Apple iPhone 12 mini : అరచేతి సైజులో కొత్త ఐఫోన్.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్..

కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? చౌకైన ధరకే ఆపిల్ కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. iPhone 12 mini.. అరచేతిలో సరిపోయేంత ఉన్న ఈ కొత్త ఐఫోన్‌పై ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Apple iPhone 12 mini : అరచేతి సైజులో కొత్త ఐఫోన్.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్..

Iphone 12 Mini On Sale With Discount Of Rs 8000 Is It Worth Getting It

iPhone 12 mini on sale with discount : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? చౌకైన ధరకే ఆపిల్ కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. iPhone 12 mini.. అరచేతిలో సరిపోయేంత ఉన్న ఈ కొత్త ఐఫోన్‌పై ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ప్రస్తుత ఐఫోన్ 12 లైనప్‌లో ఈ మోడలే చీపెస్ట్ ఐఫోన్.. అమెజాన్ డీల్‌లో ఐఫోన్ 12 మినీ ఒరిజినల్ ధరపై రూ.8వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే మీ పాత ఐఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.11 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

అమెజాన్‌లో ఐఫోన్ 12 మినీ మోడల్.. అసలు ధర రూ.69,900 ఉండగా.. డిస్కౌంట్ తర్వాత రూ.61,900 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఇది 64GB బేస్ మోడల్.. మీ ప్యాకెట్ లో సరిగ్గా పోయే సైజులో ఉంటుంది. ఇందులో స్ర్కీన్ సైజు అట్రాక్టివ్ గా ఉంటుంది. 5.4 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. అరచేతిలో పట్టుకునేందుకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

OTT వంటి స్ట్రీమింగ్ కంటెంట్ చూసేందుకు అంతగా బాగొదు.. ఎందుకంటే చాలా చిన్నదిగా ఉంటుంది. బ్యాటరీ కూడా చాలా చిన్నదిగా వస్తోంది. బ్యాటరీ ఎంత సైజు అనేది ఆపిల్ రివీల్ చేయలేదు. 2227mAh బ్యాటరీ సామర్థ్యంతో పనిచేస్తుంది. రెండేళ్ల క్రితం వచ్చిన ఐఫోన్ 11 బ్యాటరీ కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. సింగిల్ ఛార్జ్ చేస్తే.. ఏడు గంటల వరకు ఛార్జ్ పనిచేస్తుంది.