ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా యాండ్రాయిడ్ యూజర్ల అకౌంట్లు అంతే

ఇన్‌స్టాగ్రామ్ డౌన్..  ప్రపంచవ్యాప్తంగా యాండ్రాయిడ్ యూజర్ల అకౌంట్లు అంతే

INSTAGRAM: ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు షాక్ ఇచ్చింది INSTAGRAM. శుక్రవారం రాత్రి పలు సమస్యల కారణంగా ప్రముఖ సోషల్ మీడియా క్రాష్ అయిందని ట్విట్టర్‌లో #InstagramCrashing హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అయింది. కాసేపటి వరకూ పనిచేయకుండా పోయిన ఇన్ స్టా కాసేపటికి సెట్ అయింది.

ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిన కాసేపటికే ఇంటర్నెట్ లో యూజర్లు మేమ్స్, రియాక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ చేశారు. యూజర్లు పెరిగిపోవడంతోనే ఇలా జరిగినట్లుగా చెబుతున్నారు. సాల్వ్ అయిపోయిందని చెప్తున్నా.. ఇంకా చాలా మంది యూజర్లు తమ ఫోన్లలో INSTAGRAM యాప్ సరిగా పనిచేయడం లేదని కంప్లైంట్ చేస్తున్నారు.

ఇదే వారం మొదట్లో గూగుల్ సర్వీసులు జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్ ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయాయి. మిలియన్లలో యూజర్లు దీని కారణంగా ఇబ్బందులకు గురయ్యాయి. చాలా సేపు అంతరాయం తర్వాత అదే రోజున సర్వీసులు పునరుద్ధరించారు.