ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్.. సెకనుకు 178TB.. 4K మూవీలు క్షణాల్లో డౌన్‌లోడ్

  • Published By: sreehari ,Published On : August 22, 2020 / 06:33 PM IST
ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్.. సెకనుకు 178TB.. 4K మూవీలు క్షణాల్లో డౌన్‌లోడ్

స్మార్ట్ ఫోన్ల రాకతో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది.. టెలికంలు సైతం మొబైల్ డేటా సరసమైన ధరకే అందిస్తుండటంతో డేటా వినియోగానికి డిమాండ్ పెరిగిపోయింది.. ఓటీటీ ప్లాట్ ఫాంల నుంచి అన్ని వీడియో కంటెంట్ వరకు అత్యంత వేగంగా HD కంటెంట్ యాక్సస్ చేసుకోగల ఇంటర్నెట్ డేటా నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చింది..



సాధారణంగా ఏదైనా క్వాలిటీ వీడియో కంటెంట్ డౌన్‌లోడ్ చేయాలంటే హైస్పీడ్ ఇంటర్నెట్ అవసరం.. మొబైల్ డేటా ద్వారా ఇప్పుడు క్షణాల్లో అవసరమైన కంటెంట్ డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ కంటే రెట్టింపు వేగంతో కూడిన ఇంటర్నెట్ పై పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు.

Internet speed record shattered at 178 terabits per second

యూనివర్శిటీ కాలేజీకి చెందిన లండన్ పరిశోధకులు హై స్పీడ్ ఇంటర్నెట్ వేగాన్ని పరీక్షించారు.. టెరాబైట్ల స్పీడ్‌తో పనిచేసే ఇంటర్నెట్ ను పరీక్షించారు.. దీని వేగం సెకనుకు 178 (TB) టెరాబైట్లు.. ఒక సెకనుకు 1,78,000 GBల స్పీడ్ ఉంటుంది.. ప్రపంచంలో హైస్పీడ్ ఇంటర్నెట్ ఇదొక్కటేనని పరిశోధకులు వెల్లడించారు. ఈ స్పీడ్ తో ఏదైనా వీడియో కంటెంట్ ను రెప్పపాటులో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.



మొన్నటివరకూ ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది.. 44.2 TBps స్పీడ్ తో రికార్డు సృష్టించింది.. ఇప్పుడు రాయల్ అకాడమీ డాక్టర్ లిడియా గాల్డినో నేతృత్వంలోని పరిశోధకులు ఆస్ట్రేలియా రికార్డును బ్రేక్ చేశారు. దీనికి నాలుగు రెట్ల వేగవంతమైన ఇంటర్నెట్ పరీక్షించి చూపారు.

Internet speed record shattered at 178 terabits per second
ఈ స్థాయి ఇంటర్నెట్ వేగాన్ని అందుకోవడానికి పరిశోధకులు సాధారణ ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌కు బదులు.. హైరేంజ్ కలిగిన నెట్ వేవ్స్ వినియోగించారు. సిగ్నల్ మరింత విస్తరించేందుకు వీలుగా కొత్త యాంప్లిఫైయింగ్ టెక్నాలజీని 16.8THz బ్యాండ్ విండ్త్ వినియోగించారు.



అదే భారతదేశంలో ఇంటర్నెట్ సగటున 2Mbps స్పీడ్ అందుబాటులో ఉంది. మన ఇంటర్నెట్ స్పీడ్‌తో పోల్చుకుంటే హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా కొన్ని వేల రెట్లు అధికంగా ఉంటుంది. ఈ స్పీడ్‌తో సుమారు 1500 4K మూవీలను ఒక సెకనులో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఈ ఇంటర్నెట్ వేగాన్ని అందుకోవాలంటే పెద్దగా ఏం ఖర్చు కాదని అంటున్నారు.. ఆప్టికల్ కేబుళ్లకు బదులుగా యాంప్లిఫయ్యర్లను అప్ గ్రేడ్ చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు..