iPhone 13: దీపావళి స్పెషల్ ఆఫర్.. ఐఫోన్‌ 13పై భారీ తగ్గింపు!

ఆపిల్ దీపావళిని పురస్కరించుకుని స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఖరీదైన ఐఫోన్ (iPhone 13 Series) తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

iPhone 13: దీపావళి స్పెషల్ ఆఫర్.. ఐఫోన్‌ 13పై భారీ తగ్గింపు!

Iphone 13 Is Available At Rs 55,900 This Diwali, Here Is How The Deal Works

iPhone 13 Series Diwali Deal : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ దీపావళిని పురస్కరించుకుని స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఖరీదైన ఐఫోన్ (iPhone 13 Series) తక్కువ ధరకే సొంతం చేసుకోవాలంటే ఇదే సరైన సమయం. మళ్లీ ఈ ధరలో ఐఫోన్ అందుబాటులో ఉండకపోవచ్చు. పరిమిత ఆఫర్ కూడా. ఆపిల్ అందించే రూ. 79,900 విలువైన ఐఫోన్ 13 సిరీస్‌ను భారీ డిస్కౌంటుతో రూ. 55,900కే అందించనుంది. అంటే.. అసలు ధరతో పోలిస్తే.. రూ.14వేల నుంచి రూ.24,000 వరకు తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు.

ఆపిల్ రిటైలర్లలో ఈ డిస్కౌంట్ ఆఫర్ అందరికి వర్తిస్తుంది. ఈ ఐఫోన్ అసలు ధర రూ. 79,900 ఉంది. డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్, క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద రూ. 55,900కు సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ అందించే ఈ భారీ డిస్కౌంట్ కు సంబంధించి కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో తెలుసుకోవచ్చు. ఐఫోన్13 సిరీస్.. డిస్కౌంట్ ఆఫర్ కింద రూ. 24,000 తగ్గింపు లభిస్తుంది. HDFC బ్యాంక్ ద్వారా రూ. 6000 క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.
Read Also : Apple iPhone 12 : ఐఫోన్ ఆర్టర్ చేస్తే..2 నిర్మా సబ్బులొచ్చాయి

మీ దగ్గర పాత ఐఫోన్XR 64GB ఉంటే.. ఎక్స్ఛేంజ్ కింద రూ. 15,000 వరకు పొందవచ్చు. దీనికి రూ. 3,000 ఎక్స్ఛేంజ్(Exchange) బోనస్ అదనంగా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ కింద.. ఇతర ఫోన్ మోడళ్లకు ఆఫర్ వర్తిస్తుందో కంపెనీ వెబ్‌సైట్లో చెక్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ చేయాలనుకునే ఫోన్ మోడల్స్, కండీషన్ ఆధారంగా ఆఫర్ వర్తిస్తుంది.

ఐఫోన్ 13 సిరీస్ ఫీచర్ల విషయానికొస్తే.. 6.1 అంగుళాల XR OLED డిస్‌ప్లే అందిస్తోంది. ప్రైమరీ కెమెరా 12MP ప్రధాన ఆకర్షణగా ఉండగా.. వీడియోలు సినిమాటిక్ మోడ్ ఫీచర్ అందిస్తోంది. మీరు తీసే వీడియోలన్నీ మూవీ షూట్ చేసినంత క్వాలిటీగా హైరెజుల్యుషన్ ఉంటాయి. ఐఫోన్ 12 మోడల్స్ కంటే ఐఫోన్ 13లో హైస్టోరేజ్ (128GB) కేపాసిటీ అందిస్తోంది. లేటెస్ట్ A15 బయానిక్ చిప్, iOS15తో రన్ అవుతుంది. 5G నెట్‌వర్క్ కనెక్టివిటీ, 3,227mAh సామర్థ్యం, బ్యాటరీ, 20W ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
Read Also : Meta Smartwatch : ఆపిల్‌కు పోటీగా.. ఫేస్‌బుక్ ఫ్రంట్ కెమెరా స్మార్ట్‌వాచ్.. ఫొటో లీక్!