Made In India : చిప్ మేకర్లకు భారత్ భారీ ఆఫర్.. స్వదేశీ చిప్‌లు చేసినవారికి రూ.7,300 కోట్ల రివార్డు

కార్లు, మైక్రోవేవ్ ఓవెన్ల నుంచి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో చిప్‌లన్నీ విదేశీ కంపెనీలవే ఉంటున్నాయి. ప్రతి గాడ్జెట్‌లో లోపలి మైక్రోప్రాసెసర్లు లేదా చిప్స్ ఎక్కువ శాతం చైనా సహా ఇతర దేశాల నుంచి ఇంపోర్టు చేసుకుంటున్నాం.

Made In India : చిప్ మేకర్లకు భారత్ భారీ ఆఫర్.. స్వదేశీ చిప్‌లు చేసినవారికి రూ.7,300 కోట్ల రివార్డు

Every Chip Maker Who 'makes In India’ (1)

Chip-Maker Made In India : కార్లు, మైక్రోవేవ్ ఓవెన్ల నుంచి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో చిప్‌లన్నీ దాదాపు విదేశీ కంపెనీలవే ఉంటున్నాయి. ప్రతి గాడ్జెట్‌లో లోపలి భాగంలో బయటకు కనిపించని మైక్రోప్రాసెసర్లు లేదా చిప్స్ ఎక్కువ శాతం చైనా సహా ఇతర దేశాల నుంచి ఇంపోర్టు చేసుకుంటున్నాం. టైపికల్ సిలికాన్ చిప్స్.. బేసిక్ బుల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మోడ్రాన్ కంప్యూటేషన్, ఖరీదైన కంపోనెంట్లతో పనిచేస్తాయి.

Chips

కానీ, సెమీ కండెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా కొరతను ఎదుర్కుంటున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ సమస్య తలెత్తింది. దాంతో చాలా కార్ల తయారీ కంపెనీల్లో ఫోర్డ్, నిస్సాన్, వోల్స్ వ్యాగన్, ఫియాట్ క్రిస్లెర్, టయోటా కంపెనీలు తమ కార్ల ఉత్పత్తులను తగ్గించాయి. చిప్స్ కొరత కారణంగా వాటి ధర అమాంతం పెరిగిపోవడంతో కంపెనీలు కొనేందుకు భయపడ్డాయి.

Chipst
అందుకే భారత ప్రభుత్వం.. చిప్ మేకర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల తయారీలో చిప్స్ (మేడ్ ఇన్ ఇండియా) స్వదేశీ యూనిట్లలోనే తయారు చేయాలని సూచించింది. ప్రతి సెమీ కండెక్టర్ కంపెనీకి 1 బిలియన్ డాలర్లు (7వేల 300 కోట్లు )కుపైగా క్యాష్ రివార్డు అందిస్తామని ఆఫర్ చేసింది.
Chipts
ప్రైవేటు కంపెనీలన్నీ తప్పనిసరిగా మేడ్ ఇన్ ఇండయా చిప్స్ తయారుచేయాలని, అలా రూపొందించిన కంపెనీలకు భారీ మొత్తంలో రివార్డు ఇవ్వనున్నట్టు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా నిలిచింది.

చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎలక్ట్రానిక్స్, టెలికం పరిశమ్రకు అవసరమైన మెటేరియల్స్ అందించాలని భారత్ యోచిస్తోంది. గత ఏడాదిలో బీజింగ్‌తో దౌత్యపరమైన ప్రతిష్టంభన తర్వాత నుంచే భారత్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇంటెల్ (US), శాంసంగ్ (సౌత్ కొరియా), TSMC (తైవాన్) అనే మూడు కంపెనీలు అతిపెద్ద చిప్ తయారీదారులు. ఇందులో రెండు డిజైన్, మ్యానిఫ్యాక్చర్, చిప్స్ సెల్లింగ్ ఎండ్ టూ ఎండ్ సర్వీసు అందిస్తున్నాయి.