Whatsapp Group : వాట్సాప్‌ గ్రూప్స్‌తో విసిగిపోయారా? ఇది మీ కోసమే..!

మనకు తెలియకుండానే మన నెంబర్ ను కొందరు వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేస్తుంటారు. ఆ గ్రూప్స్ లో వచ్చే సందేశాలతో విసిగిపోతుంటారు. అయితే మనకు తెలియని వ్యక్తులు మన నెంబర్ ని గ్రూప్స్ లో యాడ్ చేయకుండా ఉండేందుకు సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. అవి ఎలా చేయాలో ఈ ఒకసారి చూద్దాం.

Whatsapp Group : వాట్సాప్‌ గ్రూప్స్‌తో విసిగిపోయారా?  ఇది మీ కోసమే..!

Whatsapp Groups

Whatsapp Group : స్మార్ట్ ఫోన్ ఉందంటే అందులో వాట్సాప్‌ పక్కా ఉండాల్సిందే.. ప్రపంచ వ్యాప్తంగా 3 బిలియన్ల యూజర్లు వాట్సాప్‌ సొంతం. వాట్సాప్‌తో ఇతరులతో కనెక్ట్‌ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఒకేసారి మన ఆలోచనలను ఏదైనా విషయాన్నీ అనేక మందితో పంచుకోడానికి గ్రూప్స్ బాగా ఉపయోగపడతాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఇవి మనకు విసుగు తెప్పిస్తాయి. తెలియనివారు అనేక గ్రూప్స్ లో యాడ్ చేస్తూ ఉంటారు.

కొన్ని సార్లు వాట్సాప్‌ గ్రూప్‌లో వచ్చే మెసేజ్‌లతో అప్పుడప్పుడు మనలో చాలా మందికి విసుగు వస్తుంది. కాగా వాట్సాప్‌లోని ఒక చిన్న ట్రిక్‌తో తెలియని వాట్సాప్‌ గ్రూప్‌ల బెడద నుంచి తప్పించుకోవచ్చును. వాట్సాప్‌ గ్రూప్‌ల్లో ఎవరు మిమ్మల్ని యాడ్‌ చేయాలనే విషయాన్ని నిర్ణయించవచ్చును.

అదెలానో ఇప్పుడు చూద్దాం..

మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేయండి. స్క్రీన్ కుడి వైపు పైన మూలలో ఉన్న మూడు చుక్కలపై టచ్ చేయండి.
తరువాత ‘సెట్టింగ్‌’ పై క్లిక్‌ చేయండి. తరువాత ‘అకౌంట్‌’ ఆప్షన్‌ను ఎంచుకోండి. అకౌంట్‌పై క్లిక్‌ చేసిన తరువాత ‘ప్రైవసీ’ అప్షన్‌పై క్లిక్‌ చేయండి. కొద్దిగా స్క్రీన్‌ను పైకి స్క్రోల్‌ చేసి ‘గ్రూప్స్‌’ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోండి.

ఇక్కడ మీకు మూడు రకాల ఆప్షన్‌లు కనిపిస్తాయి.

1. ఎవ్రీవన్‌, 2. మై కాంటాక్ట్స్, 3. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్‌ అనే ఆప్షన్‌లు ఉంటాయి. డిఫాల్ట్‌గా ‘ఎవ్రీవన్‌’ ఆప్షన్‌ ఉంటుంది. ఈ ఆప్షన్‌లతో ఎవరు మిమ్మల్ని ఇతర వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేసే విషయాన్ని నిర్ణయించవచ్చును. ఇందులోని ఎవ్రీవన్ ఆప్షన్ ఎంచుకుంటే ఎవరైనా మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయొచ్చు.. మై కాంటాక్ట్ అని పెట్టుకుంటే కేవలం మీరు ఫోన్ లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్ లిస్ట్ లోని వారు మాత్రమే ఇతర వాట్సాప్‌ గ్రూప్ లలో యాడ్ చేయగలుగుతారు.

How to Prevent Unknown Users From Adding You to WhatsApp Groups

మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌ ఆప్షన్‌ ద్వారా సదరు వ్యక్తులు మిమ్మల్ని వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేయకుండా చేయవచ్చును. మిమ్మల్ని ఎవరు ఇతర గ్రూప్‌ల్లో యాడ్‌ చేసే వారిని మీరు ఎంచుకోవచ్చును. మీకు నచ్చిన విధంగా సెట్టింగ్‌లను ఎంచుకోని సేవ్‌ చేస్తే చేయాలి. మిమ్మల్ని ఎవరు వేరే వాట్సాప్‌ గ్రూప్‌ల్లో యాడ్‌ చేయలేరు.