iPhone 13 Order Cancelled : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే క్యాన్సిల్.. కంగుతిన్న కస్టమర్లు.. అసలు కారణం ఇదేనట!

iPhone 13 Order Cancelled : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) నుంచి ఆపిల్ iPhone 13ని ఆర్డర్ చేసిన కొంతమంది కస్టమర్లు ఐఫోన్‌ అందుకోలేదు. ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ ఆర్డర్ చేసిన కొద్ది గంటల్లోనే క్యాన్సిల్ అయింది. చాలామంది కస్టమర్లకు ఇదే సమస్య ఎదురైంది.

iPhone 13 Order Cancelled : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే క్యాన్సిల్.. కంగుతిన్న కస్టమర్లు.. అసలు కారణం ఇదేనట!

iPhone 13 Order Cancelled : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) నుంచి ఆపిల్ iPhone 13ని ఆర్డర్ చేసిన కొంతమంది కస్టమర్లు ఐఫోన్‌ అందుకోలేదు. ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ ఆర్డర్ చేసిన కొద్ది గంటల్లోనే క్యాన్సిల్ అయింది. చాలామంది కస్టమర్లకు ఇదే సమస్య ఎదురైంది. అసలు ఏమైందో తెలియక ఐఫోన్ 13 కోనుగోలు కోసం ఆర్డర్ చేసిన కస్టమర్లంతా కంగుతిన్నారు. చివరికి ఏమి చేయాలో తెలియక ట్విట్టర్ వేదికగా వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. కస్టమర్ల ఫిర్యాదులతో స్పందించిన ఫ్లిప్‌కార్ట్ అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కొన్ని ఐఫోన్ 13 ఆర్డర్‌లు రద్దు కావడం వాస్తవమేనని అంగీకరించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సమస్య తలెత్తినట్టు తెలిపింది.

iPhone 13 order cancelled Flipkart reveals reason behind abrupt order cancellation

iPhone 13 order cancelled Flipkart reveals reason behind abrupt order cancellation

ప్రత్యేకించి గుంటూరు, గోరఖ్‌పూర్, సిలిగురితో సహా నగరాల్లో అన్ని ఐఫోన్ ఆర్డర్‌లలో దాదాపు 70 శాతం విజయవంతంగా డెలివరీ అయినట్టు ప్లాట్‌ఫారమ్ తెలిపింది. ఈ కారణంగానే ఆర్డర్లలో కొంతవరకు సేలర్లు రద్దు చేశారని కంపెనీ తెలిపింది. కస్టమర్ ఫోకస్డ్ ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌గా పేరొందిన ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్‌ల ఆర్డర్‌లకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సేలర్లను ప్రోత్సహిస్తున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

తమ ఐఫోన్ 13 ఆర్డర్ రద్దు అయిందంటూ ఫ్లిప్‌కార్ట్ వేదికగా కొంతమంది కొనుగోలుదారులకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ విషయాన్ని నివేదించేందుకు చాలా మంది కస్టమర్లు ట్విట్టర్‌ వేదిగా ఫిర్యాదు చేశారు. మీ ఐఫోన్ ఆర్డర్ కూడా రద్దు అయితే మీరు మాత్రమే కాదని గుర్తించుకోండి. ఫ్లిప్‌కార్ట్ అందించే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) మొదటి రోజున ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13ని రూ.47వేల కన్నా తక్కువ ధరకే అందించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రతి కొన్ని గంటలకు ఐఫోన్ మోడల్ ధరను పెంచనుంది. చాలా మంది కస్టమర్‌లు ఇప్పటికీ రూ. 50వేల లోపు మోడల్‌ను పొందారు.

iPhone 13 order cancelled Flipkart reveals reason behind abrupt order cancellation

iPhone 13 order cancelled Flipkart reveals reason behind abrupt order cancellation

iPhone 13 మోడల్‌ను బుక్ చేసేందుకు ప్రయత్నించిన కస్టమర్లకు పేమెంట్స్ చేయడంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం, iPhone 13 128GB స్టోరేజీ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లోనూ అందుబాటులో లేదు. ఇతర రెండు మోడల్‌లు 256GB, 512GB మోడల్‌లు వరుసగా రూ. 66,990, రూ. 86,990 ధరలకు అందుబాటులో ఉన్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా Axis, ఐసిఐసిఐ ICICI బ్యాంక్ కార్డ్‌లతో షాపింగ్ చేయడంపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 30తో ముగియనుంది.

Read Also : iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 13 ధర మళ్లీ తగ్గిందోచ్.. క్రోమాలో దీపావళి సేల్.. ఇప్పుడే కొనేసుకోండి..!