Home » Technology » మీ ఆన్‌లైన్ అకౌంట్లకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టారో? లేదో చెక్ చేసుకోండిలా?
Updated On - 5:29 pm, Mon, 1 March 21
strong password for your online accounts : ప్రస్తుత మోడ్రాన్ సోషల్ మీడియా, యాప్ ఎకోసిస్టమ్ ఆధారంగా ఎన్నో యాప్స్, సోషల్ మీడియా అకౌంట్లను వాడుతున్నారు. అన్నింటికి పాస్ వర్డులను గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ కాదనే చెప్పాలి. అందుకే చాలామంది తమ ఆన్ లైన్ అకౌంట్లకు ఒకే పాస్ వర్డ్ పెట్టేసుకుంటారు. ఇలా అయితే సులభంగా గుర్తు ఉంటుందని భావిస్తారు. నిజానికి చాలా డేంజర్ అంటున్నారు సైబర్ నిపుణులు.
సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లకు చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నార్డ్ పాస్ అనే కంపెనీ 2020లో ఆన్ లైన్ చెత్త పాస్ వర్డుల జాబితాను విడుదల చేసింది. అందులో ఎక్కువగా 12345, hello అనే పాస్ వర్డులను ఎక్కువగా పెట్టుకున్నారని తేలింది. నార్డ్ వర్డు రిలీజ్ చేసిన ఈ జాబితాలో 10 అత్యంత చెత్త పాస్ వర్డులను ఓసారి లుక్కేయండి. ఇందులో మీ పాస్ వర్డు కూడా ఉందేమో చెక్ చేసుకోండి.
టాప్ 10 చెత్త పాస్ వర్డులివే :
స్ట్రాంగ్ పాస్‌వర్డ్ క్రియేట్ చేయాలంటే? :
– ఏదైనా ఆన్ లైన్ అకౌంటుకు స్ట్రాంగ్ పాస్ వర్డ్ సెట్ చేయాలంటే ముందుగా 12-14 క్యారెక్టర్స్ ఉండాలి. అంతకంటే ఎక్కువగానే ఉంటే ఇంకా మంచిది.
– మీ పాస్ వర్డులో కేవలం లెటర్స్ మాత్రమే కాదు.. నంబర్లు స్పెషల్ క్యారెక్టర్స్, క్యాపిటల్ లెటర్స్, లోయర్ లెటర్స్ కూడా ఉండేలా చూసుకోవాలి.
– డిక్షనరీ పదాలు అసలే ఉండకూడదు.. అలా కాకుండా మీకు గుర్తుండేలా ఏదైనా పదాలను కలిపి సెట్ చేసుకోవచ్చు.
– స్పెల్లింగ్ తప్పుగా ఉండేలా పాస్ వర్డులు సెట్ చేసుకోవచ్చు.. ఆడ్ క్యారెక్టర్స్ వాడేందుకు ప్రయత్నించండి..
– పాస్ వర్డులో మీ యూజర్ నేమ్ లో ఫస్ట్ నేమ్ గానీ లాస్ట్ నేమ్ లేదా మిడిల్ నేమ్ ఉండకూడదు.
– ఫోన్ నెంబర్లు, ఆధార్, పాన్ కార్డులోని డిజిట్ నెంబర్లు అసలే వాడరాదు..