WhatsApp Block : వాట్సప్‌లో ఎవరు మిమ్మల్ని బ్లాక్ చేశారో ఇలా తెలుసుకోవచ్చు

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మీకు తెలియకుండా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారో తెలుసా? చాలామంది యూజర్లు ఇతరుల గ్రూపులో జాయిన్ అయిపోతుంటారు. కొన్నిసార్లు యూజర్ల ప్రైవసీకి ఇబ్బందిగా అనిపిస్తుంది.

WhatsApp Block : వాట్సప్‌లో ఎవరు మిమ్మల్ని బ్లాక్ చేశారో ఇలా తెలుసుకోవచ్చు

How To Find Out If Someone Has Blocked You On Whatsapp

WhatsApp Block : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మీకు తెలియకుండా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారో తెలుసా? చాలామంది యూజర్లు ఇతరుల గ్రూపులో జాయిన్ అయిపోతుంటారు. కొన్నిసార్లు యూజర్ల ప్రైవసీకి ఇబ్బందిగా అనిపిస్తుంది.

అలాంటివారిని బ్లాక్ చేయాలనుకోవాలనిపిస్తుంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఏదైనా వెర్షన్ కావొచ్చు.. మీ వాట్సాప్ నెంబర్‌ను ఎవరైనా ఎవరైనా బ్లాక్ చేశారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. అదేలానో ఈ ట్రిక్స్ ట్రై చేయండి.

– మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే మీకు వారి స్టేటస్ కనిపించదు.
బ్లాక్ చేసిన వ్యక్తి ప్రొపైల్ కూడా కనిపించదు.
ఒకవేళ కనిపించినా ఆ ప్రొఫైల్ పిక్చర్ బ్లాంక్‌లో ఉంటుంది.
మీరు వారికి మెసేజ్ పంపితే.. సింగిల్ ట్రిక్ మాత్రమే కనిపిస్తుంది. బ్లూ ట్రిక్ కనిపించదు. డబుల్ ట్రిక్ కూడా కనిపించదు. రీచ్ అయితేనే బ్లూ టిక్ వస్తుంది.
బ్లాక్ చేసిన వారికి మీరు ఎలాంటి వాయిస్ కాల్, వీడియో కాల్ చేయలేరు..
గ్రూపులో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తిని ఇన్వైట్ చేసినప్పుడు You are not authorized to add this contact అనే మెసేజ్ వస్తుంది.

వాట్సాప్ లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే కచ్చితంగా మిమ్మల్ని ఎవరో బ్లాక్ చేసి ఉంటారని అర్థం. మీ వాట్సాప్ నెంబర్ ను కూడా ఎవరైనా బ్లాక్ చేశారో లేదో తెలుసుకోండి…