Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్‌లో సేల్.. ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!

కొత్త ఐఫోన్‌ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌ (Flipkart Electronics Sale)ను జూలై 6 నుంచి జూలై 10 వరకు నిర్వహిస్తోంది.

Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్‌లో సేల్.. ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!

Iphone 11 And Iphone 12 Available With Massive Discount During Flipkart Electronics Sale (1)

Flipkart Electronics Sale : కొత్త ఐఫోన్‌ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌ (Flipkart Electronics Sale)ను జూలై 6 నుంచి జూలై 10 వరకు నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్.. కొన్ని ఐఫోన్ మోడల్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. iPhone 11, iPhone 12లో ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు iPhone 13ని కొనుగోలు చేయాలంటే మాత్రం.. మరో ఈ కామర్స్ దిగ్గజం Amazon, Imagine, Croma వంటి మల్టీ ప్లాట్‌ఫారమ్‌లు iPhone 13ని డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా CITI బ్యాంక్‌తో భాగస్వామ్యమై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. CITI బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. మరిన్ని ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు.

Flipkartలో iPhone 11పై భారీ తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 11 ధర రూ. 42,999 ధరకు అందిస్తోంది. 64GB స్టోరేజ్ మోడల్ 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.47,999. అదనంగా CITI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. రూ. 2000 డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ ధరతో iPhone 11 రూ. 40వేలకు తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ దాదాపు రూ. 10వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. అప్పుడు ఐఫోన్ ధరను రూ. 30,000కి తగ్గించవచ్చు. మంచి కండీషన్‌లో ఉన్న iPhone XRపై సుమారు ధర రూ. 10,000 ఎక్స్ఛేంజ్ వాల్యూను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఇది పూర్తిగా మీ పాత ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Iphone 11 And Iphone 12 Available With Massive Discount During Flipkart Electronics Sale

Iphone 11 And Iphone 12 Available With Massive Discount During Flipkart Electronics Sale

Flipkartలో iPhone 12 తగ్గింపు :
ఐఫోన్ 12 కూడా ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో రానుంది. ఐఫోన్ మోడల్ 64GB స్టోరేజ్ ధర రూ.54,999కు అందుబాటులో ఉంది. 128GB, 256GB స్టోరేజ్ మోడల్‌లు వరుసగా రూ.59,999, రూ.69,999 ధరలకు అందుబాటులో ఉన్నాయి. అదనంగా, CITI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ యూజర్లకు రూ. 2000 డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా iPhone 12 ధర రూ. 52,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ దాదాపు రూ. 10,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీని ధర రూ. 42,000కి తగ్గుతుంది. మీ పాత iPhone XR మంచి కండీషన్ లో‌ఉంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు రూ. 10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ ఆఫర్ అందిస్తోంది. ఇది పూర్తిగా మీ పాత ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.

మీ పాత ఫోన్ ద్వారా iPhone 12ని పొందడం iPhone 11 కన్నా ఎక్కువే. అయితే, మీరు ఇంకా కొన్నిరోజులు వేచి ఉండగలిగితే.. ఈ ఏడాది చివరిలో ఐఫోన్ 14 లాంచ్ కావొచ్చు. ఐఫోన్ 14 లాంచ్ తర్వాత, పాత మోడళ్ల ధర గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రతి ఏడాదిలో ఇదే జరుగుతోంది. ఐఫోన్ మోడల్‌లతో పాటు, పోకో, మోటో, వివో, మరిన్ని ఇతర బ్రాండ్‌ల ప్రొడక్టులపై కూడా ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. అమెజాన్ కూడా ఈ (జూలై) నెలలో ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Read Also : Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్.. అన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!