Instagram కొత్త ఫీచర్.. నెగటీవ్ కామెంట్లు చేస్తే ఆటోమాటిక్‌గా హైడ్ చేసేస్తుంది

  • Published By: sreehari ,Published On : October 8, 2020 / 06:31 PM IST
Instagram కొత్త ఫీచర్.. నెగటీవ్ కామెంట్లు చేస్తే ఆటోమాటిక్‌గా హైడ్ చేసేస్తుంది

Instagram comment filter : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సొంత యాప్ ఇన్‌స్టాగ్రామ్ అతి త్వరలో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇకపై ఇన్‌స్టాలో నెగటివ్ కామెంట్లు చేస్తే ఆటోమాటిక్ గా హైడ్ చేసేస్తుంది. తమ ప్లాట్ ఫాంపై విద్వేషపూరిత కామెంట్లు లేకుండా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేందుకు ఇన్‌స్టా ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఒకరిపై మరొకరు నెగటీవ్ కామెంట్లు చేసుకోవడం ద్వారా అది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.



అందుకే ద్వేషపూరిత కామెంట్లను హైడ్ చేసేందుకు ఈ కొత్త కామెంట్ ఫిల్టర్ (comment filter) ఫీచర్ తీసుకోస్తోంది. ఫేస్ బుక్ రూపొందించిన DeepText అనే మిషన్ లెర్నింగ్ టూల్ ద్వారా కామెంట్లను హైడ్ చేస్తుంది. ప్రస్తుతం.. ఇన్ స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఇన్ స్టాలో పోస్టు చేసిన పోస్టులో ఎవరైనా నెగటివ్ కామెంట్లు పెడితే ఈ ఫీచర్ వెంటనే ఆటోమాటిక్ గా హైడ్ చేసేస్తుంది. కామెంట్ వార్నింగ్ ఫీచర్ కూడా ఇన్ స్టా అప్ డేట్ చేసింది.



ఉదాహరణకు.. ఎవరైనా ఇన్ స్టా యూజర్ ద్వేషపూరిత లేదా చెత్త కామెంట్లు పెడితే.. వెంటనే ఒక పాప్ అప్ మెసేజ్ వస్తుంది.. ఆ కామెంట్ పోస్టు చేయడానికి ముందే ‘This may go against our guidelines’ అంటూ మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. నెగటివ్ కామెంట్ పోస్టు చేయాలనుకుంటే యూజర్లకు ఈ మెసేజ్ నోటిఫై చేస్తుంది.



యూజర్ అకౌంట్లో నుంచి ఈ కామెంట్ డిలీట్ చేయాలా? లేదా అనేది ఇన్ స్టాగ్రామ్ రివ్యూ చేస్తుంది. అప్పటివరకూ ఆ కామెంట్ ను హైడ్ చేసేస్తుంది. యాప్ పాలసీలను ఉల్లంఘించినట్టుగా ఆయా నెగటివ్ కామెంట్లపై మార్క్ కనిపిస్తుంది.. పోస్టుపై కామెంట్లు కనిపించవు. ఒకవేళ యూజర్లు ఆ కామెంట్లు చూడాలనుకుంటే.. ‘View Hidden Comments’ పై క్లిక్ చేసి చూడొచ్చు.

అయితే ఈ కామెంట్ ఫీచర్.. డిఫాల్ట్ గా ఆన్ అయి ఉంటుంది. యూజర్లు కావాలంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. అయితే ఈ Restrict feature ద్వారా ఏ ల్వాంగేజీ లేదా కామెంట్లను హైడ్ చేస్తుందో ఇన్ స్టాగ్రామ్ క్లారిటీ ఇవ్వలేదు.



ఈ కొత్త ఫిల్టర్ కామెంట్లను హైడ్ చేస్తుంది. డిఫాల్ట్ ఆన్ ఉంటుంది.. యూజర్లు టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇన్ స్టా యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లండి.. కిందికి స్క్రోల్ డౌన్ చేసి Comment Controls దగ్గర Off బటన్ పై క్లిక్ చేయండి. ఇకపై నెగటివ్ కామెంట్లు చేస్తే.. ఈ కొత్త ఫీల్టర్ ఫీచర్ ఆటోమాటిక్ గా హైడ్ చేసేస్తుంది.