Silence Autoplay Videos: ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఆటోప్లే వీడియోలను Mute చేయాలంటే?

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ ఫీడ్‌లో ఆటో ప్లే వీడియోలతో విసిగిపోయారా? స్క్రోల్ చేసినప్పుడుల్లా అందులోని వీడియోలు ఆటో ప్లే కావడం ఇబ్బందిగా ఫీలవుతున్నారా?

Silence Autoplay Videos: ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఆటోప్లే వీడియోలను Mute చేయాలంటే?

How To Silence Autoplay Videos On Facebook And Twitter (1)

How to Silence Autoplay Videos : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ ఫీడ్‌లో ఆటో ప్లే వీడియోలతో విసిగిపోయారా? స్క్రోల్ చేసినప్పుడుల్లా అందులోని వీడియోలు ఆటో ప్లే కావడం ఇబ్బందిగా ఫీలవుతున్నారా? అయితే ఫేస్ బుక్, ట్విట్టర్ లో పోస్టు చేసిన వీడియోలు ఆటో ప్లే కాకుండా సెట్ చేసుకోవచ్చు.. మీరు వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్ అలాంటి వీడియోలను ఎలా సైలెంట్ మోడ్‌లో టర్న్ ఆఫ్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఆండ్రాయిడ్ ఫోన్ :
ఫేస్ బుక్ యాప్ ఓపెన్ చేయండి..
టాప్ రైట్ మెనూ బటన్‌పై క్లిక్ చేయండి..
స్క్రోల్ డౌన్ చేయండి.. Settings & Privacy పై క్లిక్ చేసి Settings సెలక్ట్ చేసుకోండి. .
సెట్టింగ్స్ స్ర్కీన్ ఓపెన్ చేసి స్ర్కోలింగ్ చేయండి..
Media and Contacts అనే ఆప్షన్ ఉంటుంది.
Autoplay ఆప్షన్ సెలక్ట్ చేయండి.. Never Autoplay Videos ఆప్షన్ ఎంచుకోండి.

ఐఫోన్ iOS యాప్ :
– ఆండ్రాయిడ్ యాప్ మాదిరిగానే ఫేస్‌బుక్ యాప్ లాగిన్ చేయండి.
– ఇందులో కిందిభాగంలో మెనూ బటన్ స్క్రీన్ కనిపిస్తుంది.
– Settings & Privacy ఆప్షన్ ట్యాప్ చేసి.. Settings సెలక్ట్ చేయండి.
– కిందికి స్ర్కోల్ చేసి Media & Contacts కోసం సెర్చ్ చేయండి.
– కిందిభాగంలో Videos and Photos అనే ఆప్షన్ Tap చేయండి.
– మీకు అక్కడ Autoplay ఆప్షన్ కనిపిస్తుంది.. ఫీచర్ Disable చేయండి.

Web Browser (డెస్క్ టాప్ PC) :
– ఫేస్ బుక్ బ్రౌజర్ లో ఓపెన్ చేయండి.
– టాప్ రైట్ పేజీలో డ్రాప్ డౌన్ మెనూపై క్లిక్ చేయండి.
– Settings & Privacy ఆప్షన్.. Settins బటన్ పై Tap చేయండి.
– ఎడమవైపు మెనూలో Videos కోసం సెర్చ్ చేయండి..
– AutoPlay వీడియో ఫీచర్ మ్యూట్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది.

Twitter ఆటోప్లే వీడియోలు :
ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్ లో ట్విట్టర్ యాప్ ఓపెన్ చేయండి.
– టాప్ లెఫ్ట్ స్ర్కీన్ భాగంలో hamburger ఐకాన్ ఉంటుంది.
– మెనూలో Settings and privacy ఆప్షన్ సెలక్ట్ చేయండి.
– Data Usage అనే ఆప్షన్ కోసం సెర్చ్ చేయండి.
– Video Autoplay ఆప్షన్ పై ట్యాప్ చేసి.. Never అని సెట్ చేయండి.

బ్రౌజర్ (డెస్క్ టాప్) :
– లెఫ్ట్ హ్యాండ్ మెనూలో More ఆప్షన్ పై Tap చేయండి.
– Settings and privacy అనే ఆప్షన్ సెలక్ట్ చేయండి.
– Accessibility>display>languages సెలక్ట్ చేసి స్ర్కోల్ డౌన్ చేయండి.
– Data Usage ఆప్షన్ కనిపిస్తుంది. ఆ కింద Autoplay సెట్టింగ్ కనిపిస్తుంది.
– ఆటోప్లే వీడియోలు ఆప్షన్ Switch off చేయండి..