Smartphone Market: భారత్‌లో తగ్గేదే లే.. కోవిడ్‌లోనూ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్.. 17.3కోట్ల ఫోన్లు కొన్నారు

2021 సంవత్సరంలో కోవిడ్ -19 కారణంగా, అన్ని వ్యాపారాలలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మాత్రం 2021 సంవత్సరంలో రికార్డుస్థాయిలో అమ్మకాలు జరిగాయి.

Smartphone Market: భారత్‌లో తగ్గేదే లే.. కోవిడ్‌లోనూ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్.. 17.3కోట్ల ఫోన్లు కొన్నారు

Smart Phone

Smartphone Market: 2021 సంవత్సరంలో కోవిడ్ -19 కారణంగా, అన్ని వ్యాపారాలలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మాత్రం 2021 సంవత్సరంలో రికార్డుస్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఈ కాలంలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సుమారు 173 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం కంటే ఇది 14 శాతం వృద్ధిని సాధించింది. కౌంటర్‌పాయింట్ రిచెస్ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో 100 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్లు అమ్ముడు పోయినట్లుగా అంచనా వేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ల భారీ అమ్మకాలు:
నివేదిక ప్రకారం, జూన్‌లో కోవిడ్ -19 ఆంక్షలను సడలించిన తర్వాత, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వినియోగదారుల డిమాండ్ బాగా పెరిగింది. అలాగే, ఆగస్ట్ నుంచి జూన్ వరకు పండుగ సీజన్‌లో, డిమాండ్ బాగా ఉంది. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇండియా కాగా.. 2020 సంవత్సరంలో, భారతీయ మార్కెట్ ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా మరియు ఆఫ్రికన్ మార్కెట్ల కంటే మెరుగ్గా పనితీరును కనబరిచింది. వచ్చే 5 సంవత్సరాల వరకు భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధిని కొనసాగించే అవకాశం ఉందని నివేదికలో అంచనా వేశారు నిపుణులు. భారతదేశం 1.39 బిలియన్ జనాభా ఫీచర్ ఫోన్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి మారనురన్నట్లు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, రాబోయే కొద్ది సంవత్సరాలలో, స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య 200 మిలియన్ మార్కును దాటవచ్చు.

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారీగా అమ్మకాలు:
కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం, కోవిడ్ -19 గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 4 శాతం స్వల్ప క్షీణత కనిపించింది. అయితే, కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో, స్మార్ట్‌ఫోన్ మార్కెట్ క్యూ 2లో పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అత్యధిక సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ రవాణా జరిగింది.

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరగడానికి కారణం చౌకైన రిలయన్స్ జియో రీఛార్జ్ మరియు జియోఫోన్ అని భావిస్తున్నారు. దీని అమ్మకం సెప్టెంబర్ 10 నుంచి భారతదేశంలో ప్రారంభం కానుంది. గూగుల్‌-జియోఫోన్‌ ధర 75 డాలర్ల (రూ.5,500)లోపునే ఉండొచ్చు. వచ్చే రెండేళ్లలో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ప్రధానంగా ఈ ధర చుట్టూనే తిరగవచ్చు. అలాగే, 5G స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరగడం వల్ల, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బలమైన వృద్ధిని నమోదు చేయవచ్చు. 5G స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ వాటా 2019 సంవత్సరంలో 3 శాతం కంటే తక్కువగా ఉంది,

2021లో 5జీ హ్యాండ్‌సెట్ల అమ్మకాలు 8 రెట్లు పెరిగి 3.2 కోట్ల యూనిట్లకు చేరుకున్నాయి. దాంతో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో 5జీ సెట్ల వాటా 19 శాతానికి పెరిగింది. ఉత్పత్తి కంపెనీల మధ్య పోటీకారణంగా 5జీ చిప్‌సెట్లు చౌకకావడంతో 5జీ హ్యాండ్‌సెట్ల ధరలు తగ్గుతున్నాయి. 5జీ సెట్‌ రూ.15,000లోపునే లభించనుండగా.. వచ్చే 12 నెలల్లో ఎంట్రీలెవల్‌ 5జీ స్మార్ట్‌ఫోన్ల ధర 40 శాతం తగ్గవచ్చునని మార్కెట్ నిపుణుల అంచనా.

స్మార్ట్ ఫోన్‌లకు వస్తున్న డిమాండ్‌ను బట్టి ఈ ఏడాది ద్వితీయార్థంలో 10కోట్ల స్మార్ట్‌ఫోన్లు భారత్‌కు దిగుమతి అవుతాయని అంచనా వేస్తున్నారు. వచ్చే రెండేళ్లలో ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 20కోట్లను మించుతాయి. ప్రస్తుతం ఇండియాలో 32 కోట్ల మంది ఫీచర్‌ఫోన్‌ యూజర్లు ఉండగా.. వీరిలో దాదాపుగా 10కోట్ల మంది వచ్చే ఏడాదిలోపు స్మార్ట్ ఫోన్‌లను తీసుకుంటారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.