మీ స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ పగిలిందా? ఎలా ఫిక్స్ చేయాలంటే?

  • Published By: sreehari ,Published On : August 15, 2020 / 09:48 PM IST
మీ స్మార్ట్ ఫోన్ స్ర్కీన్  పగిలిందా?  ఎలా ఫిక్స్ చేయాలంటే?

వేలకు వేలు డబ్బులు పోసి ఖరీదైన స్మార్ట్ ఫోన్లు కొనేస్తుంటారు.. మంచి ఫీచర్లు ఉన్నాయో లేదో చూసి మరి కొంటుంటారు.. అలాంటి స్మార్ట్ ఫోన్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.. ఒక్కోసారి పొరపాటున చేతిలో నుంచి జారిపడుతుంటాయి..

ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అనిపిస్తుంది చాలామందికి.. ఇలా జరిగిన సమయంలో ఫోన్ స్ర్కీన్ పగిలిపోతుంటుంది.. ఇలాంటి సమయాల్లో పగిలిన ఫోన్ స్ర్కీన్ ఫిక్స్ ఎలా చేయాలో తెలియదు.. పగిలిన స్ర్కీన్ రిపేర్ చేయాలంటే అది దెబ్బతిన్న పరిమాణం బట్టి ఉంటుంది…

స్క్రీన్ పగలడానికి కారణాలివే :
* గట్టి ఉపరితలంపై ఫోన్ పడేయడం..
* మీ ఫోన్ మీ వెనుక జేబులో ఉన్నప్పుడు కూర్చుంటే..
* మీ ఫోన్ మీ జేబులో లేదా పర్స్ లో ఉన్నప్పుడు జారిపోవడం..
* స్టైలస్ కాకుండా మరేదైనా స్టైలస్‌గా ఉపయోగించడం.



పగిలిన ఫోన్ స్క్రీన్‌ను నివారించడానికి ఉత్తమ మార్గం ప్రొటెక్టివ్ కేసును ఉపయోగించాలి. మీ స్క్రీన్‌ను కాపాడేందుకు రూపొందించిన Android ఫోన్‌ల కోసం ఎక్కువగా  ఐఫోన్ కేసులు ఉన్నాయి.. అందులో మీ ఫోన్ కు సరిపోయే స్ర్కీన్ కేస్ వాడాలి.

పగిలిన స్క్రీన్‌ను ఎలా ఫిక్స్ చేయాలంటే:
1. ప్యాకింగ్ టేప్ ఉపయోగించండి. ప్యాకింగ్ టేప్ చిన్న భాగాన్ని కత్తిరించండి. పగుళ్లపై ఉంచండి. క్రాక్ ఫోన్ పక్కవైపు ఉంటే, టేప్ కత్తిరించడానికి X-Acto కత్తిని ఉపయోగించండి.

2. సూపర్ గ్లూ ఉపయోగించండి. సూపర్ గ్లూ అని పిలిచే సైనోయాక్రిలేట్ జిగురు చిన్న పగుళ్లను మూసివేస్తుంది.. సాధ్యమైనంత తక్కువగా వాడండి. కాటన్ వస్త్రంతో అదనపు జిగురుతో జాగ్రత్తగా తుడవండి.



3. టచ్ స్క్రీన్ ఇప్పటికీ పనిచేస్తుందా? $ 10- $ 20 మరో గ్లాసు వేసుకోవచ్చు. అవసరమైన టూల్స్ ద్వారా మీ ఫోన్ మోడల్ బట్టి అందుబాటులో ఉంటాయి.

4. మ్యానిఫ్యాక్చర్ కంపెనీని సంప్రదించాలి.. మీ ఫోన్ ఇప్పటికీ వారంటీలో ఉంటే, తయారీదారు మీ డివైజ్ స్ర్కీన్ ఉచితంగా మార్చుకోవచ్చు వారంటీ గడువు ముగిసినప్పటికీ, తయారీదారు కంపెనీ ధరకు ఫిక్స్ చేయొచ్చు.. వారెంటీలు ప్రమాదవశాత్తు స్ర్కీన్ పగిలితే కవర్ కావు.. కొత్త స్క్రీన్ కొనడం ద్వారా వారెంటీలను పొందవచ్చు..

5. స్ర్కీన్ క్రాక్ ఫిక్స్ చేయడానికి మీ మొబైల్ క్యారియర్‌ను సంప్రదించండి.. మీ మొబైల్ ప్రొవైడర్ కస్టమర్లకు తగ్గింపుతో ఫోన్ రిపేర్ సర్వీసులను అందించవచ్చు. కస్టమర్ సపోర్టుకు కాల్ చేయండి లేదా సాయం కోసం స్థానిక మొబైల్ సర్వీసు సెంటర్‌ను సందర్శించండి.



6. రిపేర్ షాపుకు తీసుకెళ్లండి. మీ డివైజ్ మోడల్ బట్టి, స్క్రీన్ రిప్లేస్ మెంట్ సుమారు $ 50- $ 200 వరకు ఉండొచ్చు.. టచ్‌స్క్రీన్ బాగా దెబ్బతింటే అదనపు ఛార్జీ వసూలు చేస్తారు.

7. మీ ఫోన్‌లో ట్రేడ్-ఇన్ చేయండి. మీరు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటే, మీరు పగిలిన డివైజ్ కూడా అమ్మొచ్చు. కొత్తదాన్ని కొనడానికి అదే డబ్బును వాడొచ్చు. యుసెల్, గ్లైడ్ వంటి వెబ్‌సైట్లు పగిలిన ఫోన్‌ను మీరు చెల్లించిన సగం ధరకే కొనుగోలు చేస్తాయి.. ఐఫోన్‌ల అమ్మకం కోసం ప్రత్యేకంగా సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.