HP ల్యాప్‌టాప్స్ రీకాల్.. ప్రపంచంలోనే ఫస్ట్ టైం

స్మార్ట్ ఫోన్ల ఎంత క్రేజ్ ఉందో.. ల్యాప్ టాప్ లకు కూడా అంతే క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమ అవసరాల కోసం ల్యాప్ టాప్ లను వినియోగిస్తుంటారు.

  • Published By: sreehari ,Published On : March 15, 2019 / 03:34 PM IST
HP ల్యాప్‌టాప్స్ రీకాల్.. ప్రపంచంలోనే ఫస్ట్ టైం

స్మార్ట్ ఫోన్ల ఎంత క్రేజ్ ఉందో.. ల్యాప్ టాప్ లకు కూడా అంతే క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమ అవసరాల కోసం ల్యాప్ టాప్ లను వినియోగిస్తుంటారు.

స్మార్ట్ ఫోన్లకు ఎంత క్రేజ్ ఉందో.. ల్యాప్ టాప్ లకు కూడా అంతే క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమ అవసరాల కోసం ల్యాప్ టాప్ లను వినియోగిస్తుంటారు. డెస్క్ టాప్ కంటే… ఈజీగా ఎక్కడికంటే అక్కడికి క్యారీచేసేందుకు ల్యాప్ టాప్ లు వీలుగా ఉంటాయి. అందుకే ప్రతిఒక్కరూ.. ల్యాప్ టాప్స్ నే ఎక్కువగా వాడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. టెక్నికల్ విద్యార్థుల నుంచి బిజినెస్ మ్యాన్ ల వరకు అందరికి ల్యాప్ టాప్ తో పని. కంపెనీ బిజినెస్ వ్యవహారాలన్నీ ఇందులోనే చూస్తుంటారు. ల్యాప్ టాప్ వాడకం పెరుగుతున్న కొద్ది ఎన్నో సమస్యలు వస్తుంటాయి.

ఓవర్ హీటింగ్.. ఫైర్ రిస్క్ ఇష్యులే కారణం..
అందులో ప్రధానంగా చెప్పుకొనేది బ్యాటరీ బ్యాకప్ ప్రాబ్లమ్. బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్ కొన్నప్పటికీ కొన్నిసార్లు మొరాయిస్తుంటాయి. మరికొన్ని ల్యాప్ టాప్ ల్లో బ్యాటరీ ఇష్యులు ఎక్కువగా ఉంటాయి. బ్యాటరీ ఫెయిల్ కావడం, ఓవర్ హీటింగ్, కాలిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇందుకు కారణాలు ఏమైనా కావొచ్చు. ఇలాంటి సమస్యలను కంట్రోల్ చేసేందుకు ప్రముఖ సాఫ్ట్ వేర్ అండ్ కంప్యూటర్ సర్వీసెస్ అమెరికన్ మ్యానిఫ్యాక్షర్ సంస్థ HP (హెల్వెట్-ప్యాకార్డ్) ఫైర్ రిస్క్ ఉన్న హెచ్ పీ ల్యాప్ ట్యాప్ బ్యాటరీలను విస్తరిస్తోంది. వాలంటరీ సేప్టీ ప్లాన్ లో భాగంగా హెచ్ పీ తమ ప్రొడక్ట్ ను రీకాల్ చేస్తోంది. దీంతో ప్రపంచంలోనే ఫస్ట్ టైం ల్యాప్ టాప్స్ ను రీకాల్ చేస్తున్న సంస్థ HP కావడం విశేషం. 
Read Also: మన బడ్జెట్ లో : రూ.10వేల లోపు.. టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే..

హెచ్ పీ ల్యాప్ టాప్స్ ప్రొడక్ట్ రీకాల్ చేస్తున్నట్టు యూనైటెడ్ స్టేట్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్ సేప్టీ కమిషన్ (CPSC) వెబ్ సైట్ లో పోస్టు పెట్టింది. HP laptops ప్రొడక్ట్ రీకాల్ expansion కు సంబంధించి 2018 జనవరిలోనే తొలిసారి ప్రవేశపెట్టింది. దాన్ని ఈ ఏడాది జనవరిలో దీన్ని పూర్తిస్థాయిలో విస్తరించింది. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ కావడంతో ప్రభుత్వ ఏజెన్సీ నుంచి కమ్యూనికేషన్ కట్ అయింది. దీంతో హెచ్ పీ రీకాల్ ప్రొడక్ట్ విస్తరణను 2019 జనవరి 17న స్వయంగా ప్రకటించింది. ప్రొడక్ట్ రీకాల్ విస్తరణకు సంబంధించి డేటాను సీపీఎస్ సీ వెబ్ సైట్ లో మంగళవారం హెచ్ పీ అప్ డేట్ చేసింది.

హెచ్ పీ వినియోగదారులకు ఇప్పటికే హెచ్ పీ సంస్థ బ్యాటరీ రీప్లేస్ మెంట్ కు సంబంధించి సమాచారం అందించింది. HP Laptops battery recall expand  చేసినప్పటికీ రీప్లేస్ మెంట్ బ్యాటరీలపై ప్రభావం ఉండదని తెలిపింది. జనవరిలోనే 50వేల HPల్యాప్ టాప్ బ్యాటరీల రీకాలింగ్ చేయడం ప్రారంభించింది. లిథినియం-ఐయాన్ బ్యాటరీల్లో ఓవర్ హీట్ సమస్య ఎక్కువ ఉందనే ప్రశ్నకు సమాధానంగా హెచ్ పీ రీకాల్ ప్రొడక్ట్ ప్రాసెస్ ను మొదలుపెట్టింది. అమెరికాలో బ్యాటరీ ప్యాక్స్ కు సంబంధించి 8 కొత్త రిపోర్ట్ లు హెచ్ పీ ఇప్పటికే అందినట్టు సీపీఎస్సీ తెలిపింది. 

78వేల 500 బ్యాటరీలు రీకాలింగ్..
ఓవర్ హీటింగ్, మెల్టింగ్, కాలిపోవడం, బ్యాటరీ కరిగిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమైనట్టు ఒక రిపోర్ట్ లో వెల్లడించింది. బ్యాటరీ ఫేయిల్ అయిన కారణంగా ఒకరికి స్వల్పగాయాలు కాగా, మొత్తం 1.100 డాలర్లు (రూ.75వేల 847.75) ఆస్తి నష్టం వాటిల్లనట్టు నివేదికలో పేర్కొంది. హెచ్ పీ రీకాల్ విస్తరణలో భాగంగా మొత్తం 78వేల 500లకు పైగా హెచ్ పీ బ్యాటరీలను ఎక్స్ ప్యాండ్ చేస్తోంది. ఇందులో కమర్షియల్ నోట్ బుక్ కంప్యూటర్స్, మొబైల్ వర్క్ స్టేషన్లలో వినియోగించే బిజినెస్, ఇతర సంస్థలు కొనుగొలు చేశాయి.

వినియోగదారుల కోసం సపోర్ట్ ఫేజ్
రీకాల్ చేస్తున్న ల్యాప్ టాప్ బ్యాటరీలను 50వేలకు పైగా ఉన్నట్టు సంస్థ తెలిపింది. హెచ్ పీ ఇంక్. ల్యాప్ టాప్ బ్యాటరీ సమస్యలు ఉన్న వినియోగదారులను గుర్తించి వారి బ్యాటరీలను రికాల్ చేయడానికి HP.inc తమ వెబ్ సైట్ లో ఒక సపోర్ట్ పేజీని కూడా రన్ చేస్తోంది. ఇందులో హెచ్ పీ ల్యాప్ టాప్ వినియోగదారులు జనవరి నుంచి మార్చి వరకు రీకాల్ అయిన హెచ్ ల్యాప్ టాప్ ల పూర్తి జాబితాను పొందొచ్చు.  
Read Also: PubG ఫ్యాన్స్ రిలాక్స్: గేమ్ బ్యాన్ చేయడం అంత ఈజీ కాదు!