Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 11 సిరీస్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఐఫోన్ మోడల్ ధర ఎంత తగ్గనుందంటే?

Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం (Flipkart) సెప్టెంబర్ 23న ఫెస్టివల్ సేల్ ఈవెంట్‌ (Flipkart Festival Sale)ను నిర్వహించనుంది. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ (Big Billion Days Sale)కు ముందే.. కంపెనీ కొన్ని ఆకర్షణీయమైన ఆపిల్ ఐఫోన్ డీల్స్ వెల్లడించింది.

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 11 సిరీస్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఐఫోన్ మోడల్ ధర ఎంత తగ్గనుందంటే?

iPhone 13 at Rs 49,990 and iPhone 11 under Rs 30,000_ Check Flipkart sale deals

Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం (Flipkart) సెప్టెంబర్ 23న ఫెస్టివల్ సేల్ ఈవెంట్‌ (Flipkart Festival Sale)ను నిర్వహించనుంది. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ (Big Billion Days Sale)కు ముందే.. కంపెనీ కొన్ని ఆకర్షణీయమైన ఆపిల్ ఐఫోన్ డీల్స్ వెల్లడించింది. అందులో ఐఫోన్ 13 (iPhone 13), ఐఫోన్ 11 (iPhone 11), ఐఫోన్ 12 మినీ (iPhone 12mini) మరిన్నింటితో సహా కొన్ని డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లను అందించనుంది. మీరు ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు నచ్చిన ఐఫోన్ మోడల్ కొనేందుకు ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సమయంలో, ఐఫోన్ 13 భారత మార్కెట్లో రూ. 49,990 ధరతో అందుబాటులో ఉంది.

iPhone 13 at Rs 49,990 and iPhone 11 under Rs 30,000_ Check Flipkart sale deals

iPhone 13 at Rs 49,990 and iPhone 11 under Rs 30,000_ Check Flipkart sale deals

ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 13 ధరను రూ.69,990కి తగ్గించింది. ఈ ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ. 20,000 డిస్కౌంట్ అందించాలని యోచిస్తోందని భావిస్తోంది. కొన్ని ఫ్లాట్ డిస్కౌంట్‌లు కాకుండా బ్యాంక్ కార్డ్‌లు, ప్రీపెయిడ్ ఆర్డర్‌లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ల ఆధారంగా ఆఫర్ అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ సేల్ ఈవెంట్‌ దగ్గరలో ఉంది. త్వరలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆపిల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదని గుర్తించుకోండి. ప్రత్యేకించి ఆపిల్ ఐఫోన్ కోసం మీరు సపరేటుగా ఛార్జర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకరకంగా ఇది మీకు అదనంగా ఖర్చు అనమాటే..

iPhone 13 at Rs 49,990 and iPhone 11 under Rs 30,000_ Check Flipkart sale deals

iPhone 13 at Rs 49,990 and iPhone 11 under Rs 30,000_ Check Flipkart sale deals

ఫ్లిప్‌కార్ట్ రిలీజ్ చేసిన టీజర్లలో ఐఫోన్ 11 (iPhone 11 Price) ధర రూ. 30,000 లోపు ఉంటుందని, ఐఫోన్ 12 మినీ రూ. 40,000 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అంతేకాదు.. ఐఫోన్ 13 ప్రో (iPhone 13)Pro iPhone 13 Pro Max కూడా ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డేస్ సేల్ సమయంలో భారీ డిస్కౌంట్ అందుకోనున్నాయి. ఈ డివైజ్ ధర వరుసగా రూ. 90వేల నుంచి 1,00,000 లోపు ఉంటుంది. ఖచ్చితమైన ధరతో పాటు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి. అయితే Flipkart ఖచ్చితమైన iPhone డీల్స్ అందించనున్నట్టు ధృవీకరించింది. ఫ్లిప్‌కార్ట్ అందించే చాలా డీల్స్‌లో ఫ్లాట్ డిస్కౌంట్‌లు, బ్యాంక్ అలాగే ప్రీపెయిడ్ ఆఫర్‌లు కూడా ఉంటాయని గుర్తించుకోండి.

Read Also : Flipkart Big Billion Days Sale Date : ఫ్లిప్‌కార్ట్ సేల్ ఎప్పుడో తెలిసిందోచ్.. ఐఫోన్ 13, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు.. డేట్ & టైమ్ రాసి పెట్టుకోండి..!