Infinix Note 12i Launch : 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో ఇన్‌ఫినిక్స్ నోట్ 12i ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Infinix Note 12i Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ (Infinix) నోట్ 12i ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ సరికొత్త బడ్జెట్ కేటగిరీ ఫోన్ MediaTek Helio G85 ప్రాసెసర్‌తో వస్తుంది. సరైన గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం 10-లేయర్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

Infinix Note 12i Launch : 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో ఇన్‌ఫినిక్స్ నోట్ 12i ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Infinix Note 12i launches with 50MP camera and 5,000mAh battery_ Price inside

Infinix Note 12i Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ (Infinix) నోట్ 12i ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ సరికొత్త బడ్జెట్ కేటగిరీ ఫోన్ MediaTek Helio G85 ప్రాసెసర్‌తో వస్తుంది. సరైన గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం 10-లేయర్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ డివైజ్ గురించి ఫీచర్లు, స్పెషిఫికేషన్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ధర ఎంతంటే? :
Infinix Note 12i ఫోన్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 9,999గా ఉంటుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా జనవరి 30 నుంచి దేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. పరిచయ ఆఫర్‌లలో Jio యూజర్లకు రూ. 1,000 క్యాష్‌బ్యాక్ ఉంటుంది. ఈ ఫోన్ మెటావర్స్ బ్లూ, ఆల్పైన్ వైట్, ఫోర్స్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Infinix Note 12i launches with 50MP camera and 5,000mAh battery_ Price inside

Infinix Note 12i launches with 50MP camera and 5,000mAh battery

ఇన్‌ఫినిక్స్ Note 12i స్పెసిఫికేషన్స్ ఇవే :
Infinix Note 12i స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G85 ప్రాసెసర్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 12 ఆధారంగా XOS 12 కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. హ్యాండ్‌సెట్ 4GB RAMని అందిస్తుంది. 3GB వరకు వర్చువల్ RAM సపోర్టును కలిగి ఉంది. ఈ డివైజ్ మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 64GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యాన్ని అందిస్తుంది. Infinix Note 12i ఫోన్ 6.7-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఫోన్ డిస్‌ప్లే 1080p కంటెంట్‌ను చూసేందుకు Widevine L1 సర్టిఫికేట్ పొందింది.1,000 nits గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది.

కెమెరాల విషయానికి వస్తే.. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 8MP కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. కెమెరా సిస్టమ్ 50MP ప్రైమరీ సెన్సార్‌తో f/1.75 ఎపర్చరుతో పాటు డెప్త్ సెన్సార్, AI లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ డివైజ్ 5,000 mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. బ్లూటూత్ 5.0, Wi-Fi, 4G, డ్యూయల్-సిమ్, GPS, ఇన్ఫినిక్స్ నోట్ 12iలో కొన్ని కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Republic Day Sale : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లక్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. వెంటనే కొనేసుకోండి!