Google Chrome Privacy : గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. మీ డేటా ప్రైవసీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Google Chrome Privacy : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ (Google Chrome) ప్రపంచంలోని అత్యంత పాపులర్ పొందిన వెబ్ బ్రౌజర్‌లలో ఒకటి. సైబర్ దాడులు, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో, వెబ్ సర్ఫర్‌లు డేటా ప్రైవసీని కోల్పోయే అవకాశం ఉంది.

Google Chrome Privacy : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ (Google Chrome) ప్రపంచంలోని అత్యంత పాపులర్ పొందిన వెబ్ బ్రౌజర్‌లలో ఒకటి. సైబర్ దాడులు, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో, వెబ్ సర్ఫర్‌లు డేటా ప్రైవసీని కోల్పోయే అవకాశం ఉంది. వెబ్‌లో యూజర్లను సురక్షితంగా ఉంచేందుకు కొంత సెక్యూరిటీ, ప్రైవసీ ఫీచర్లను అందిస్తుంది. మీ డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు బ్రౌజర్ కొన్ని ఫీచర్లను అందిస్తుంది. గూగుల్ క్రోమ్ ఉపయోగించి మీ డేటాను ఎలా ప్రొటెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

క్రోమ్ ప్రైవసీ, సెక్యూరిటీ కంట్రోల్ :
గూగుల్ క్రోమ్‌లో ప్రైవసీ, సెక్యూరిటీ కంట్రోల్ చేసుకోవచ్చు. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ప్రైవసీ, సెక్యూరిటీ కంట్రోల్స్ ద్వారా యూజర్లను అనేక మార్గాలను అందిస్తోంది. ప్రైవసీ ఫీచర్లను యాక్సెస్ చేసేందుకు Chrome టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న 3 చుక్కల ఆప్షన్ల మెనుపై క్లిక్ చేయండి. ఇప్పుడు సెట్టింగ్‌ల ఆప్షన్ ఓపెన్ చేయండి.

ఇంకా, ప్రైవసీ, సెక్యూరిటీ ట్యాబ్‌కు నావిగేట్ చేయండి. ప్రైవసీ గైడ్ 3 సెక్షన్లను కలిగి ఉంటుంది. Googleకి డేటాను పంపడం ద్వారా బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్ సేఫ్ బ్రౌజింగ్ ప్రొటెక్షన్ ఎంచుకోవచ్చు.థర్డ్ పార్టీ కుక్కీ ప్రాధాన్యతలను ఎంచుకోవచ్చు. వినియోగదారులను అన్ని ఆప్షన్లను మార్పులు చేసేందుకు థర్డ్ పార్టీ సైట్‌లను అనుమతిస్తుంది.

Google Chrome : How to protect your privacy when using Google Chrome

Read Also : Poco X5 Series : భారత మార్కెట్లో పోకో X5 5G సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు ఏంటో తెలిసిందోచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

గూగుల్ క్రోమ్ సెక్యూరిటీ చెక్‌లను నిర్ధారించుకోండి :
క్రోమ్‌లో ఎల్లప్పుడూ సెక్యూరిటీ చెకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ని ఉపయోగించేందుకు బ్రౌజర్ సెట్టింగ్ మెనులో సేఫ్టీ చెక్ చేయొచ్చు. ఇప్పుడు సెక్యూరిటీ చెకింగ్, సెక్యూరిటీ చెకింగ్ తర్వాత ఏవైనా సమస్యలు కనిపిస్తే వాటిని ఫిక్స్ చేయండి. డివైజ్‌లలో పాస్‌వర్డ్‌లను స్టోర్ చేసేందుకు సేవ్ చేసేందుకు Google పాస్‌వర్డ్ ఉపయోగించండి.

క్రోమ్ పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్, Google అకౌంట్ ద్వారా మల్టీ డివైజ్‌ల్లో పాస్‌వర్డ్‌లను చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అకౌంట్ల కోసం స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసి స్టోర్ చేస్తుంది. సైట్‌కు లాగిన్ అయిన తర్వాత పాస్‌వర్డ్‌లను ఆటోమాటిక్‌గా పాస్‌వర్డ్ మేనేజర్‌కి సేవ్ చేసే ఆప్షన్ బ్రౌజర్ అందిస్తుంది. ఈ మెనుని ఉపయోగించి మార్చవచ్చు. లేదంటే ఎడ్జెస్ట్ చేయొచ్చు.

మొబైల్‌లో Incognito సెషన్‌ను లాక్ చేయండి :
iOS డివైజ్‌లో Incognito బ్రౌజింగ్ సెషన్‌ను రీస్టోర్ట్ చేయొచ్చు. బయోమెట్రిక్ అథెంటికేషన్ అవసరమయ్యే ఆప్షన్ ఎంచుకోవడానికి Google Chrome యూజర్లను అనుమతిస్తుంది. Chrome సెట్టింగ్‌లను విజిట్ చేసి ‘Privacy & Security’ఎంచుకోండి. బ్రౌజర్ క్లోజ్ చేసినప్పుడు Incognito లాక్ ట్యాబ్‌లను ఆన్ చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy Book 3 Series : ఫిబ్రవరి 1న శాంసంగ్ గెలాక్సీ బుక్ 3 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ల్యాప్‌టాప్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు