Flipkart Big Saving Days: ఫ్లిప్ కార్ట్ లో బంపర్ ఆఫర్లు.. iPhone 11 ధరకే iPhone 12

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మరో సేల్‌ను కస్టమర్ల ముందుకు తీసుకు వచ్చింది. ఈ సేల్ జూలై 25 నుంచి జూలై 29 వరకు నడుస్తుంది. ఈ సేల్‌లో టాప్ బ్రాండ్ స్మార్ట్ ‌ఫోన్లపై స్పెషల్ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.

Flipkart Big Saving Days: ఫ్లిప్ కార్ట్ లో బంపర్ ఆఫర్లు.. iPhone 11 ధరకే iPhone 12

Iphone

Flipkart Big Saving Days: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మరో సేల్‌ను కస్టమర్ల ముందుకు తీసుకు వచ్చింది. ఈ సేల్ జూలై 25 నుంచి జూలై 29 వరకు నడుస్తుంది. ఈ సేల్‌లో టాప్ బ్రాండ్ స్మార్ట్ ‌ఫోన్లపై స్పెషల్ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యుల కొరకు ఈ సేల్ ఒక రోజు ముందుగా ప్రారంభం అయ్యింది. ఐసీఐసీఐ ఖాతాదారులు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

మాములుగా రూ.23వేల 999 ధర గల పోకో ఎక్స్ 3 ప్లస్ ఇప్పుడు సేల్ సమయంలో రూ.17,249కు లభ్యం అవుతుంది. పోకో ఎక్స్ 3 ప్లస్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి + డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రియర్ క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. రూ.23,999 ధరకు లభిస్తున్న షియోమీ ఎంఐ 11 లైట్ రూ.20,499కు లభ్యం అవుతోంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో లభిస్తుంది. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. వీటితో పాటు శామ్ సంగ్, ఒప్పో, వివో, ఆపిల్ బ్రాండ్స్‌ మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్ ఇస్టున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

iPhone 12: ఫ్లిప్​కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ లో ఫ్లాగ్​షిప్ ఫోన్లపై ఉన్న కొన్ని ఆఫర్లను చూస్తే.. ఇప్పుడు తప్పితే మరోసారి కొనలేం అన్నట్లుగా అనిపిస్తుంది. యాపిల్​ ఐఫోన్ కొనాలని కలలు కనేవారికి ఫ్లిప్​కార్ట్ బంపర్ ఆఫర్ ఇస్తుంది. ముఖ్యంగా ఐఫోన్​ 12 సిరీస్​, 12 మినీ, ఎక్స్​ఆర్​ మోడళ్లను మంచి డిస్కౌంట్లలో అందిస్తుంది. ఐఫోన్​ 12 64 జీబీ మోడల్​ను రూ.67,999కే ఇస్తుంది. దీంతో పాటు పాత ఫోన్​ను ఎక్చ్సేంజ్ చేస్తే రూ.19,250 వరకు లాభం పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులను వినియోగిస్తే 10 శాతం గరిష్ఠంగా రూ.1500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

iPhone 11: ఆపిల్ ఐఫోన్ 11(64GB) ఫోన్ ను ఈ సేల్ లో రూ. 7 వేల డిస్కౌంట్ తో రూ. 47,999కు కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 54,900. ఈ ఫోన్ ఐదు కలర్లలో అందుబాటులో ఉంది. 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD LCD డిస్ప్లేను కలిగి ఉంది. దీంతో పాటు 12-మోగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఎక్సేంజ్ పై రూ. 14,600 వరకు డిస్కౌంట్ ఉంటుంది.

iPhone 12 mini: ఐఫోన్ 12 సిరీస్​లో స్మాలెస్ట్ ఐఫోన్ 12 మినీ మోడల్​పై కూడా ఫ్లిప్​కార్ట్ ఆఫర్ ప్రకటించింది. దీని ఒరిజినల్ ధర రూ.69వేలు కాగా ప్రత్యేకంగా బిగ్​ సేవింగ్ డేస్​లో రూ.57,999 లకే సేల్​కు పెట్టింది. ఈ ఫోన్​ కూడా ఏ14 బయోనిక్ చిప్​తో కూడిన నెక్ట్స్​జెన్ న్యూరల్ ఇంజిన్ ప్రాసెసర్​తో వస్తోంది.

ఇక మోటోరోలాకు చెందిన ఫోల్డ‌బుల్ ఫోన్ మోటో రేజ‌ర్ ధ‌ర రూ.95వేలు ఉండ‌గా ధ‌ర‌ను త‌గ్గించి రూ.54,999 కు విక్ర‌యిస్తున్నారు.

భారీ తగ్గింపుతో ల‌భిస్తున్న‌ స్మార్ట్‌ఫోన్‌ల వివ‌రాలు:

యాపిల్ ఐఫోన్ 12 మినీ (64 జీబీ): రూ. 57,999
యాపిల్ ఐఫోన్ SE 2020(64 జీబీ): రూ. 28,999
యాపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ (64 జీబీ): రూ. 37,999
శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62(128 జీబీ): రూ. 17,999
ఆర్‌వోజీ ఫోన్ 3(128 జీబీ): రూ. 39,999