారం అప్లయ్ చేసే ముందు పాలసీ చేసిన ఏజెంట్ లేదా డెవలప్ మెంట్ ఆఫీసర్ సంతకం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

LIC ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ ప్రాసెస్ ఇదిగో :
డెత్ క్లెయిమ్ ఫైలింగ్ కోసం.. పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ హోమ్ బ్రాంచీని నామినీ సంప్రదించాల్సి ఉంటుంది. నామినీ పాలసీదారుడి మరణం గురించి సమాచారం తెలియజేయాలి. నామినీ బ్యాంకు అకౌంట్లోకి నిధుల బదిలీ చేయాలి. బ్రాంచ్ అధికారి ఫారం 3783, ఫారం 3801, NEFT ఫారాలను నింపాలి. డాక్యుమెంటల్లో ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్, నామినీ పాన్ కార్డు, ఒరిజినల్ పాలసీ బాండ్, నామినీ ఆధార్ కార్డు కాపీ, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, మరణించిన పాలసీదారుడి ఏదైనా ఐడి ఆధార్ కార్డు కూడా సమర్పించాలి. అలాగే పూర్తిగా నింపిన ఫారాలు, డాక్యుమెంట్లు, నామినీ డిక్లరేషన్ ఫారమ్‌ కూడా సమర్పించాల్సి ఉంటుంది.

పాలసీదారుడు మరణించిన తేదీ, మరణించిన ప్రదేశం, మరణానికి కారణం కూడా అప్లికేషన్ లో తెలియజేయాలి. NEFT ఫారంతో పాటు నామినీ బ్యాంకు అకౌంట్ హోల్డర్ పేరు, అకౌంట్ నెంబరు, IFSC Code, క్యాన్సల్ చెక్ లీఫ్, కాపీని నామినీ సబ్మిట్ చేయాలి. బ్యాంకు పాస్ బుక్, ఫోటోకాపీని కూడా ఇతర డాక్యుమెంట్లతో అందజేయాలి. లేదంటే ఆయా డాక్యుమెంట్లు ఆమోదించరు. డాక్యుమెంట్ల సమర్పణ సమయంలో నామినీ తన పాన్, మరణించిన పాలసీదారుడి ఐడి ప్రూఫ్, వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ బ్యాంక్ పాస్ బుక్ వంటి ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకెళ్లాలని గుర్తుంచుకోండి.
Amazon-Flipkart పోటాపోటీ : ఆఫర్లే ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు!

డెత్ క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం డాక్యుమెంట్ల ఆమోదానికి ముందు ఎల్ఐసీ ఆఫీసర్ ఒరిజినల్ పాస్ బుక్ కాపీతో వెరిఫికేషన్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ల లిస్ట్ కేవలం సూచన మాత్రమేని గుర్తించుకోవాలి. తుది మొత్తాన్ని నామినీ బ్యాంకు అకౌంట్లోకి క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎల్ఐసీ అదనపు డాక్యుమెంట్లు సమర్పించాల్సి రావొచ్చు. డాక్యుమెంట్లు ఎల్ఐసీ బ్రాంచీలో సబ్మిట్ చేశాక ఎక్ నాలెడ్జ్ మెంట్ రసీదును భద్రపరుచుకోవాలి. నెల వ్యవధిలో సెటిల్ మెంట్ మొత్తాన్ని నామినీ అందుకోవచ్చు. నెలలోపు మీ బ్యాంకు అకౌంట్లో క్లెయిమ్ అమౌంట్ క్రెడిట్ కాకపోతే.. నామినీ రసీదుని తీసుకొని ఎల్ఐసీ బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకుని క్రెడిట్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.