Android 13 beta : మీ ఫోన్లో ఆండ్రాయిడ్ 13 బీటా అప్‌డేట్ చేయండిలా..!

Android 13 beta : ఆండ్రాయిడ్ 13 బీటా (Android 13 beta update) అప్‌డేట్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ కొత్త లేటెస్ట్ వెర్షన్ అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త వెర్షన్ మీ స్మార్ట్ ఫోన్లలో వర్క్ అవుతుందో లేదో తెలుసుకోండి.

Android 13 beta : మీ ఫోన్లో ఆండ్రాయిడ్ 13 బీటా అప్‌డేట్ చేయండిలా..!

How To Upgrade Your Phone To Android 13 Beta Update (1)

Android 13 beta : ఆండ్రాయిడ్ 13 బీటా (Android 13 beta update) అప్‌డేట్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ కొత్త లేటెస్ట్ వెర్షన్ అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త వెర్షన్ మీ స్మార్ట్ ఫోన్లలో వర్క్ అవుతుందో లేదో తెలుసుకోండి. ఈ ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. మీరు చేయాల్సిందల్లా.. మీ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆండ్రాయిడ్ బీటా ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకోవడమే. మీకు Pixel ఫోన్ లేదా? OnePlus, Vivo, Realme ఇతర స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల నుంచి ఇతర ఫోన్‌లకు కూడా Android 13 బీటా అందుబాటులో ఉంది.

Android 13 బీటా: ఏయే ఫోన్లలో సపోర్టు చేస్తుందంటే?
సాధారణంగా చాలా పిక్సెల్ ఫోన్‌లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 బీటా అప్‌డేట్‌ కలిగి ఉంటాయి. ఈ జాబితాలో Pixel 4, Pixel 4 XL, Pixel 4a, Pixel 4a 5G, Pixel 5, Pixel 5a, Pixel 6 Pixel 6 Pro ఉన్నాయి. ఇవి కాకుండా, OnePlus 10 Pro, Asus Zenfone 8, Lenovo P12 Pro, Nokia X20, Oppo Find N, Oppo Find X5 Pro, Realme GT 2 Pro, Vivo X80 Pro, Xiaomi 12 సిరీస్ Tecno Camon 19 Pro కూడా సపోర్టు చేస్తాయి. ఈ ఫోన్‌లలో మీరు ఏదైనా ఒకటి కలిగి ఉంటే.. Android 13 బీటా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.

How To Upgrade Your Phone To Android 13 Beta Update

How To Upgrade Your Phone To Android 13 Beta Update

మీ పిక్సెల్ ఫోన్‌లో Android 13 బీటాను ఇన్‌స్టాల్ చేయడింలా :
– ముందుగా Google అధికారిక Android 13 బీటా ప్రోగ్రామ్ పేజీకి వెళ్లాలి..
developer.android.com/about/versions/13/devices సంబంధించిన లింక్ ఓపెన్ చేయండి.
– మీరు ఇప్పుడు మీ Google అకౌంట్లో లాగిన్ అవ్వాలి.
– Android పేజీలో, మీరు స్క్రీన్ పైభాగంలో ‘View your eligible devices’ బటన్‌ నొక్కండి.
– మీ డివైజ్ అర్హత కలిగి ఉంటే.. మీరు “Opt in” బటన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
– బీటా ప్రోగ్రామ్‌ను ఎంచుకోవాలి. Google Android 12, Android 13 బీటా ప్రోగ్రామ్‌తో సహా రెండు ఆప్షన్లు ఉన్నాయి.
– నిబంధనలు, షరతులను చదివి, క్రిందికి స్క్రోల్ చేయండి.
– ఆ తర్వాత మీరు “I agree to the terms of the beta program” అనే బాక్సులో చెక్ చేయాలి.
– ఇప్పుడు, బీటా ప్రోగ్రామ్ కోసం Sign-Up ప్రాసెస్‌ పూర్తి చేయాలి.
– Confirm and enroll బటన్‌పై నొక్కండి.

Note : మీ డివైజ్ ఆండ్రాయిడ్ 12 బీటాను రన్ కాకపోతే.. మీరు రెండోదాన్ని ఎంచుకోవచ్చు. లేటెస్ట్ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు మీరు ముందుగా ఓల్డ్ వెర్షన్‌ స్టాప్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రాసెస్‌ని పూర్తి చేసిన తర్వాత.. OTA అప్‌డేట్‌ని అందుకుంటారు. సిస్టమ్ నోటిఫికేషన్ కోసం వేచి ఉండవచ్చు లేదా settings section > System > System update అప్‌డేట్ కోసం మాన్యువల్‌గా చెక్ చేయవచ్చు. Android 13 బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత.. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను రీబూట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ Pixel ఫోన్‌లో లేటెస్ట్ Android 13 బీటా వెర్షన్‌ను టెస్టింగ్ ప్రారంభించవచ్చు.

Read Also : Airtel vs Jio vs Vi : రూ. 500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లివే.. OTT బెనిఫిట్స్..!