Wi-Fi Network : విండోస్ 11లో Wi-Fi నెట్‌వర్క్ పాస్‌వర్డ్ గుర్తించడం ఎలా?

Wi-Fi Network : మీ ఇంట్లో మీ Wi-Fi నెట్‌వర్క్ పాస్‌వర్డ్‌ను మరిచిపోయారా? చాలామంది పాస్ వర్డ్ గుర్తించుకోవడం కష్టమని రాసి పెట్టుకుంటారు.

Wi-Fi Network : విండోస్ 11లో Wi-Fi నెట్‌వర్క్ పాస్‌వర్డ్ గుర్తించడం ఎలా?

How To Find Your Wi Fi Network Password In Windows 11

Wi-Fi Network : మీ ఇంట్లో మీ Wi-Fi నెట్‌వర్క్ పాస్‌వర్డ్‌ను మరిచిపోయారా? చాలామంది పాస్ వర్డ్ గుర్తించుకోవడం కష్టమని రాసి పెట్టుకుంటారు. మరికొంతమంది పాస్ వర్డ్ నోటెడ్ చేసుకుంటారు. కొన్నిసార్లు పాస్ వర్డ్ మరిచిపోయి వైఫై నెట్ వర్క్ లాగిన్ అవ్వడంలో ఇబ్బంది పడుతుంటారు. వైఫై నెట్ వర్క్ లాగౌట్ అయిన తర్వాత మళ్లీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పాస్ వర్డ్ ఏమై ఉంటుందో తెలియక ఆందోళన పడుతుంటారు. అదే మీరు విండోస్ 11లో వై-ఫై పాస్ వర్డ్ మరిచిపోయినా ఈజీగా గుర్తుపట్టవచ్చు.

అంతకుముందు పాస్ వర్డ్ ఏం పెట్టారో తెలుసుకోవచ్చు. Wi-Fi నెట్‌వర్క్ పాస్‌వర్డ్‌ని Windows పీసీలో గుర్తించడం చాలా సులభం కూడా. ఓల్డ్ విండోస్ వెర్షన్ లోనూ ఇదే తరహాలో వైఫై పాస్ వర్డ్ తెలుసుకోవచ్చు. Windows యూజర్లు తమ నెట్‌వర్క్ Wi-Fi పాస్‌వర్డ్‌ను కనుగొనడంలో పెద్దగా సమస్య ఉండకపోవచ్చు.

How To Find Your Wi Fi Network Password In Windows 11 (1)

How To Find Your Wi Fi Network Password In Windows 11

Windows 11లో మీ Wi-Fi నెట్‌వర్క్ పాస్‌వర్డ్‌ కనుగొనాలంటే :
1. విండోస్ 11లో స్టార్ట్ బటన్‌ ఎంచుకోవాలి. కంట్రోల్ ప్యానెల్‌ని టైప్ చేసి, కంట్రోల్ ప్యానెల్ > నెట్‌వర్క్ ఇంటర్నెట్ > నెట్‌వర్క్ షేరింగ్ సెంటర్ ఎంచుకోండి.
2. నెట్‌వర్క్ షేరింగ్ సెంటర్‌లో యూజర్లు వారి Wi-Fi నెట్‌వర్క్ పేరును ఎంచుకోవాలి, కనెక్షన్ ఆప్షన పక్కన కనిపిస్తుంది.
3. Wi-Fi స్టేటస్‌లో వైర్‌లెస్ ప్రాపర్టీలను ఎంచుకోవాలి.
4. వైర్‌లెస్ నెట్‌వర్క్ ప్రాపర్టీస్‌లో.. సెక్యూరిటీ ట్యాబ్‌ను ఎంచుకోవాలి. ఆపై Show characters చెక్ బాక్స్‌ను ఎంచుకోండి.
5. మీ Wi-Fi నెట్‌వర్క్ పాస్‌వర్డ్ నెట్‌వర్క్ సెక్యూరిటీ Key Boxలో కనిపిస్తుంది. షో క్యారెక్టర్స్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే చాలు.. పాస్‌వర్డ్ కనిపిస్తుంది.

Note : ఇతర విండోస్ వెర్షన్‌ రెండో దశ నుంచి సమానంగా ఉంటుంది. Windows 10 ఉన్నవారు కేవలం స్టార్ట్ బటన్‌ని ఎంచుకోవాలి. ఆపై సెట్టింగ్‌లు > నెట్‌వర్క్ & ఇంటర్నెట్ > స్టేటస్ > నెట్‌వర్క్ షేరింగ్ సెంటర్‌పై క్లిక్ చేయండి. Windows 8.1 లేదా 7లో యూజర్లు ముందుగా నెట్‌వర్క్ సెర్చ్ చేయాలి. రిజల్ట్స్ లిస్టు నుంచి నెట్‌వర్క్ షేరింగ్ సెంటర్ ఎంచుకోవాలి.

Read Also : Android Wifi Boost : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Wifi సిగ్నల్ బూస్ట్ చేసుకోండిలా..!