International Space Station : రష్యా మాడ్యూల్ మిస్‌‌ఫైర్.. నియంత్రణ కోల్పోయిన అంతరిక్ష కేంద్రం

అంతర్జాతీయ స్పెస్ సెంటర్ కోసం రష్యా ల్యాబరేటరీ మాడ్యూల్‌ను విజయవంతంగా ప్రారంభించింది. అంతరిక్ష కేంద్రంలో శాస్త్రీయ ప్రయోగాలకు కోసం అందించారు. కజకిస్తాన్‌‌లోని బైకోనూర్‌లోని రష్యన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నౌకా మాడ్యూల్ ప్రోటాన్-ఎమ్ బూస్టర్ రాకెట్ పైకిఎగిసింది.

International Space Station : రష్యా మాడ్యూల్ మిస్‌‌ఫైర్.. నియంత్రణ కోల్పోయిన అంతరిక్ష కేంద్రం

International Space Station Thrown Out Of Control By Misfire Of Russian Module

International Space Station : అంతర్జాతీయ స్పెస్ సెంటర్ కోసం రష్యా ల్యాబరేటరీ మాడ్యూల్‌ను విజయవంతంగా ప్రారంభించింది. అంతరిక్ష కేంద్రంలో శాస్త్రీయ ప్రయోగాలకు కోసం అందించారు. కజకిస్తాన్‌‌లోని బైకోనూర్‌లోని రష్యన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నౌకా మాడ్యూల్ ప్రోటాన్-ఎమ్ బూస్టర్ రాకెట్ పైకిఎగిసింది. అయితే రష్యా మాడ్యూల్ నౌక మిస్ ఫైర్ కావడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నియంత్రణ కోల్పోయింది. దాంతో నాసా బోయింగ్ CST-100 స్టార్‌లైనర్ క్యాప్సూల్‌ ప్రయోగాన్ని వాయిదా వేసింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బోయింగ్ లాక్‌హీడ్ మార్టిన్ కార్ప్ అట్లాస్ V రాకెట్‌పై పేలుడు జరగడానికి ఒక రోజు ముందు స్టార్‌లైనర్ లాంచ్ ఆలస్యమైంది.

ప్రయోగ తేదీని ఆగస్టు 3కి వాయిదా వేయాలని నిర్ణయించినట్టు నాసా పేర్కొంది. ఆగస్టు 4న వెంటనే బ్యాకప్‌ తీసేలా సెట్ చేసినట్టు నాసా వెల్లడించింది. ISS కాన్ఫిగరేషన్‌కు మరొక వెహికల్ జోడించే ముందు స్పేస్ స్టేషన్‌లోని పరిస్థితిని పూర్తిగా అంచనా వేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. అట్లాస్ V రాకెట్ స్టార్‌లైనర్ క్యాప్సూల్ ప్రస్తుతానికి లాంచ్ ప్యాడ్‌లో ఉంచినట్టు నాసా తెలిపింది. అంతరిక్ష కేంద్రంతో డాక్ చేయడంలో అంతరిక్ష నౌక దాదాపుగా విఫలమైంది. రష్యా ప్రయోగశాల మాడ్యూల్ నౌకతో ఇబ్బందులు తలెత్తడంతో డూ ఓవర్ టెస్ట్ ఫ్లైట్‌కు కౌంట్‌డౌన్ నిలిపివేసినట్టు నాసా పేర్కొంది.

నౌకా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన కొన్ని గంటల తరువాత జెట్ థ్రస్టర్‌లు అకస్మాత్తుగా పేలిపోయాయి. దాంతో మొత్తం స్టేషన్ కక్ష్యలో నుంచి నియంత్రణ కోల్పోయిందని నాసా అంతరిక్ష కేంద్రం ప్రోగ్రామ్ మేనేజర్ జోయెల్ మోంటల్బనో తెలిపారు. నియంత్రణ కోల్పోయిన అంతరిక్ష కేంద్రాన్ని పునరుద్ధరించేందుకు ఏడుగురు సిబ్బందితో 45నిమిషాల పాటు మిషన్ కొనసాగింది. స్టేషన్ సెకనుకు అర డిగ్రీ చొప్పున అలైన్‌మెంట్ బయటకు వచ్చేసింది. ఈ క్రమంలో సిబ్బందితో కమ్యూనికేషన్ ఇద్దరు రష్యన్ వ్యోమగాములు, ముగ్గురు నాసా వ్యోమగాములు, ఒక జపనీస్ వ్యోమగామి, ఒక ఫ్రెంచ్ వ్యోమగామి మధ్య రెండుసార్లు కమ్యూనికేషన్ కోల్పోయారు. అయితే సిబ్బందికి ఎలాంటి ప్రమాదం లేదని మోంటల్బానో చెప్పారు. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ పంపిణీ చేసిన నౌకా మాడ్యూల్ థ్రస్టర్‌లు పనిచేయకపోవడానికి కారణమేమిటో ఇంకా తెలియలేదని నాసా అధికారులు వెల్లడించారు.