iOS16 Beta Update : iOS 16 beta అప్‌డేట్‌తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!

ఆపిల్ ఇటీవలే iOS 16beta 2 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త iOS 16 బీటా అప్‌డేట్ iPhone 13, iPhone 12 ఇతర iPhone మోడల్స్ కోసం రూపొందించింది కంపెనీ.

iOS16 Beta Update : iOS 16 beta అప్‌డేట్‌తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!

How To Uninstall Ios 16 Beta Update And Go Back To Ios 15

iOS16 Beta Update : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఇటీవలే iOS 16beta 2 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త iOS 16 బీటా అప్‌డేట్ iPhone 13, iPhone 12 ఇతర iPhone మోడల్స్ కోసం రూపొందించింది కంపెనీ. అయితే డెవలపర్‌లు తమ యాప్‌లను అప్‌డేట్ చేసేందుకు ఈ కొత్త ఫీచర్లతో ప్రయత్నించవచ్చు. ఇతర యూజర్లు మాత్రం ఐఓఎస్ కొత్త ఫీచర్లను పొందాలంటే వారి ప్రైమరీ డివైజ్‌ల్లో iOS 16 బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బీటా అప్‌డేట్స్ కారణంగా.. ఐఓఎస్ బ్యాటరీ సాధారణం కన్నా వేగంగా డ్రెయిన్ అయ్యేలా చేస్తుంది. iOS 16 బీటా 2 లేదా ఏదైనా ఇతర iOS 16 బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా యూజర్లు తమ iOS 15.5కి మారపోవాల్సిందే.. మీ iPhoneలో iOS 16 బీటా 2ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు తిరిగి iOS 15కి ఎలా వెళ్లవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.

iOS 16 బీటా 2 అన్‌ఇన్‌స్టాల్.. iOS 15 ఇన్‌స్టాల్ చేయండిలా..
iOS 15కి తిరిగి మారిపోవాలనుకుంటున్నారా? iOS 16 బీటా అప్‌డేట్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసేందుకు వేగవంతమైన సులభమైన మార్గం మీ డివైజ్ రిస్టార్ చేయాలి. అలా చేయడం ద్వారా, బీటా సాఫ్ట్‌వేర్‌ ద్వారా క్రియేట్ అయిన బ్యాకప్‌లు iOS పాత వెర్షన్‌లకు సపోర్టు చేయకపోవచ్చు. కాబట్టి మీరు iOS 16లో తీసిన బ్యాకప్‌ని రీస్టోర్ చేయలేరని గుర్తించుకోండి. Apple iOS 15 బ్యాకప్ డేటాను రీస్టోర్ చేయడానికి మీకు ఆప్షన్ అందిస్తుంది (ఒక బ్యాకప్ ఉన్నట్లయితే) మాత్రమే.. లేదంటే కొత్త iPhoneగా (Reset) సెటప్ చేస్తుంది.

How To Uninstall Ios 16 Beta Update And Go Back To Ios 15 (1)

How To Uninstall Ios 16 Beta Update And Go Back To Ios 15

ఈ కింది విధంగా ఫాలో అవ్వండి :
మీరు iOS 16 బీటా ప్రక్రియను అన్‌ఇన్‌స్టాల్ చేసే ముందు మీ Macలో లేటెస్ట్ macOS అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేశారో లేదో నిర్ధారించుకోండి.
మీ ఐఫోన్‌ను మీ Mac లేదా PCకి కనెక్ట్ చేయండి. దాన్ని రికవరీ మోడ్‌లో ఉంచండి.
iPhone 8 లేదా నెక్స్ట్ కోసం.. వాల్యూమ్ అప్ బటన్‌ను నొక్కండి. ఆపై వాల్యూమ్ డౌన్ బటన్‌ను నొక్కి వెంటనే రిలీజ్ చేయండి.
ఆపై, మీరు రికవరీ మోడ్ స్క్రీన్‌ను చూసే వరకు పవర్ బటన్‌ను అలానే నొక్కి పట్టుకోండి.

మీ Macలో “Restore” ఆప్షన్ కనిపించినప్పుడు దానిపై క్లిక్ చేయండి. మీ డివైజ్ డేటాను తొలగిస్తుంది. ప్రస్తుతం iOS 15.5గా ఉన్న లేటెస్ట్ iOS నాన్-బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. డౌన్‌లోడ్ చేసేందుకు 15 నిమిషాల కన్నా ఎక్కువ సమయం తీసుకోవచ్చు. మీ iPhone రికవరీ మోడ్ స్క్రీన్ నుంచి నిష్క్రమిస్తే.. డౌన్‌లోడ్ పూర్తిగా చేయండి. ఆపై గత స్టెప్‌ను మరోసారి రిపీట్ చేయండి. ఆ తర్వాత, మీ ఐఫోన్‌లో లేటెస్ట్ iOS 15 అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయమని ప్రాంప్ట్ కనిపిస్తుంది. అక్కేడ మీరు ఇన్‌స్టాల్ ఆప్షన్ నొక్కండి. మీ Mac/ PC లేదా iCloudలో తీసిన iOS 15 నుంచి బ్యాకప్‌ని తర్వాత రీస్టోర్ చేసుకోవచ్చు.

మీరు బీటా ప్రొఫైల్‌ను తొలగించడంతో పాటు పబ్లిక్ బీటాను కూడా తొలగించవచ్చు. అందుకు మీరు Settings> General> VPN & Device Management > iOS 16 బీటా ప్రొఫైల్ > Remove Profile పై ట్యాప్ చేయండి. మీ డివైజ్ Restart చేయండి. ఈ పద్ధతి ద్వారా మీ iPhoneని iOS 15కి డౌన్‌గ్రేడ్ కాదని గుర్తుంచుకోండి. మీరు నెక్స్ట్ iOS నాన్-బీటా వెర్షన్ డౌన్‌లోడ్ కోసం వేచి ఉండాలి. అప్‌డేట్ ఇప్పటికే అందుబాటులో ఉంటే.. మీరు సెట్టింగ్‌లు> జనరల్>సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కి వెళ్లి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Read Also : iPhone 14 : ఈ సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?