iPhone 12 : ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

iPhone 12 Discount : ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. భారత మార్కెట్లో ఐఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

iPhone 12 : ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Iphone 12 Selling With Rs 12,000 Discount On Amazon With No Catch

iPhone 12 Discount : ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. భారత మార్కెట్లో ఐఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 13 మాత్రమే కాదు.. ఐఫోన్ 12తో సహా అనేక ఇతర ఆపిల్ ఐఫోన్ మోడళ్లు భారత మార్కెట్లో భారీ తగ్గింపుతో అమ్ముడవుతున్నాయి. Amazon ప్రస్తుతం iPhone 12 ఫోన్ 64GB స్టోరేజీపై రూ. 12,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. తగ్గింపు ధరతో ఐఫోన్ 12ను రూ. 53,900కే సొంతం చేసుకోవచ్చు. అలాగే రూ. 12,000 డిస్కౌంట్ iPhone 13 మోడల్ బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లపై మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 64GB స్టోరేజ్ మోడల్ పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్‌లలో వరుసగా రూ. 5,000, రూ. 10,000 ఫ్లాట్ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. Apple ఆన్‌లైన్ స్టోర్‌లో iPhone 12 అధికారికంగా రూ. 65,900 అందుబాటులో ఉంది.

Amazon ప్లాట్ ఫాంపై iPhone 12 (128GB స్టోరేజ్) మోడల్‌పై రూ.11,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీని ధర రూ. 59,900కి తగ్గింది. వాస్తవానికి, iPhone 12 128GB స్టోరేజ్ మోడల్‌ను రూ. 70,900 ధరతో లాంచ్ అయింది. అదనంగా, ఈ-కామర్స్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లపై రూ. 11,650 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ. 2,000 వరకు తగ్గింపును అందిస్తోంది. మీరు iPhone 12 కోసం ఎక్స్ఛేంజ్ ఆఫర్ కావాలంటే మీ పాత ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే, మీరు iPhone 11 కోసం iPhone 12ని ఎక్స్ఛేంజ్ చేస్తే మాత్రమే.. గరిష్ట ఎక్స్ఛేంజ్ వర్తిస్తుందని గుర్తించాలి.

Iphone 12 Selling With Rs 12,000 Discount On Amazon With No Catch (1)

Iphone 12 Selling With Rs 12,000 Discount On Amazon With No Catch 

మీరు ఐఫోన్ 12 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం.. ముఖ్యంగా, iPhone 12 (64GB, 128GB స్టోరేజీ)పై మాత్రమే డిస్కౌంట్ అందుబాటులో ఉంది 256GB స్టోరేజీపై ఎలాంటి డిస్కౌంట్ అందుబాటులో లేదు. అమెజాన్ మాత్రమే కాదు.. ఐఫోన్ 12పై కూడా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,910 డిస్కౌంట్ అందిస్తోంది. అయితే, డిస్కౌంట్ (PRODUCT) రెడ్‌లో ఉన్న 64GB స్టోరేజ్ మోడల్‌పై మాత్రమే అందుబాటులో ఉంటుంది. Flipkart రూ. 13,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.

Read Also : Iphone 12: ఐఫోన్ 12 అద్భుతమైన డీల్ రూ.24వేల900కే..