Apple IPhone : ఐఫోన్ 13 ప్రి బుకింగ్స్ స్టార్ట్

ఐ ఫోన్ 13 ప్రి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఐ ఫోన్ 12తో పోలిస్తే..పలు అప్ డేట్స్ తో న్యూ ఫోన్ ను ఇండియాలో ప్రారంభించారు.

10TV Telugu News

IPhone 13 Pre-Booking : ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఐ ఫోన్ 13 ప్రి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఐ ఫోన్ 12తో పోలిస్తే..పలు అప్ డేట్స్ తో న్యూ ఫోన్ ను ఇండియాలో ప్రారంభించారు. ఈ ఫోన్ అమ్మకాలు మాత్రం సెప్టెంబర్ 24వ తదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఐ ఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రొ, ఐ ఫోన్ 13 ప్రొ మ్యాక్స్ లను ఆపిల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. బుకింగ్ చేసుకోవచ్చని సదరు సంస్థ వెల్లడించింది.

Read More : Priyanka Chopra : సారీ చెప్పిన ప్రియాంక..

ఆఫ్ లైన్ స్టోర్లతో పాటు ఆన్ లైన్, ఈ కామర్స్ సైట్లలో బుకింగ్ చేసుకొనే అవకాశం కల్పించారు. ఆపిల్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ గ్రామ్ మ్యాక్రో 3200 లోకేషన్ లలో కొత్త మోడల్ విక్రయాలు జరుగనున్నాయి. రెడింగ్టన్ 3500 లోకేషన్లలో, అమెజాన్, ప్లిఫ్ కార్ట్ లలో ఫ్రీ ఆర్డర్లు ఇవ్వొచ్చు. ఆపిల్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర HDFC కార్డులు ఉపయోగించి…ప్రీ బుకింగ్స్ చేసే వాళ్లకు మోడల్ ను బట్టి రూ. 6 వేలు, రూ. 5 వేలు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఇక ధర విషయానికి వస్తే.. ఐఫోన్ 13 సిరీస్ ఇండియాలో రూ. 69 వేల 900 నుంచి ప్రారంభం కానుంది. 256 జీబీ ధర రూ. 79 వేల 900, 512 జీబీ ధర రూ. 99 వేల 900 గా ఉంది. ఐ ఫోన్ 13ప్రొ మ్యాక్స్ 1 టీబీ వెరియంట్ ధర రూ. 1,79,900గా ఉంది.