Honda Activa: ఇండియాలోనే మొట్ట మొదటి పెట్రో ఎలక్ట్రిక్ హోండా యాక్టివా

ఇండియన్ మార్కెట్లో అత్యంత పాపులర్ అవడమే కాకుండా రెగ్యూలర్ సేల్స్ లో టాప్ లో ఉంది హోండా యాక్టివా. 20 సంవత్సరాల్లో దీని మ్యాన్యుఫ్యాక్చర్ 2.5కోట్ల...

Honda Activa: ఇండియాలోనే మొట్ట మొదటి పెట్రో ఎలక్ట్రిక్ హోండా యాక్టివా

Honda Activa Electric

Honda Activa: ఇండియన్ మార్కెట్లో అత్యంత పాపులర్ అవడమే కాకుండా రెగ్యూలర్ సేల్స్ లో టాప్ లో ఉంది హోండా యాక్టివా. 20 సంవత్సరాల్లో దీని మ్యాన్యుఫ్యాక్చర్ 2.5కోట్ల ప్రొడక్టులు అమ్మాడు. రోడ్లపై కామన్ గా కనిపించే స్కూటర్లలో యాక్టివ్ గా కచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇది 110, 125 సీసీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

అంతేకాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా ఇటీవలి కాలంలో పాపులారిటీ వస్తుంది. TVS, Ather, Bajaj, Okinawa లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్ లో అడుగుపెట్టేశాయి. ఇప్పుడు హోండా యాక్టివా కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేసిందంటున్నారు ఇంటర్నెట్‌లో. పెట్రోల్ యాక్టివా స్కూటర్ ను ఎలక్ట్రిక్ స్కూటర్ గా కన్వర్ట్ చేసిన హైబ్రిడ్ వెహికల్ ఇది.

ఈ వీడియోను ఈ-వీలర్ అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేశారు. దేశంలోనే ఇది తొలి పెట్రోల్-ఎలక్ట్రిక్ వెర్షన్ తో ఉన్న హైబ్రిడ్ స్కూటర్. అదే దీని స్పెషాలిటీ. బయట ఎటువంటి మార్పులు చేయకుండా తప్పనిసరివి మాత్రమే ఛేంజ్ చేశారు.

కేవలం 4సంవత్సరాల పాత స్కూటర్ పై ఈ ప్రయోగం చేశారు. దీని యజమానికి సొంత వర్క్ షాప్ ఉండటంతో తానే సొంతగా ఏర్పాటు చేసుకున్నాడట. దీనికి 60ఓల్టులు, 24 యాంపియర్ హవర్స్ లిథియం ఫెర్రస్ ఫాస్పేట్ బ్యాటరీని వాడాడు. సీట్ కొంద ఉండే స్టోరేజి ప్లేస్ లో కరెక్ట్ గా సెట్ అయింది. లూస్ కాంటాక్టులు, డ్యామేజి అవకుండా బాక్సులోనే ఉంచాడు. షార్ట్ సర్క్యూట్ కాకుండా కటాఫ్ స్విచ్ కూడా అరేంజ్ చేశాడు.

ఈ బ్యాటరీని బయటకు తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నాలుగు గంటల్లోనే ఫుల్ అయిపోతుందన్నమాట. స్కూటర్ పై చేసిన వర్క్ చాలా నీట్ గా ప్యానెల్ లోపలే అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది పెట్రోల్, ఎలక్ట్రిసిటీ దేనితోనైనా నడుస్తుంది. కేవలం కీ ఓపెన్ చేసి స్కూటర్ స్టార్ట్ చేసెయొచ్చు. పెట్రోల్ నుంచి ఎలక్ట్రిసిటీ మోడ్ కు మారడానికి స్విచ్ కూడా అరేంజ్ చేశారు.

ఈ ప్రాజెక్టుకు మొత్తం అయిన ఖర్చు కేవలం రూ.60వేలు. ఈ సెటప్ చేయడానికి 15రోజుల వరకూ సమయం పట్టిందని చెప్తున్నాడు.