Infinix Note 30 Specifications : ఇన్ఫినిక్స్ నోట్ 30 ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. పూర్తి వివరాలు ఇవే!

Infinix Note 30 Specifications : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది. 2023 ఏడాది చివరిలో కొత్త ఇన్ఫినిక్స్ నోట్ 30 గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి.

Infinix Note 30 Specifications : ఇన్ఫినిక్స్ నోట్ 30 ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. పూర్తి వివరాలు ఇవే!

Infinix Note 30 Reportedly Spotted on Google Play Console (Photo Credit : Infinix Mobile)

Infinix Note 30 Specifications : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి సరికొత్త ఫోన్ వస్తోంది. గూగుల్ ప్లే (Google Play) కన్సోల్‌లో ఈ హ్యాండ్‌సెట్ కనిపించింది. అయితే, ఈ కొత్త (Infinix Note 30) ఫోన్ ఈ ఏడాది చివరిలో లాంచ్ కానుందని భావిస్తున్నారు. లాంచ్‌కు ముందే ఈ డివైజ్ కీలక స్పెసిఫికేషన్‌లను లీక్ అయ్యాయి. అక్టోబర్ 2022లో లాంచ్ అయిన Infinix Note 12 (2023)కి ఈ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా భావిస్తున్నారు. ఈ నోట్ 30 సిరీస్‌లో మల్టీ మోడల్‌లతో రానుంది.

ఇటీవల బడ్జెట్ (Infinix Hot 30i) స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేయగా.. 260W ఆల్-రౌండ్ ఫాస్ట్‌ఛార్జ్ ఛార్జింగ్ సిస్టమ్‌తో అందించింది. మార్కెట్లో వేగవంతమైన స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌లలో ఇదొకటిగా నిలిచింది. ప్రైస్‌బాబా నివేదిక ప్రకారం.. ఇన్ఫినిక్స్ నోట్ 30 మోడల్ నంబర్ X6833Bతో (Google Play) కన్సోల్ లిస్టింగ్‌లో కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేటెడ్ ARM Mali G57 GPUతో MediaTek Helio G99 SoC ద్వారా అందిస్తుంది. 8GB వరకు RAMతో వస్తుందని లిస్టింగ్ సూచిస్తోంది.

Read Also : Tecno Spark 10C : 5,000mAh బ్యాటరీతో టెక్నో Spark 10C ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

ఇన్ఫినిక్స్ (Infininix) స్మార్ట్‌ఫోన్ పైన XOS UIతో ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్ రన్ అవుతుందని భావిస్తున్నారు. 1080×2460 రిజల్యూషన్, 480 DPI స్క్రీన్ డెన్సిటీతో Full-HD డిస్‌ప్లేను ఫోన్ కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఇన్ఫినిక్స్ Note 12 (2023) కొత్తగా (Infinix Note 30)తో రానుందని భావిస్తున్నారు.

Infinix Note 30 Reportedly Spotted on Google Play Console, Key Specifications Tipped

Infinix Note 30 Specifications on Google Play Console (Photo Credit : Infinix Mobile)

Mali-G57 MP2 GPUతో పాటు ఆక్టా-కోర్ MediaTek Helio G99 SoC ద్వారా అందించనుంది. ఆండ్రాయిడ్ 12-ఆధారిత XOS 10.6ని అందిస్తుంది. ఈ ఫోన్ Full HD+ (1,080×2,400) రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. Infinix Note 12 (2023)లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది.

ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ ఉంటుందని నివేదిక సూచిస్తోంది. ఈ ఫోన్ డిస్‌ప్లే పైభాగంలో సెంటర్డ్ వాటర్‌డ్రాప్ నాచ్‌లో 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5,000mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C పోర్ట్‌తో వస్తుంది. బ్లూటూత్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీకి కూడా సపోర్టు అందిస్తుంది.

Read Also : Realme Narzo N55 Launch : ఏప్రిల్ 12న రియల్‌మి Narzo N55 ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?