Amazon Discount: అమెజాన్‌లో ఐఫోన్ 12పై రూ.12వేలు డిస్కౌంట్

ఐఫోన్ 13మీదే కాదు ఇతర యాపిల్ ఐఫోన్ మోడల్స్ పైనా డిస్కౌంట్ తీసుకొచ్చింది అమెజాన్. ప్రస్తుతం ఐఫోన్ 12 64జీబీ స్టోరేజిపై రూ.12వేలు డిస్కౌంట్ అందించనుంది. ఫలితంగా రూ.53వేల 900కే అందుతుంది.

Amazon Discount: అమెజాన్‌లో ఐఫోన్ 12పై రూ.12వేలు డిస్కౌంట్

Amazon Summer Sale

Amazon Discount: ఐఫోన్ 13మీదే కాదు ఇతర యాపిల్ ఐఫోన్ మోడల్స్ పైనా డిస్కౌంట్ తీసుకొచ్చింది అమెజాన్. ప్రస్తుతం ఐఫోన్ 12 64జీబీ స్టోరేజిపై రూ.12వేలు డిస్కౌంట్ అందించనుంది. ఫలితంగా రూ.53వేల 900కే అందుతుంది.

నిజానికి ఐఫోన్ 12 యాపిల్ ఆన్లైన్ స్టోర్లలో రూ.65వేల 900కే అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 128స్టోరేజి మోడల్ పై రూ.11వేల డిస్కౌంట్ ఇస్తుంది. అలా రూ.59వేల 900కు వస్తుంది. ఒరిజినల్ గా ఐఫోన్ 12 128 స్టోరేజి మోడల్ రూ.70వేల 900కే అనౌన్స్ చేశారు.

దాంతో పాటు ఎక్స్‌ఛేంజ్ గా రూ.11వేల 650వరకూ డిస్కౌంట్ ఇస్తుండటంతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ మీద రూ.2వేల డిస్కౌంట్ వస్తుంది. కాకపోతే పాత ఫోన్ కండిష్ ను బట్టి ఎక్స్‌ఛేంజ్ వాల్యూ ఉంటుంది.ఐఫోన్ 12కోసం ఐఫోన్ 11ను మాత్రమే ఎక్స్‌ఛేంజ్ చేయాల్సి ఉంటుంది.

Read Also : అమెజాన్‌లో వన్‌ప్లస్ 9ప్రోపై భారీ డిస్కౌంట్.. ఎంతంటే?

అమెజాన్ లో మాత్రమే కాకుండా ఫ్లిప్ కార్ట్ లో కూడా రూ.10వేల910 డిస్కౌంట్ వస్తుంది. ఐఫోన్ 12 రెడ్ కలర్ మోడల్ కు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడి కొనుగోలు చేస్తే..వాళ్లకు 10శాతం డిస్కౌంట్ అంటే దాదాపు రూ.13వేల వరకూ ఎక్స్‌ఛేంజ్ విలువ అందిస్తున్నారు.