Ioniq 5 EV: హ్యుందాయ్ సంస్థ నుంచి ‘ఐయానిక్ 5 ఈవీ’ ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ ఇవే

కార్ల తయారీ కంపెనీలు అన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించాయి. హ్యుందాయ్ సంస్థ కూడా త్వరలో ఎలక్ట్రిక్ కారును ఇండియాలో లాంఛ్ చేయబోతుంది. ‘ఐయానిక్ 5 ఈవీ’ పేరుతో కొత్త కారు విడుదల కానుంది.

Ioniq 5 EV: హ్యుందాయ్ సంస్థ నుంచి ‘ఐయానిక్ 5 ఈవీ’ ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ ఇవే

Ioniq 5 EV: హ్యుందాయ్ సంస్థ నుంచి ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లోకి విడుదల కానుంది. ‘ఐయానిక్ 5 ఈవీ’ పేరుతో ఈ కారు త్వరలోనే భారత రోడ్లపై పరుగులు తీయనుంది. అయితే, ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. సంస్థ వెబ్‌సైట‌్‌లో రూ.1 లక్ష అడ్వాన్స్‌గా చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు.

Covid-19: చైనాలో పెరుగుతున్న కోవిడ్.. ఇండియాకు ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందా?

ఈ ఎస్‌యూవీ మూడు రంగుల్లో ఉంటుంది. ఒకటి గ్రావిటీ గోల్డ్, రెండోది ఆప్టిక్ వైట్, మూడోది మిడ్ నైట్ బ్లాక్ పెర్ల్. ఇది 10-80 శాతం వరకు 18 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది. మల్టీ ఛార్జింగ్ సిస్టమ్ కలిగి ఉంది. దీని బ్యాటరీ 72.6 కిలో వాట్స్ పర్ అవర్ కెపాసిటీ కలిగి ఉంది. 60 వరకు కార్ కనెక్టెడ్ ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. మూడేళ్ల వరకు బ్లూ లింక్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. దీని ద్వారా వాయిస్ అసిస్టెంట్, ఎస్ఓఎస్/ఎమర్జెన్సీ అసిస్టెన్స్, లో టైర్ ప్రెజర్ నోటిఫికేషన్, లోకేషన్ బేస్డ్ సర్వీస్ వంటివి అందుతాయి. ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. డ్రైవర్, ప్యాసింజర్స్, సైడ్, కర్టైన్ స్థానాల్లో ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేశారు. వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, నాలుగు డిస్క్ బ్రేక్స్, మల్టీ కొలిసన్ అవాయిడెన్స్ బ్రేక్, పవర్ చైల్డ్ బ్రేక్ వంటి ఫీచర్లున్నాయి.

DL Ravindra Reddy: వైసీపీలో ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉంది.. చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి

అయితే, ఈ కారు కచ్చితమైన ధర ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో విడుదలైన ఈ కారుకు మంచి ఆదరణ దక్కింది. ఈ కారుకు ఈ ఏడాది పలు అవార్డులు కూడా దక్కాయి. ‘2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’తో పాటు ‘వరల్డ్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‘, ‘వరల్డ్ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ వంటివి గెలుచుకుంది.