Instagram Web : ఇన్‌స్టాగ్రామ్ వెబ్‌ వెర్షన్ చూశారా?.. ఫొటోలు, వీడియోలు పోస్టు చేసుకోవచ్చు!

ఇన్‌స్టాగ్రామ్ నుంచి వెబ్‌వెర్షన్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్లలోనే కాదు.. డెస్క్‌టాప్ వెబ్ వెర్షన్‌లో కూడా ఫొటోలు, వీడియోలు పోస్టు చేసుకోవచ్చు.

Instagram Web : ఇన్‌స్టాగ్రామ్ వెబ్‌ వెర్షన్ చూశారా?.. ఫొటోలు, వీడియోలు పోస్టు చేసుకోవచ్చు!

Instagram Web Version

Instagram Web Version : ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) నుంచి వెబ్‌వెర్షన్ వచ్చేసింది. ఇకపై స్మార్ట్ ఫోన్లలోనే కాదు.. డెస్క్‌టాప్ వెబ్ వెర్షన్‌లో కూడా ఫొటోలు, వీడియోలు పోస్టు చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ మొదటగా Engadgetలో కనిపించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికి ఈ ఫీచర్ కనిపిస్తోంది. ఇన్ స్టా వెబ్ వెర్షన్ ద్వారా యూజర్లు తమ పీసీలో ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చు.
iPhone 13 Pro Hack : ఆపిల్‌కు చెమటలు పట్టించిన చైనా హ్యాకర్లు.. సెకన్‌లో ఐఫోన్‌ 13ప్రో హ్యాక్!

హైలీ ప్రాసెస్డ్‌ ఇమేజ్‌లను కూడా ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌‌స్టా‌లో ఫొటోలు పోస్టు చేయాలంటే ప్రతిసారీ ఫోన్ కు పంపించాల్సిన పనిలేదు. సులభంగా డెస్క్ టాప్ నుంచే ఫొటోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదివరకు కంప్యూటర్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌కు పంపించాకే ఫొటోలు అప్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఫీడ్‌ ఎక్స్‌ప్లోర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌లను, మిగతా డేటాను యాక్సెస్‌ చేసుకునే అవకాశం ఉంది. ఫోన్‌ ఆధారిత యాప్‌గా ఇన్‌స్టాగ్రామ్‌.. కంప్యూటర్‌ యూజర్లకు ఈజీగా మారనుంది. ఇన్ స్టా వెబ్ వెర్షన్ ద్వారా యూజర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్ చెబుతోంది.
Apple Watch Series 7 : ఆపిల్‌ వాచ్‌ సేల్స్‌.. భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఫీచర్లు కిరాక్!