Instagram AMBER : ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. తప్పిపోయిన పిల్లల ఆచూకీ కనిపెడుతుంది..!

Instagram AMBER : ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. AMBER Alert ఫీచర్..

Instagram AMBER : ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. తప్పిపోయిన పిల్లల ఆచూకీ కనిపెడుతుంది..!

Instagram Starts Rolling Out Amber Alerts To Help Locate Missing Children (1)

Instagram AMBER : ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. AMBER Alert ఫీచర్.. ఈ కొత్త ఫీచర్ ద్వారా తప్పిపోయిన పిల్లలను కనిపెట్టవచ్చు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించేందుకు వినియోగదారుల కోసం Instagram ఈ టూల్ రూపొందించింది. తప్పిపోయిన వ్యక్తులను గుర్తించేందుకు AMBER అలర్ట్స్ ఫీచర్ రిలీజ్ చేస్తున్నామని ఫోటో-షేరింగ్ యాప్ బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది. అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ & ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (NCMEC), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ & ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్, UKలోని నేషనల్ క్రైమ్ ఏజెన్సీ, మెక్సికోలోని అటార్నీ జనరల్ ఆఫీస్, ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ వంటి సంస్థల భాగస్వామ్యంతో Instagram ఈ కొత్త ఫీచర్‌ను డెవలప్ చేసింది.

అయితే చట్టాన్ని అమలు చేసే అధికారులు మాత్రమే ఈ AMBER అలర్ట్స్ ఆన్ చేయగలరని ఇన్‌స్టాగ్రామ్ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. మీరు నిర్దేశిత ప్రాంతంలో ఉన్నట్లయితే.. మీ ఫీడ్‌లో పిల్లల తప్పిపోయిన అలర్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని గంటల ముందు తప్పిపోయిన పిల్లలను కనుగొనేందుకు ఈ ఫీచర్ సాయపడుతుంది. AMBER అలర్ట్స్ సింకరైజ్ అయి ఉంటుంది. మీకు నిర్దేశించిన సెర్చ్ లొకేషన్‌లో ఉన్నట్లయితే.. అలర్ట్ వస్తుంది. వెంటనే మీ Instagram ఫీడ్‌లో అలర్ట్ కనిపిస్తుందని ఇన్‌స్టాగ్రామ్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Instagram Starts Rolling Out Amber Alerts To Help Locate Missing Children

Instagram Starts Rolling Out Amber Alerts To Help Locate Missing Children

తప్పిపోయిన పిల్లల గురించి AMBER అలర్ట్స్ ద్వారా వారి ఫొటోలు, వివరాలు, తప్పిపోయిన ప్రదేశం వంటి వివరాలను అదే ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వారిని అలర్ట్ చేస్తుంది. తప్పిపోయిన పిల్లలను వెతికేందుకు అలర్ట్స్ డేటాను స్నేహితులతో కూడా షేర్ చేసుకోవచ్చు. AMBER అలర్ట్స్ ఒక ప్రాంతానికి నిర్దిష్టంగా ఉంటాయి. అందుకే మీ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో మీకు అలర్ట్ వస్తే.. ఆ సమీపంలోనే తప్పిపోయిన పిల్లలకు సంబంధించి యాక్టివ్ సెర్చ్ ఆన్‌ అవుతుంది. మీకు AMBER అలర్ట్స్ మీ ప్రొఫైల్‌లో కనిపిస్తుంది. మీరు లిస్టు చేసిన సిటీ, మీ IP అడ్రస్, లోకేషన్ సర్వీసులు (మీరు ఆన్ చేసి ఉంటే) సహా అనేక రకాల సిగ్నల్‌లను Instagram ద్వారా కనుగొనవచ్చు.

AMBER అలర్ట్‌లు ఈరోజు నుంచే అందుబాటులోకి వస్తాయని Instagram వెల్లడించింది. ముందుగా ఈ అలర్ట్స్ సర్వీసును అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, ఈక్వెడార్, గ్రీస్, గ్వాటెమాల, ఐర్లాండ్, జమైకా, కొరియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మలేషియా, మాల్టా, మెక్సికో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, రొమేనియా, దక్షిణాఫ్రికా, తైవాన్, ఉక్రెయిన్, యూకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అమెరికా వంటి 25 దేశాల్లో రాబోయే రెండు వారాల్లో పూర్తిగా అందుబాటులోకి రానుంది. త్వరలో మరిన్ని దేశాల్లో విస్తరించేందుకు కృషి చేస్తున్నామని ఇన్ స్టాగ్రామ్ తెలిపింది.

Read Also :  Instagram Blue Tick : ఇన్‌స్టాలో ‘బ్లూ టిక్’ ఇలా తెచ్చుకోవచ్చు..? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!