iOS 16 Tips And Tricks : 5 కూల్ కెమెరా, ఫొటో ఎడిటింగ్ ఫీచర్లు.. ఐఫోన్ యూజర్లు ఈ టాప్ ఫీచర్లను తప్పక ప్రయత్నించండి!

iOS 16 Tips And Tricks : మీరు మీ ఐఫోన్‌లో iOS 16ని ఇన్‌స్టాల్ చేశారా? మీరు మీ ఐఫోన్ కావాల్సిన విధంగా రీడిజైన్ చేసుకోవచ్చు. లాక్‌స్క్రీన్ (Lock Screen), ఎడిట్ అన్‌సెండ్ ఫీచర్‌ని మెసేజ్‌లో కొత్త ఫోకస్ మోడ్‌లను కూడా వినియోగించవచ్చు.

iOS 16 Tips And Tricks : 5 కూల్ కెమెరా, ఫొటో ఎడిటింగ్ ఫీచర్లు.. ఐఫోన్ యూజర్లు ఈ టాప్ ఫీచర్లను తప్పక ప్రయత్నించండి!

iOS 16 Tips And Tricks _ 5 cool camera and photo editing features iPhone users must try

iOS 16 Tips And Tricks : మీరు మీ ఐఫోన్‌లో iOS 16ని ఇన్‌స్టాల్ చేశారా? మీరు మీ ఐఫోన్ కావాల్సిన విధంగా రీడిజైన్ చేసుకోవచ్చు. లాక్‌స్క్రీన్ (Lock Screen), ఎడిట్ అన్‌సెండ్ ఫీచర్‌ని మెసేజ్‌లో కొత్త ఫోకస్ మోడ్‌లను కూడా వినియోగించవచ్చు. లేటెస్ట్ iOS అప్‌డేట్‌తో పాటు అందించే కొన్ని అద్భుతమైన కెమెరాలను ఫోటో ఎడిటింగ్ ఫీచర్‌లను మీరు కోల్పోయి ఉండవచ్చు. అందుకే iOS 16ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత కెమెరా, ఫోటోల యాప్‌లో 5 అద్భుతమైన కెమెరా ఫోటో ఎడిషన్ ఫీచర్‌ ఉన్నట్టు గుర్తించాం.. ఈ ఫీచర్లను iPhone వినియోగదారులు అందరూ తప్పక ప్రయత్నించాలి.

Remove Background From Photos :
సాధారణంగా ఫొటోల బ్యాగ్ గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటే.. ఫోటోషాప్ (Photoshop) లేదా ఇతర ఆన్‌లైన్ టూల్స్ ఉపయోగిస్తాను. ఇప్పుడు, iOS 16కి వినియోగించవచ్చు. మీరు నేరుగా iPhoneలోనే మీకు కావాల్సిన విధంగా ఫొటోలను ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోటోలకు బ్యాక్‌గ్రౌండ్ తొలగించవచ్చు. అందుకోసం మీరు ఏదైనా ఫొటోను ఓపెన్ చేయండి. ఆ తర్వాత, సబ్జెక్ట్‌పై ఎక్కువసేపు Press చేసి పట్టుకోండి. అప్పుడు మీ ఫొటో బ్యాక్ గ్రౌండ్ ఆటోమాటిక్‌గా రిమూవ్ అయిపోతుంది. మీరు ఇప్పుడు ఫొటో కటౌట్‌ను నోట్స్, Instagram DM లేదా మీకు నచ్చిన చోట స్టిక్ చేసుకోవచ్చు.

iOS 16 Tips And Tricks _ 5 cool camera and photo editing features iPhone users must try

iOS 16 Tips And Tricks _ 5 cool camera and photo editing features iPhone users must try

Copy-paste edits :
iOS 16 అప్‌డేట్ చేసుకున్నారా? మీ ఐఫోన్‌లో ఫోటోలను ఎడిట్ చేయాలనుకుంటే.. మీరు కేవలం ఒక ఫొటోను ఎడిట్ చేయవచ్చు. ఎడిటింగ్ కాపీ చేసి.. వాటిని మరొక ఫొటోలో స్టిక్ చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా.. ఏదైనా ఫొటోను ఓపెన్ చేసి.. మీకు కావలసిన విధంగా ఎడిట్ చేయండి. మీరు మీ ఎడిటింగ్ పూర్తి చేసిన తర్వాత ఎగువన ఉన్న త్రి డాట్స్‌కు వెళ్లి ‘Copy Paste Edits’ ఆప్షన్ ఎంచుకోండి.

మరొక ఫొటోను ఓపెన్ చేసి.. మూడు డాట్స్ మెను నుంచి ‘paste edits’ ఆప్షన్ ఎంచుకోండి. అన్ని ఎడిటింగ్ ఫొటోలను స్టిక్ చేసుకోవచ్చు. మీరు ప్రతి ఫొటోను ఒక్కొక్కటిగా ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మల్టీ ఫొటోలను ఒకే ఎడిట్ చేయాలనుకుంటే మీ సమయాన్ని చాలా వరకు ఆదా చేస్తుంది.

Draw shapes on your photos :
మీరు ఇప్పుడు మీ ఫోటోలపై చేతితో షేపులను డ్రా చేయవచ్చు. iPhone మరింత మెరుగ్గా కనిపించేలా చేసేందుకు ఖచ్చితమైన షేపులుగా మారుస్తుంది. మీరు కేవలం ఫోటోలకు వెళ్లి.. మీరు ఏదైనా ఫొటోను ఎడిటింగ్ ద్వారా ఓపెన్ చేయవచ్చు. ఆపై ఎగువన ఉన్న ‘Edit’పై Tap చేయండి. రైట్ కార్నర్‌లో నుంచి Pencil ఐకాన్ ఎంచుకోండి. ఫొటోపై ఏదైనా షేప్ (వృత్తం, త్రిభుజం, ఓవల్, హార్ట్ మొదలైనవి) చేతితో గీయండి. కానీ, పెన్ను త్వరగా వదిలేయొద్దు. ఏదైనా షేప్‌ను చేతితో గీయండి. ఆ తర్వాత దానిని పట్టుకోండి. చేతితో గీసిన షేప్ సర్కిల్‌గా రూపొందించిన షేప్‌లోకి మార్చుకోవచ్చు.

iOS 16 Tips And Tricks _ 5 cool camera and photo editing features iPhone users must try

iOS 16 Tips And Tricks _ 5 cool camera and photo editing features iPhone users must try

Hide photos :
ఐఫోన్లలో హైడ్ అయిన ఇంటెస్ట్రింగ్ ఫీచర్ iOS 16 అప్‌డేట్‌లో యాడ్ అయింది. ఈ ఫీచర్ పర్సనల్ ఫొటోలు, వీడియోలను ఇతరులకు కనిపించకుండా హైడ్ చేయవచ్చు. కేవలం ఫోటో సెక్షన్‌కు వెళ్లి మీరు హైడ్ చేయాలనుకునే ఏదైనా ఫొటో/వీడియోని ఓపెన్ చేయండి. ఆపై ఎగువన ఉన్న త్రి డాట్స్‌పై Tap చేయండి. ‘Hide’ > Hide Photo ఆప్షన్ ఎంచుకోండి.

మీ ఫోటో కొత్తగా హైడ్ చేసిన ఫోల్డర్‌కి మారుతుంది. యాక్సెస్ చేసుకునేందుకు మీరు ఆల్బమ్‌లకు వెళ్లవచ్చు. ఈ కింద హిడెన్ ఫోల్డర్‌కి స్క్రోల్ చేయాలి. మీరు ఇప్పుడు మీ iPhone పాస్‌కోడ్‌ని నమోదు చేయాలి. లేదా టచ్ ID/Face IDని ఉపయోగించాలి. మీరు హైడ్ చేసిన అన్ని ఫోటోలు లేదా వీడియోలను చూడవచ్చు.

Translate Camera :
చివరగా, కెమెరా యాప్‌లో కొత్త ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ఉంది. ఏదైనా ఫొటో టెక్స్ట్ మరొక భాషలోకి ట్రాన్స్‌లేషన్ చేసుకోవచ్చు. మీరు ట్రాన్స్‌లేషన్ చేయాలనుకునే టెక్స్ట్ ఫొటోను తొలగించడానికి కెమెరా యాప్‌ని ఓపెన్ చేయండి. ఆపై View Finder కింది భాగంలో-రైట్ కార్నర్‌లో ఉన్న టెక్స్ట్ ఆప్షన్ బటన్‌ను Tap చేయండి. తద్వారా అది ఎల్లో కలర్‌లోకి మారుతుంది. ఇన్‌స్టంట్ ట్రాన్సాలేషన్ పొందడానికి ట్రాన్సాలేషన్ ఆప్షన్ Tap చేయండి. మీరు ఈ కొత్త కెమెరా, ఫోటో ఎడిటింగ్ ఫీచర్‌లన్నింటినీ తప్పనిసరిగా ట్రై చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Moto G72 Launch : 108 ట్రిపుల్ కెమెరాలతో మోటో G72 వచ్చేసింది.. తక్కువ ధరకే ఈ ప్రీమియం ఫోన్ సొంతం చేసుకోవచ్చు!