Huawei FreeBuds Pro 3 : హువావే ఫ్రీబడ్స్ ప్రో 3 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. సింగిల్ ఛార్జ్‌తో 31 గంటల బ్యాటరీ లైఫ్, అదిరే ఫీచర్లు, ధర ఎంతంటే?

Huawei FreeBuds Pro 3 : కొత్త ఇయర్‌బడ్స్ కొంటున్నారా? అద్భుతమైన ఫీచర్లతో హువావే ఫ్రీబడ్స్ ప్రో 3 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లాంచ్ అయింది. సింగిల్ ఛార్జ్‌తో 31 గంటల బ్యాటరీ లైఫ్ పొందవచ్చు.

Huawei FreeBuds Pro 3 : హువావే ఫ్రీబడ్స్ ప్రో 3 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. సింగిల్ ఛార్జ్‌తో 31 గంటల బ్యాటరీ లైఫ్, అదిరే ఫీచర్లు, ధర ఎంతంటే?

Huawei FreeBuds Pro 3 Wireless Earbuds With ANC 3.0, Up to 31 Hours Battery Life Launched

Huawei FreeBuds Pro 3 : కొత్త ఇయర్‌బడ్స్ కొనేందుకు చూస్తున్నారా? హువావే (Huawei) నుంచి సరికొత్త హువావే ఫ్రీబడ్స్ ప్రో 3 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయొచ్చు. బార్సిలోనాలో జరిగిన ‘వేరబుల్ స్ట్రాటజీ అండ్ న్యూ ప్రొడక్ట్ లాంచ్’ ఈవెంట్‌లో Huawei వాచ్ GT 4తో పాటు కొత్త ఇయర్‌ఫోన్‌లు (FreeBuds Pro 3)ని లాంచ్ చేసింది.

ఇయర్‌ఫోన్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) 3.0తో అమర్చి ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. గరిష్టంగా 31 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందజేస్తాయని పేర్కొంది. కొత్త రియల్ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌ఫోన్‌లు డ్యూయల్ డివైజ్‌ల కనెక్టివిటీకి సపోర్టు ఇస్తాయి. హువావే ఫ్రీబడ్స్ ప్రో 3 ఎంపిక చేసిన మార్కెట్లలో వచ్చే నెల నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇయర్‌ఫోన్‌లలో డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్ కూడా ఉంది.

Read Also : iPhone 16 Series Leak : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చేస్తోంది.. కొత్త బిగ్ లీక్ ఇదిగో.. ఐఫోన్ 15కు మించి అదిరే అప్‌గ్రేడ్స్..!

హువావే FreeBuds ప్రో 3 ధర ఎంతంటే? :
హువావే ఫ్రీబడ్స్ ప్రో 3 ANC ఇయర్‌ఫోన్‌లు ఫ్రీబడ్స్ ప్రో 2కి సక్సెసర్‌గా లాంచ్ అయ్యాయి. EUR199 (దాదాపు రూ. 17,600) ధరతో లాంచ్ అయ్యాయి. గ్రీన్, సిల్వర్ ఫ్రాస్ట్, వైట్ అనే 3 కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. TWS ఇయర్‌ఫోన్‌లు ఐరోపాలో అక్టోబర్ 18న అమ్మకానికి వస్తాయి.

Huawei FreeBuds Pro 3 Wireless Earbuds With ANC 3.0, Up to 31 Hours Battery Life Launched

Huawei FreeBuds Pro 3 Wireless Earbuds With ANC 3.0, Up to 31 Hours Battery Life Launched

హువావే ఫ్రీబడ్స్ ప్రో 3 స్పెసిఫికేషన్‌లు :
హువావే ఫ్రీబడ్స్ ప్రో 2 అప్‌గ్రేడ్ వెర్షన్.. కొత్తగా లాంచ్ అయిన హువావే ఫ్రీబడ్స్ ప్రో 3 సున్నితమైన కంట్రోల్‌తో ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. గ్రూవ్ డిజైన్, ఫీచర్ డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్‌ను కలిగి ఉన్నారు. ఇయర్‌ఫోన్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 3.0తో వస్తాయి. హై-రెస్ డ్యూయల్ సౌండ్ సిస్టమ్‌తో ఉంటాయి. 14Hz, 48kHz మధ్య పెద్ద ఫ్రీక్వెన్సీ పరిధికి సపోర్టు ఇస్తుంది. 5dB వరకు నాయిస్ సప్రెషన్‌ను కూడా అందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. అదనంగా, హువావే నుంచి ఇయర్‌ఫోన్‌లు ట్రిపుల్ అడాప్టివ్ ఈక్వలైజర్‌ను కలిగి ఉన్నాయి.

కంపెనీ ప్రకారం.. వాల్యూమ్, వేర్, సౌండ్‌ను విశ్లేషించడం ద్వారా మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. హువావే L2HC 2.0, LDAC డ్యూయల్ హై-డెఫినిషన్ ఆడియో డీకోడింగ్‌తో 990kbps వరకు ఆడియో ట్రాన్స్‌మిషన్ అందిస్తుంది. హువావే ఫ్రీబడ్స్ ప్రో 3 Android, iOS డివైజ్‌లకు సపోర్టుగా ఉంటుంది. హువావే ఫ్రీబడ్స్ ప్రో 3 కేస్‌తో 31 గంటల బ్యాటరీ లైఫ్, ఇయర్‌ఫోన్‌ల ఒకే ఛార్జ్‌పై 6.5 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ డివైజ్ ఇతర ఫీచర్లలో ఆడియో షేరింగ్, ఆటోమేటిక్ పాప్-అప్స్ ఉన్నాయి.

Read Also : Nokia G42 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? నోకియా G42 5G సేల్ మొదలైందిగా.. అమెజాన్‌లో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!